వద్దన్న మండలి ముద్దు అయిందా ?
కట్ చేస్తే నాడు మండలి వద్దు అన్న జగన్ నోటి నుంచే మండలి కీలకం అని ఈ రోజు మాట రావడం పట్ల సర్వత్రా చర్చ సాగుతోంది.;
శాసనమండలి విషయంలో వైసీపీ తన ప్రభుత్వ హయాంలో ఎన్ని పిల్లి మొగ్గలు వేయాలో అన్నీ వేసింది అన్నది అందరికీ తెలిసిందే. మూడు రాజధానుల బిల్లు మండలి ఆమోదం పొందలేదని ఆగ్రహించి ఆనాడు ఏకంగా మండలి రద్దుకే వైసీపీ ప్రభుత్వ పెద్దలు సిద్ధపడ్డారు. మండలిలో టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతీ అభివృద్ధి కార్యక్రమాన్ని అడ్డుకుంటోంది అని కోపంతో మండలి రద్దు చేయాలని అసెంబ్లీలో ప్రత్యేక చర్చకు పెట్టి మరీ తీర్మానాన్ని నెగ్గించారు. అయితే కేంద్రం వద్ద ఈ బిల్లు పెండింగులో పడడంతో కొంతకాలం అది అలా ఆగింది. అయినా మండలి రద్దుకే మా ఓటు అని వైసీపీ పెద్దలు పదే పదే చెప్పుకున్నారు. అయితే వైసీపీకి ఆ తరువాత మెజారిటీ పెరగడంతో క్రమంగా ఆ సంగతి మరచిపోయి కొనసాగించారు. మండలి రద్దు అన్నది లేకుండా వరుసగా ఖాళీ అయిన సీట్లను తమ వారికి ఇచ్చి మరీ రాజకీయంగా లాభపడ్డారు.
మండలే కీలకమా :
కట్ చేస్తే నాడు మండలి వద్దు అన్న జగన్ నోటి నుంచే మండలి కీలకం అని ఈ రోజు మాట రావడం పట్ల సర్వత్రా చర్చ సాగుతోంది. ఒక్కసారి వెనక్కి వెళ్తే 2021 మొదట్లో మండలి రద్దు తీర్మానం మీద ఆయన అసెంబ్లీలో చేసిన ప్రసంగం చూడాలని అంతా అంటున్నారు. ఆనాడు మండలికి పెట్టే ఖర్చు తో సహా దండుగ అన్నారు. అంతే కాదు మండలిలో బిల్లులను అడ్డుకోవడం రాజకీయంగా ఇబ్బందులను క్రియేట్ చేస్తోందని ప్రజా ప్రభుత్వాలకు అది ఆటంకంగా మారుతోందని కూడా ఘాటైన వ్యాఖ్యలే చేశారు. ఇపుడు చూస్తే మండలిలో వైసీపీకి మంచి బలం ఉంది కాబట్టి కూటమి ప్రజా వ్యతిరేక విధానాలను ఎదుర్కోవాలని ప్రజల పక్షాన నిలవాలని జగన్ అనడం మీద ప్రత్యర్ధులు సైతం విమర్శిస్తున్నారు.
పెద్దల సభగానే :
పెద్దల సభ ఎపుడూ హుందాగానే ఉంటూ తన గౌరవాన్ని కాపాడుకుంటూ వస్తోంది. అంతే కాదు ప్రజా సమస్యలను అనేకం అక్కడ పరిష్కరించడానికి ఉత్తమమైన బిల్లుల రూపకల్పనకు కూడా విలువలైన సలహాలు సూచనలు ఇస్తూ ముందుకు నడిపించిన తీరుని కూడా గుర్తు చేస్తున్నారు. మండలి కనుక లేకపోయి ఉంటే ఈ రోజు చట్ట సభలలో వైసీపీ వాయిస్ కూడా వినిపించకుండా పోయేది అని అంటున్నారు. అసెంబ్లీకి వైసీపీ వెళ్ళనని భీషించుకుని కూర్చోవడం వల్ల మండలి వారికి ఇపుడు పూర్తిగా ఆధారంగా మారింది అని అంటున్నారు. అందుకే కార్యనిర్వాహక వ్యవస్థల మె3ఎద ఎపుడూ గౌరవంగానే ఎవరైనా ఉండాలని అంటున్నారు తమకు అనూకూలంగా ఉన్నపుడు ఒక మాట వ్యతిరేకంగా ఉన్నపుడు మరో మాట మాట్లడడం తగదని కూడా అంటున్నారు. మొత్తానికి జగన్ మాట తప్పను మడమ తిప్పని అని ప్రతీ సారీ చెబుతారని మండలి విషయంలో ఆయన రెండూ చేశారని ప్రయ్తర్ధులు అయితే గట్టిగానే అంటున్నారు.