• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Legal >  జగన్‌ కేసులపై...

జగన్‌ కేసులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!

| ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ కేసుల విచారణను తెలుగు రాష్ట్రాల నుంచి బదిలీ చేయాలని ఎంపీ రఘురామ సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసిన సంగతి తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2024-01-19 10:06 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ కేసుల విచారణను తెలుగు రాష్ట్రాల నుంచి బదిలీ చేయాలని ఎంపీ రఘురామ సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసిన సంగతి తెలిసిందే. వీటిలో జగన్ బెయిల్ రద్దు గురించి కూడా ట్రిపుల్ ఆర్ పిటిషన్ వేశారు. ఈ సమయంలో తాజాగా ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా జగన్‌ కేసుల విచారణ ఎందుకు ఆలస్యమవుతోందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది!

అవును... జగన్ కేసులకు సంబంధించిన విచారణ ఎందుకు ఆలస్యం అవుతుందంటూ ఈరోజు సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ సమయంలో అందుకు సమాధానంగా స్పందించిన సీబీఐ తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా... ఇందుకు తాము బాధ్యులం కాదని తెలిపారు. ఇదే సమయంలో... లోయర్‌ కోర్టులో వాయిదాలతో తమకు సంబంధం లేదని వెల్లడించారు!

ఈ సందర్భంగా స్పందించిన జగన్‌ తరఫు న్యాయవాదులు... ప్రజాప్రతినిధులపై దాఖలైన పిటిషన్‌ లను వేగంగా విచారించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను ప్రస్థావించారు.. అందువల్ల విచారణ ముగించాలని కోరారు. ఇదే సమయంలో... హైకోర్టు సుమోటోగా ఆదేశాలు ఇచ్చినందున 3 నెలల గడువు ఇవ్వాలని కోరారు!

దీంతో స్పందించిన అత్యున్నత న్యాయస్థానం... తాము ఈ పిటిషన్‌ లపై విచారణ ముగించడం లేదని స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఇంత కాలయాపన ఏంటంటూ అసహనం వ్యక్తం చేసిందని తెలుస్తుంది. ఇదే సమయంలో పిటిషనర్ రఘురామ కృష్ణరాజు గురించి జగన్‌ తరఫు న్యాయవాది నిరంజన్‌ రెడ్డి స్పందించారు. ఇందులో భాగంగా... రాజకీయ దృక్పథంతో పిటిషన్‌ దాఖలు చేశారని అన్నారు!

ఇదే సమయంలో... వైఎస్సార్సీపీ రఘురామ కృష్ణంరాజుపై చర్యలు తీసుకోవడం వల్ల గత మూడేళ్లుగా పార్టీ కార్యకలాపాలకు ఆయన విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని జగన్ తరుపు న్యాయవాది తెలిపారు! ఆయనపై అనర్హత పిటిషన్‌ దాఖలు చేసినందునే జగన్ పై ఇక్కడ ఈ పిటిషన్లు దాఖలు చేశారని తెలిపారు!

ఈ సందర్భంగా స్పందించిన సుప్రీం... గత ఏడాది డిసెంబర్‌ 15న పలుకుబడి ఉన్న వ్యక్తులు కేసులను త్వరితగతిన విచారణ పూర్తి చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చినందున.. ఏం జరుగుతుందో చూద్దామని పేర్కొన్న ధర్మాసనం... తదుపరి విచారణను ఏప్రిల్‌ లో చేపట్టనున్నట్లు తెలిపింది!

Tags:    
  • Supremecourt 
  • Jaganmohanreddy 
  • Raghuramakrishnamraju 
  • Ysrcp 
  • Telanganahighcourt 

Similar News

పవన్ విడాకులు.. అసలు చట్టం ఏం చెబుతోంది!

2026-11-10 12:51 GMT

అరెస్ట్ అయితే చాలు.. ఇక 'ఉద్యోగానికి' సెలవు.. సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పుతో అవినీతి తిమింగలాలకు వణుకు

2026-11-10 06:00 GMT

ఓబీసీ క్రీమీలేయ‌ర్‌.. మ‌రింత క‌ఠిన‌మా? సుప్రీంకోర్టు ఏం చెప్పింది!

2026-11-07 13:45 GMT

భర్త మహాశయులారా? భార్యకు భరణం ఎగ్గొట్టే ప్లాన్ చేయకండి.. ఇలా బుక్కవుతారు..

2026-11-07 02:19 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

సోషల్ మీడియా స్వేచ్ఛకు కొత్త సవాల్..

2026-11-06 05:47 GMT

చంద్రబాబు మీద కేసులు.... సీబీఐకి అప్పగించాలి !

2026-11-06 03:47 GMT

పొగ‌డ్త‌లే కాదు.. విమ‌ర్శ‌లనూ త‌ట్టుకోవాలి నాయ‌కా: హైకోర్టు సంచ‌ల‌న తీర్పు

2026-11-03 22:30 GMT

మియాపూర్‌లో రూ. వేల కోట్ల భూములకు రక్షణ.. 23 ఏళ్ల పోరాటానికి సుప్రీంకోర్టు తెర!

2026-10-30 04:01 GMT

సుప్రీంకోర్టు అదిలిస్తే తప్ప క్యాన్సర్ మందుల ధరలు తగ్గించరన్న మాట.. భారీగా తగ్గిన ధరలు

2026-10-29 06:35 GMT

11 వేల ఇంజెక్షన్ లక్షా 30 వేలా...కేంద్రాన్ని నిలదీసిన సుప్రీంకోర్టు !

2026-10-28 03:36 GMT

19 మున్సిపల్ ఎన్నికలపై సందిగ్ధం.. సుప్రీం ఆదేశాలతో ఎస్ఈసీ తర్జనభర్జన!

2026-10-21 14:54 GMT

Copyright @2026

Powered by Blink CMS