జగన్ నాడు నిప్పు కణిక...మరి నేడు ?

వైసీపీ ఏర్పాటు వెనక ఒక కసి ఆవేశం ఉంది. తమకు కాంగ్రెస్ పార్టీలో అన్యాయం జరిగింది అన్న అవేదన ఆగ్రహం నుంచి వైసీపీ ఎర్పాటు అయింది.;

Update: 2025-06-05 23:30 GMT

వైసీపీ ఏర్పాటు వెనక ఒక కసి ఆవేశం ఉంది. తమకు కాంగ్రెస్ పార్టీలో అన్యాయం జరిగింది అన్న అవేదన ఆగ్రహం నుంచి వైసీపీ ఎర్పాటు అయింది. వైసీపీ పెట్టిన కొత్తల్లో జగన్ ఒక నిప్పు కణిక మాదిరిగా ఉండేవారు. ఆయన 35 ఏళ్ళ వయసులోనే అష్ట కష్టాలు పడ్డారు. పదహారు నెలల జైలు జీవితాన్ని చూశారు.

ఆస్తులు జప్తు అయ్యాయి. లెక్కకు మిక్కిలిగా కేసులు పడ్డాయి. కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగి ఆయనను పెద్ద ఎత్తున టార్గెట్ చేశాయి. దాని నుంచు పుట్టిన ఒక పౌరుషమే వైసీపీకి ఆక్సిజన్ గా మారింది. ఇక 2014 ఎన్నికల్లో అధికారం కోసం తొలిసారి పోరాడి కేవలం అయిదు లక్షల ఓట్ల తేడాతోనే వైసీపీ ఓటమి పాలు అయింది. అయినా జగన్ వెనక్కి తగ్గలేదు

ఆయన ప్రతిపక్ష స్థానంలో అయిదేళ్ల పాటు ఉంటూ అప్పటికే ఫార్టీ ఇయర్స్ ఎక్సిపీరియెన్స్ తో మూడోసారి సీఎం అయిన చంద్రబాబు ప్రభుత్వం మీద అలుపెరగని యుద్ధం చేశారు. తొలి మూడేళ్ళూ అసెంబ్లీ వేదికగా జగన్ పోరాడారు. చివరి రెండేళ్ళూ జనం మధ్యన ఉండి తేల్చుకున్నారు.

అసెంబ్లీలో తనకు మైకు ఇవ్వడం లేదని ఆయన బాయ్ కాట్ చేసినా దానికి ఒక జస్టిఫికేషన్ ఉందని జనాలు భావించారు. ఒక చూస్తే కనుక జగన్ ఆ సమయంలో తిరగని జిల్లా లేదు. చేయని ఉద్యమం లేదు స్థానికంగా ఆయా జిల్లాలలో ఉన్న సమస్యలను పట్టుకుని దీక్షలు చేశారు, ఉద్యమించారు, సర్కార్ ని గడగడలాడించారు ఇక చివరి అస్త్రంగా ఆయన భారీ పాదయాత్ర చేసి 2019లో అధికార పీఠాని అందుకున్నారు. ఏకంగా 151 సీట్లతో వైసీపీని పవర్ లోకి తెచ్చి తాను సీఎం అయ్యారు.

మరి పోరాటం అంటే తానే చిరునామాగా మరిన జగన్ 2024 ఎన్నికల తరువాత భారీ ఓటమి సంభవించి ఏడాది అయినా జనంలోకి పెద్దగా రాకపోవడం పట్ల చర్చ సాగుతోంది. జగన్ పార్టీని నిరసన కార్యక్రమాలకు ఆదేశిస్తున్నారు. ఆయన పిలుపు ఇస్తున్నారు. పార్టీ నాయకులు పాల్గొంటున్నారు

కానీ ఆ ఊపు అయితే కనిపించడంలేదు. అదే జగన్ కూడా నేరుగా కూటమితో ఢీ కొట్టి రంగంలోకి వస్తే కనుక ఆ చర్చ ఒక లెవెల్ లో ఉండేదని అంటున్నారు. వెన్నుపోటు దినం పేరుతో జరిగిన కార్యక్రమానికి జగన్ కూడా హాజరై ఉంటే బాగుండేది అని అంటున్నారు. ఆయన తనకు నచ్చిన జిల్లాను ఎంచుకుని అక్కడ నుంచే కూటమి సర్కార్ మీద సమర శంఖం పూరించి ఉండే జనాలకు స్ట్రాంగ్ మెసేజ్ వెళ్ళేదని అంటున్నారు.

కానీ జగన్ మాత్రం తాడేపల్లి గడప దాటడం లేదు. వైసీపీ వర్గాలకు అది ఏమంతగా రుచించడం లేదు. జగన్ అంటేనే ఫైర్ అని అంతా అనుకునే వారు. అలాంటిది అయిదేళ్ళ పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన తిరిగి జనంలోకి వచ్చి రోడ్ల మీద ఆందోళనలలో పాలు పంచుకోవడానికి ఆలోచిస్తున్నారా అన్న చర్చ కూడా ఉంది.

అంతే కాదు ఆయన అసెంబ్లీలో విపక్షం బెంచీలలో కూర్చోవడానికి సైతం సంకోచించడం ద్వారానే విపక్ష హోదా కావాలని నెరవేరని డిమాండ్ పెట్టారని ప్రత్యర్ధులు అంటున్నారు. అయితే రాజకీయాల్లో గెలుపు ఓటములు అన్నవి సాధారణం. చంద్రబాబు విషయం తీసుకుంటే ఆయన అనేక సార్లు సీఎం గా చేసి మరీ విపక్షంలోకి వచ్చారు.

ఆయన ఆ సమయంలో జనంలోకి వచ్చి పోరాడేవారు అని గుర్తు చేస్తున్నారు. అధినాయకుడు రంగంలోకి దిగితేనే ఏ ఉద్యమానికి అయినా హైప్ వస్తుందని అంటున్నారు. వైసీపీ పెద్దలకు ఈ విషయాలు తెలియనివి కావని కానీ ఎందుకో ఆచరణలో అది కనిపించడం లేదని అంటున్నారు.

ఏపీలో కూటమి పట్ల వ్యతిరేకత ఉందని అదే గెలిపిస్తుందని భ్రమలలో ఉంటే మాత్రం రానున్న కాలంలో ఇబ్బందులు వచ్చినా రావచ్చు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏది ఏమైనా జగన్ మాత్రం కచ్చితంగా జనంలోకి వచ్చి ఆందోళనలో పాల్గొంటేనే వైసీపీకి ఒక జోష్ హుషార్ వస్తుందని అంటున్నారు. మరి అది ఇప్పట్లో జరిగేనా అన్నదే చూడాల్సి ఉంది అని అంటున్నారు.

Tags:    

Similar News