అదే జరిగితే.. షర్మిల ఫ్యూచరేంటి ..!
నిజానికి వైఎస్ హవాతోపాటు ఆయన కుమార్తెగా ఆ లెగసీని ముందుకు తీసుకువెళ్లి.. ఓటు బ్యాంకును పెం చుతారని కాంగ్రెస్ భావించింది.;
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది ఎవరూ చెప్పలేరు. ఇప్పటి వరకు ఉన్న పరిస్థితి రేపు ఉం డకపోవచ్చు. ముఖ్యంగా పనితీరును అంచనా వేసుకుని మార్పులు ఖచ్చితంగా ఉంటాయి. ఈ తరహా పరి స్థితి ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విషయంలోనూ జరుగుతున్నట్టు పెద్ద ఎత్తు న ప్రచారం అయితే జరుగుతోంది. ఆమెకు పార్టీ పగ్గాలు అప్పగించి.. 18 నెలలు అయిపోయింది. గత ఎన్నికలకు ముందు ఫిబ్రవరిలో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టారు.
నిజానికి వైఎస్ హవాతోపాటు ఆయన కుమార్తెగా ఆ లెగసీని ముందుకు తీసుకువెళ్లి.. ఓటు బ్యాంకును పెం చుతారని కాంగ్రెస్ భావించింది. అయితే.. ఈ అంచనా బెడిసికొట్టింది. షర్మిల వల్ల, షర్మిల చేత.. పార్టీ గ్రా ఫ్ కానీ, ఓటు బ్యాంకు కానీ ఎక్కడా పెరగలేదు. పైగా.. సొంత అజెండాను అమలు చేస్తున్నారన్న విమర్శ లను కూడా షర్మిల మూటగట్టుకున్నారు. దీనికితోడు సీనియర్లను కూడా పక్కన పెట్టారు. ఎవరు ఏం చెప్పినా.. తర్వాత చూద్దాం అంటూ ఆమె చిరాకు పడుతున్నారన్న టాక్ వినిపిస్తోంది.
అంతేకాదు.. మీడియాలో తాను మాత్రమే హైలెట్ కావాలన్న వ్యూహాన్ని షర్మిల అనుసరించారు. ఈ పరి ణామాలతో పార్టీలో అంతరాలు ఏర్పడి.. తుదకు ఫిర్యాదుల వరకు వెళ్లింది. ఇదిలావుంటే.. గుంటూరు జిల్లాకు చెందిన రాయపాటి సాంబశివరావు కుటుంబం కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే.. తమకు రాష్ట్ర చీఫ్ ఇవ్వాలన్నది వీరి షరతు. సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న రాయపాటి ఫ్యామిలీకి బలమైన గుర్తింపు ఉంది. పైగా ఒకప్పుడు కాంగ్రెస్‌లో ఏకఛత్రాధిపత్యంగా గుర్తింపు పొందారు.
అయితే.. రాష్ట్ర విభజన తర్వాత టీడీపీలోకి వెళ్లినా.. ప్రస్తుతం మాత్రం సైలెంట్‌గా ఉన్నారు. ఈ క్రమంలో రాయపాటి ఫ్యామిలీ నుంచి మూడో తరం నాయకులను కాంగ్రెస్‌లోకి పంపించాలన్న ప్రతిపాదన ఉంది. ఇదే జరిగితే.. తమకు చీఫ్ పోస్టు ఇవ్వాలన్నది షరతు. అయితే.. ప్రస్తుతం షర్మిల ఈ పోస్టులో ఉన్నందు న.. దీనిని ఏ మేరకు ఆ ఫ్యామిలీకి ఇస్తారన్నది చూడాలి. ఒకవేళ ఇదే జరిగితే.. షర్మిల రాజకీయాలు ఎలాంటి యూటర్న్ తీసుకుంటాయన్నది కూడా ఆసక్తిగా మారింది. చూడాలి మరి ఏం జరుగుతుందో.