• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కూటమిలో అంతర్మధనం...

కూటమిలో అంతర్మధనం -ఐక్యంగా లౌక్యంగా !

| ఈ నేపథ్యంలో కూటమి పెద్దలుగా ప్రభుత్వంలో పెద్దలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉండవల్లిలోని ఆయన నివాసంలో కలసి కూర్చుని అనేక అంశాలు చర్చించారు.

By - Satya P
Update: 2026-02-05 04:08 GMT

ఏపీలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాల మీద టీడీపీ నాయకత్వంలోని కూటమి పెద్దలు పూర్తి స్థాయిలో మధింపు చేస్తున్నారు. ఒక విధంగా జరిగిన వాటి మీద సమీక్ష చేస్తున్నారు. వైసీపీ నేతలు రెచ్చగొడుతున్నారని ఆ ట్రాప్ లోకి కూటమి నేతలు వెళ్తున్నారన్నది పెద్దల అభిప్రాయంగా ఉంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇష్యూలో ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసి అభాసుపాలు అయ్యారని అదే సమయంలో ఆయన ఇంటి మీద దాడులు కానీ వరసబెట్టి జోగి రమేష్ ఇంటి మీద దాడులు కానీ చేయడం ద్వారా కొందరు అతి ఉత్సాహ పరులు చేసిన పనుల ద్వారా కూటమికి ఇబ్బంది కలుగుతోందని అంటున్నారు.

ఆచీ తూచీ :

ఈ నేపథ్యంలో కూటమి పెద్దలుగా ప్రభుత్వంలో పెద్దలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉండవల్లిలోని ఆయన నివాసంలో కలసి కూర్చుని అనేక అంశాలు చర్చించారు. ప్రధానంగా ఏపీలో సాగుతున్న రాజకీయ ఘర్షణలు మాటల తూటాలు లా అండ్ ఆర్డర్ మీద తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని భావిస్తున్నారు. కూటమి పార్టీల నేతలు అప్రమత్తంగా ఉండాలని ఆచీ తూచీ స్పందించాలని కూడా ఈ సమావేశంలో నాయకులు ఇద్దరూ చర్చించుకున్నారు అని అంటున్నారు.

అధికార పక్షంగా :

ఏపీలో ఏమి జరిగినా అధికార పక్షం వైపే వేలెత్తి చూపే పరిస్థితి ఉంటుందని అంటున్నారు. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ దెబ్బ తింటే గత ఇరవై నెలలుగా చేసిన అభివృద్ధి పక్కకు పోతుందని కూడా కూటమి పెద్దలు ఆలోచిస్తున్నారు. వైసీపీ అయితే రెచ్చగొట్టే వైఖరిని తీసుకుంటోందని కొంత మంది కూటమిలోని నేతలు కూడా అనవసరంగా ట్రాప్ లో చిక్కుకుంటున్నారు అన్న భావన కూడా పెద్దలలో వ్యక్తం అవుతోంది. ఇక మీదట ఎవరూ అతిగా స్పందించకుండా అలెర్ట్ గా ఉండాలని కూడా పార్టీ పెద్దలు అభిప్రాయపడుతున్నారు.

అంతా కలసిమెలసి :

కూటమిలో మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి. అందువల్ల ప్రభుత్వం మీద వైసీపీ చేసే ఏ విమర్శను అయినా అంతా కలసి కట్టుగానే ఎదుర్కోవాలని ధీటుగా బదులు ఇవ్వాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. వైసీపీకి ఏ విధమైన చాన్స్ కూడా అసలు ఇవ్వరాదని భావిస్తున్నారు. కూటమి పాలన పట్ల పాజిటివిటీ ఉందని దానిని పాడు చేసుకునే విధంగా కూటమి పార్టీలో క్యాడర్ సహా ఎవరూ వ్యవహరించరాదన్నది పెద్దల మాటగా ఉంది.

మరోసారి మీట్ :

ఇదిలా ఉంటే గురువారం మరోసారి చంద్రబాబు నివాసమైన ఉండవల్లిలో ముఖ్యమంత్రి బాబు, ఉప ముఖ్యమంత్రి పవన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ కలసి కూర్చుని అన్ని విషయాలు చర్చిస్తారు అని అంటున్నారు. అదే విధంగా శ్రీవారి లడ్డూ విషయంలో కూడా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏమి చేయాలి అన్న దాని మీద కూడా చర్చిస్తారు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే కూటమి పార్టీలు అన్నీ అలెర్ట్ అయ్యాయని అంటున్నారు. గత కొద్ది రోజుల పరిణామాలు చూస్తే రాజకీయాలలో పై చేయి ఎవరిది అన్నది పక్కన పెడితే కూటమి ప్రభుత్వానికి ఏ విధంగానూ చెడ్డ పేరు కానీ ఇబ్బంది కానీ కలుగరాదు అన్నదే పెద్దల ఆలోచనగా ఉన్నట్లుగా చెబుతున్నారు.

Tags:    
  • andhrapradesh 
  • ysrcp 
  • tdp 
  • appolitics 
  • coalition 

Similar News

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

Copyright @2026

Powered by Blink CMS