ఎవరిష్టం వచ్చినట్టు వారు చేస్తే.. జోగిపై జగన్ ఫైర్ ..!
సహజంగా ఇది రాజకీయ ప్రకటనేనని అందరూ అనుకున్నారు. కానీ, జోగి అనూహ్యంగా సోమవారం మధ్యాహ్నం విజయవాడ దుర్గగుడికి వచ్చి.. కుటుంబం సమక్షంలో ప్రమాణం చేశారు.;
వైసీపీలో తీవ్ర కలకలం రేగింది. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ వ్యవహారంపై ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్.. ఆగ్రహం వ్యక్తం చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతు న్నాయి. అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు.. సోమవారం.. జోగి రమేష్ వ్యవహరించిన తీరును జగన్ తప్పుబట్టారని తెలిసింది. కుటుంబంతో సహా ఆయన కనకదుర్గ గుడికి వెళ్లడం.. అక్కడ దీపం ముట్టించి ప్రమాణం చేయడం వంటివి రాజకీయంగా వైసీపీకి ఎందుకూ పనికిరావని వ్యాఖ్యానించినట్టు తెలిసింది.
``ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు చేస్తే.. ఇంక పార్టీలో నేనెందుకు?`` అని జగన్ కీలక సలహాదారుడుని ప్ర శ్నించినట్టు సమాచారం. అంతేకాదు.. జోగి నుంచి వివరణ తీసుకోవాలని కూడా కోరినట్టు చెబుతున్నారు. నకిలీ మద్యం వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. దీనిలో కీలక సూత్రధారిగా ఉన్న అద్దేపల్లి జనార్దన్‌రావును పోలీసులు విచారిస్తున్నారు. అయితే.. ఆయన అరెస్టుకు ముందు విడుదల చేసిన వీడియో లో జోగిపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన ప్రోత్సాహం వల్లే.. నకిలీమద్యం తయారు చేశామని చెప్పారు.
ఈ వ్యవహారం రాజకీయంగా వైసీపీ-టీడీపీల మధ్య దుమారం రేపింది. అంతేకాదు.. మాటల తూటాలు కూడా పేలాయి. మరోవైపు అద్దేపల్లితో జోగికి అనుబంధం ఉందంటూ.. టీడీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎ త్తున ఫొటోలు , వీడియోలు కూడా హల్చల్ చేశాయి. అనంతరం.. జోగి వివరణ ఇచ్చారు. తనకు అద్దేపల్లి నకిలీ మద్యం వ్యాపారానికి సంబంధం లేదని చెప్పారు.కానీ, టీడీపీ నాయకులు సహజంగానే విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో తాను కనకదుర్గ గుడిలో ప్రమాణం చేస్తానంటూ జోగి ప్రకటించారు.
సహజంగా ఇది రాజకీయ ప్రకటనేనని అందరూ అనుకున్నారు. కానీ, జోగి అనూహ్యంగా సోమవారం మధ్యాహ్నం విజయవాడ దుర్గగుడికి వచ్చి.. కుటుంబం సమక్షంలో ప్రమాణం చేశారు. ఈ వ్యవహారమే జగన్‌కు ఆగ్రహం తెప్పించిందని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఎవరిని అడిగి జోగి ఇలా చేశారంటూ.. ఆయన నిలదీశారని.. ఒకవైపు నకిలీ మద్యం వ్యవహారంపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంటే.. జోగి చేసిన ప్రమాణం మొత్తం ప్రక్రియను నీరు గార్చిందని.. రేపు మరిన్ని విషయాలు తెరమీదికి వచ్చినప్పుడు కూడా.. ఇలానే చేయాలా? అని నిలదీసినట్టు తెలిసింది. అంతేకాదు.. జోగి నుంచి వివరణ కోరాలని కూడా.. సలహాదారును ఆదేశించినట్టు సమాచారం.