'మిస్ యూ డాడ్'... వైఎస్ జగన్ ఎమోషనల్!

అవును... వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి సందర్భంగా ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌ ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించారు.;

Update: 2025-07-08 05:53 GMT

దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి సందర్భంగా వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించారు. ఆ సమయంలో ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన ఫోటో ఎక్స్ లో పోస్ట్ చేస్తూ.. "మిస్ యూ డా" అని రాశారు జగన్!


అవును... వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి సందర్భంగా ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌ ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో వైఎస్ విజయమ్మ, వైఎస్‌ భారతితో పాటు ఇతర కుటుంబ సభ్యులు, వైసీపీ నేతలు, అభిమానులు పాల్గొన్నారు. ఇదే సమయంలో షర్మిల నివాళులు ఆర్పించారు.

మిస్ యూ డాడ్!:

వైఎస్సార్‌ జయంతి వేళ ఆయన తనయుడు జగన్‌ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా... "మిస్‌ యూ డాడ్‌" అంటూ ఇవాళ ఇడుపులపాయలో వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించిన ఫొటోలను ఎక్స్‌ ఖాతాలో పంచుకున్నారు.

షర్మిల తాజా కోరిక ఇదే!:

వైఎస్సార్ జ్ఞాపకార్థం హైదరాబాద్‌ లో స్మృతివనం ఏర్పాటు చేయాలని ఏపీసీసీ చీఫ్ షర్మిల కోరారు. ఈ మేరకు తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో నివాళులర్పించిన షర్మిల... ఈ డిమాండ్ చేశారు! ఈ విషయంపై సోనియాగాంధీకి లేఖ రాసినట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే దీనిని నెరవేరుస్తుందని ఆశిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.

విద్యార్థులకు జగన్ హామీ!:

కడపలోని వైఎస్‌ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ విద్యార్థులు వారం రోజులుగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనుమతి లేకపోవడం, ఏడీసీఈటీ విడుదలపై వారు ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో ఇడుపులపాయలో జగన్‌ ను వాళ్లు కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు. ఈ సందర్భంగా స్పందించిన జగన్... సమస్య పరిష్కారానికి తాను కృషి చేస్తానని.. విద్యార్ధులకు అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

Tags:    

Similar News