విజయ్ తో పవన్...వైసీపీ అతి ఉత్సాహం
తమిళనాడు ఎన్నికల ఫలితాల మీద అనేక సర్వే సంస్థలు డీఎంకే గెలుస్తుందని నిర్ధారించాయి.;
వైసీపీ సోషల్ మీడియా అతి ఉత్సాహపడుతోంది. రాజకీయంగా ప్రత్యర్ధులను విమర్శించేందుకు ఎనో అంశాలు ఉన్నా కూడా తాము అనుకున్నవి సోషల్ మీడియాలో పెట్టి టార్గెటెడ్ పాలిటిక్స్ కి తెర తీస్తోంది. వైసీపీకి సహజంగానే కూటమిలో చంద్రబాబు తరువాత పవన్ కళ్యాణ్ అసలైన ప్రత్యర్ధి. 2024 ఎన్నికల్లో కూటమి కట్టి మరీ పవన్ వైసీపీని గద్దె దించేందుకు తన వంతుగా కృషి చేశారు. దాంతో వైసీపీకి ఆయన మీద సహజంగానే గుర్రు ఉంటుంది. అవకాశం దొరికితే పవన్ ని లక్ష్యం చేసుకుంటుంది కూడా. ఇపుడు అలాంటి సందర్భం కుదిరిందా లేక వైసీపీ క్రియేట్ చేసుకుందా తెలియదు కానీ తమిళనాడులో టీవీకే అధినేత విజయ్ తో పోలిక పెట్టి జనసేన పవన్ ని సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తోంది. ఇంతకీ దీని వెనక మ్యాటర్ ఏంటి అంటే విజయ్ పొలిటికల్ పెర్ఫార్మెన్స్ పవన్ కంటే బెటర్ అని చెప్పడమే వైసీపీ ఉద్దేశ్యం అంటున్నారు.
ఆ అంచనాలతోనే :
ఇక చూస్తే తమిళనాడు ఎన్నికల్లో విజయ పార్టీ మంచి మెజారిటీతో గెలుస్తుందని యాక్సిస్ మై ఇండియా ఇచ్చిన ఎగ్జిట్ పోల్ అంచనాలను పట్టుకొని ఏపీలో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు పవన్ కళ్యాణ్ ని లక్ష్యంగా చేసుకోవడం విశేషం. తమిళనాడు ఎన్నికల్లో విజయ్ సొంతంగా పోటీ చేసి ఏకంగా అధికారం సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు అదే ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ మొదటి ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓటమిపాలయ్యారని వైసీపీ సోషల్ మీడియా ట్రోల్స్ స్టార్ట్ చేసింది. విజయ్ కంటే పవన్ రాజకీయంగా బాగా వెనుకబడి ఉన్నారని చెప్పడమే వైసిపి సోషల్ మీడియా కార్యకర్తల ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తోంది. ఇలా ఉంటే తమిళనాడు ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది అని ఎగ్జిట్ పోల్స్ సర్వేలు చెప్పిన అంచనాలు చూస్తే కేవలం ఒకే ఒక సంస్థ యాక్సిస్ మై ఇండియా మాత్రమే విజయ్ పార్టీ అధికారంలోకి వస్తుందని స్పష్టం చేసింది.
అసలు ఎందుకిలా అంటే :
తమిళనాడు ఎన్నికల ఫలితాల మీద అనేక సర్వే సంస్థలు డీఎంకే గెలుస్తుందని నిర్ధారించాయి. అయితే విజయ్ పార్టీ తొలి ఎన్నికల్లో 15 శాతం పైగా సాధిస్తుందని అలాగే 30 దాకా అసెంబ్లీ సీట్లను సాధిస్తుందని ఈ సర్వేలు వెల్లడించాయి దీంతో పవన్ కళ్యాణ్ 2019లో పోటీ చేసిన సందర్భాన్ని గుర్తుచేస్తూ ఆనాడు జనసేన ఫలితాలను జత చేస్తూ వైసిపి సోషల్ మీడియా సైన్యం పెద్ద ఎత్తున ట్రోలింగ్ మొదలుపెట్టేసింది. దీని సారాంశం ఏమిటంటే పవన్ కళ్యాణ్ కూడా టాప్ సినిమా హీరోగా ఉంటూ రాజకీయ ప్రవేశం చేశారు ఆయనకు తెలుగు నాట మంచి సినీ గ్లామర్ ఉంది అయినా సరే రాజకీయంగా ఆయన పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు అని చెప్పడమే ఇక్కడ వైసిపి సోషల్ మీడియా ట్రోలింగ్ ల వెనక ముఖ్య ఉద్దేశం. అయితే తమిళనాడులో ఉన్న రాజకీయ నేపథ్యం వేరు తెలుగు నాట ఉన్న రాజకీయ పరిస్థితులు వేరు అని విశ్లేషకులు అంటున్నారు.
నాటి పరిస్థితులు :
ఇదిలా ఉంటే 2019 సమయంలో వైసీపీకి జనంలో మంచి ఆదరణ ఉన్నది ప్రజలు జగన్ ఒక్కసారైనా ముఖ్యమంత్రిగా చూడాలని ఉవ్విళ్ళూరు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ పోటీ చేయడం వల్ల ఆశించిన ఫలితాలను సాధించలేకపోయారని విశ్లేషణలు ఉన్నాయి. ఇక తమిళనాడులో ప్రస్తుత రాజకీయం చూస్తే బలమైన ప్రతిపక్షం అక్కడ లేకపోవడం విజయ్ కి కలిసి వచ్చే అవసరమని అంటున్నారు అందువల్ల విజయ్ ఎక్కువ స్థానాలు సాధించే అవకాశం ఉండవచ్చు అని అభిప్రాయపడుతున్నారు అయితే ఎగ్జిట్ పోల్ ఫలితాలు మే 4న విడుదలయ్యే అసలైన ఫలితాలకు మ్యాచ్ అవుతాయా లేదా అన్నది చూడాల్సి ఉంది. చాలావరకు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అంచనాలు తప్పిన పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఒకవేళ మే 4 ని వచ్చే అసలు ఫలితాలు ఫలితాల్లో విజయ్ పార్టీకి ప్రస్తుతం చెబుతున్నట్టుగా డబుల్ డిజిట్ ఓట్ షేర్ గాని సీట్లు గాని రానిపక్షంలో అప్పుడు వైసిపి సోషల్ మీడియా ఏ విధంగా సమర్ధించుకుంటుందని ప్రశ్నిస్తున్న వారు ఉన్నారు..
సరిపోల్చడం తగదని :
ఇక విజయ్ పార్టీకి ఏ 20 స్థానాలకు మించి సీట్లు దక్కిన పక్షంలో 2024 ఎన్నికల్లో వైసీపీకి దక్కిన 11 సీట్లు చూసి తమకంటే విజయ్ బెటర్ పెర్ఫారర్ అని ఒప్పుకునే పరిస్థితి ఉంటుందా అన్నది వైసీపీ నేతలు ఆలోచించుకోవాలని సూచనలు వస్తున్నాయి నిజానికి తమిళనాడు ఎన్నికలను తెలుగునాట ఎన్నికలతో సరిపోల్చడం తగదని చెబుతున్న వారు ఉన్నారు అక్కడ పరిస్థితి ఆంధ్రాలో ఉన్న పరిస్థితులు వేరు అని అంటున్నారు అయితే వైసిపి సోషల్ మీడియా కార్యకర్తల మాత్రం అవన్నీ పక్కన పెట్టేసి కేవలం జనసేన అధినేత పవన్ ని టార్గెట్ చేయడానికి విజయ్ ని ముందుకు తీసుకొస్తున్నారు అంటున్నారు. ఒకవేళ విజయ్ పార్టీ సింగిల్ డిజిట్ సీట్లు వస్తే ఈ సోషల్ మీడియా సైన్యం ఏం చెబుతారు అని అంటున్న వారూ ఉన్నారు.
ఎన్డీయేతో తో పొత్తు పెట్టుకుంటే :
ఇక తెలుగు రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ 21 స్థానాలు సాధించి ఉపముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు ఆయన రాజకీయ వ్యూహాలు ఎత్తుగడలు వేరు. తన పార్టీని ఆంధ్రాలో విస్తరించి ముందుకు తీసుకెళ్ళాలని ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నారు ఇక తమిళనాడులో కూడా విజయ్ పార్టీ సొంతంగా మెజారిటీ సాధించకపోతే రేపటి రోజున ఎన్డీయేతో తో పొత్తు పెట్టుకుంటే అప్పుడు వైసిపి సోషల్ మీడియా ఏ విధంగా స్పందిస్తుంది అన్నది కూడా ప్రశ్నిస్తున్నారు కేవలం ఎగ్జిట్ ఎగ్జిట్ పోల్ సర్వేలతో పట్టుకొని పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయాలనుకుంటే అది వైసీపీకే చివరికి బూమరాంగ్ అవుతుందని అంటున్న వారు ఉన్నారు మొత్తం మీద చూస్తే పోరుగు రాష్ట్రం తమిళనాడు ఎన్నికలు తెలుగునాట ఆంధ్రాలో రాజకీయ వేడిని రాజేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అవి కాస్త వైసీపీ వర్సెస్ జనసేనగా మారుతున్నాయి వీటికి కొనసాగింపుగా మే 4న వచ్చే ఫలితాలు ఉంటాయా లేదా అన్నదే చూడాల్సి ఉంది