• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Real Estate >  10 ఎకరాలు.. రూ.400 కోట్ల...

10 ఎకరాలు.. రూ.400 కోట్ల ఫాం హౌస్.. 2 రోజుల్లో నేలమట్టం

| అయితే, ఈ ఫామ్ హౌస్ ను శుక్ర, శనివారాల్లో అధికారులు కూల్చేశారు. పాంటీ చద్దా కుటుంబానికి చెందిన ఈ ఫామ్ హౌస్ అక్రమం అని ఢిల్లీ డెవలప్‌మెంట్‌ అథారిటీ (డీడీఏ) అధికారులు పేర్కొంటున్నారు.

By - Tupaki Desk
Update: 2024-03-03 14:30 GMT

ఢిల్లీ అంటే ఒక మూడు దశాబ్దాల కిందట క్రైం రేట్ అధికంగా ఉండే ప్రాంతం. రాత్రి ఏడు దాటితే దుకాణాలు బంద్.. దేశ రాజధాని అయినా.. ఆర్గనైజ్డ్ క్రైం ఎక్కువగా జరిగేది. అలాంటిది కాలంతో పాటే పరిస్థితులు మారాయి... కానీ, ఎక్కడైనా మాఫియా మాత్రం అలాగే ఉంటుంది. ఢిల్లీ పొరుగున ఉన్న యూపీ అసలే అనేక రకాల మాఫియాకు కేంద్రం. హరియాణ, పంజాబ్ కూడా.. ఇప్పుడు ఇలాంటి లిక్కర్ మాఫియా అధినేత ఫామ్ హౌస్ కూల్చివేత అత్యంత చర్చనీయాంశం అవుతోంది.

ఆయన యూపీ లిక్కర్ కింగ్..పాంటీ చద్దా.. అలియాస్ గుర్దీప్ సింగ్.. యూపీలో లిక్కడర్ డాన్. దీనికితోడు రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లోనూ ఉన్నారు. ఆయన కుటుంబానికి డిల్లీ ఛత్రపూర్ ఏరియాలో ఫామ్ హౌస్ ఉంది. పది ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ఫామ్ హౌస్ విలువు రూ.400 కోట్ల పైమాటే అని చెబుతున్నారు. అంటే ఎకరం రూ.40 కోట్లు కింద లెక్కగట్టారు.

అయితే, ఈ ఫామ్ హౌస్ ను శుక్ర, శనివారాల్లో అధికారులు కూల్చేశారు. పాంటీ చద్దా కుటుంబానికి చెందిన ఈ ఫామ్ హౌస్ అక్రమం అని ఢిల్లీ డెవలప్‌మెంట్‌ అథారిటీ (డీడీఏ) అధికారులు పేర్కొంటున్నారు. దీంతో డీడీఏ సిబ్బంది సామగ్రితో తరలివచ్చి ఫాంహౌస్ ను నేలమట్టం చేశారు.

ప్రభుత్వ భూమిని ఆక్రమించి..పాంటీ చద్దా ఫాం హౌస్ ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మించినదిగా చెబుతున్నారు. అయితే, ఇప్పుడు ఆ ఫాంహౌస్ పాంటీ చద్దా కుమారుడు మన్‌ప్రీత్‌ అలియాస్‌ మాంటీ కబ్జాలో ఉంది. పాంటీ, అతడి చిన్న తమ్ముడు హర్దీప్‌ మధ్య ఇక్కడ గొడవ జరిగింది. దీంతో హర్దీప్‌ తుపాకీతో పాంటీని కాల్చి చంపాడు. తర్వాత పాంటీ అంగరక్షకుడు హర్దీప్‌ ను కాల్చేశాడు. కాగా, ఢిల్లీ వంటి నగరంలో లేదా దాని సమీపంలో 10 ఎకరాల్లో ఫాంహౌస్ అక్రమంగా ఉంటే ఇన్నాళ్లూ అధికారులు ఏం చేశారనేది ప్రశ్న. ఇక పాంటీ ఫాంహౌస్ లో శుక్రవారం ఐదు ఎకరాలను స్వాధీనం చేసుకున్నారు. శనివారం ప్రధాన బిల్డింగ్ నూ కూల్చివేశారు. మొత్తం భూమిని ఆధీనంలోకి తీసుకున్నారు.

ఇందులో గార్డెన్‌, ఔట్‌ హౌస్‌, ప్రధాన భవనం ఉన్నాయి. కాగా, చడ్డాకు వేవ్ గ్రూప్ తమ ఫాం హౌస్ కూల్చివేతపై స్పందించలేదు. ఇదే గ్రూప్ నకు యూపీ లిక్కర్‌, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాల్లో ఉంది. ఈ వ్యవహారం ఎక్కడకు దారితీస్తుందో చూడాలి.

Tags:    
  • Illegalfarmhouse 
  • 400crores 
  • Delhi 
  • Liquorbaronponty 
  • Governmentland 
  • Garden 
  • Outhouse 
  • Politicalnews 

Similar News

ట్రంప్ టవర్స్‌లో షాకింగ్ పరిస్థితులు.. కోట్ల ఫ్లాట్ కొన్నా కర్టెన్లు లేవు.. లిఫ్ట్ లేదు

2026-11-02 18:26 GMT

హైదరాబాద్ రియల్ ముందుకా ? వెనక్కా ?

2026-10-12 07:30 GMT

ఆఫీస్ స్పేస్: పలు నగరాల్లో క్షీణత.. హైదరాబాద్ అందుకు భిన్నం

2026-10-11 16:47 GMT

బంగారు గనిలా మారిన ‘హైదరాబాద్ ఐటీ కారిడార్’

2026-08-29 04:48 GMT

రియల్ మంటల్లో మన భాగ్యనగరం.. మిగతా ఊర్లు చల్లబడినా... ఇక్కడ మాత్రం 'హౌస్'ఫుల్లే

2026-08-23 13:30 GMT

దేశంలోనే టాప్ 2.. రియల్ ఎస్టేట్‌లో భాగ్యనగరం దూకుడు

2026-08-18 11:30 GMT

"మేక్ కోకాపేట్ గ్రేట్ ఎగైన్!".. భాగ్యనగరంలో ట్రంప్ 65 అంతస్తుల విలాసవంతమైన సర్కస్!

2026-08-11 13:29 GMT

కోహ్లీ ఒక్క‌డే కాదు.. ముంబైని కొనేస్తున్న టాప్ -5 సెల‌బ్రిటీలు ఎవ‌రో తెలుసా?

2026-07-27 12:39 GMT

హైద‌రాబాద్‌లో 63,700 ఇళ్ల ప‌రిస్థితి? రియ‌ల్ ఎస్టేట్‌పై వార్ పంచ్!

2026-06-13 20:05 GMT

బిగ్ చేంజ్ : వైజాగ్ మీద రియల్ ఫోకస్ !

2026-06-02 03:32 GMT

అపార్ట్‌మెంట్ నిర్వహణ నియమాలు: నివాసితులకు చ‌ట్టం గురించి ఏం తెలుసు?

2026-05-31 00:30 GMT

ఎకరా రూ.237 కోట్లకు కొనేసి గౌర వెంచర్స్ బ్యాక్ గ్రౌండ్ ఇదే!

2026-05-29 04:49 GMT

Copyright @2026

Powered by Blink CMS