‘టూల్ కిట్’ ద్వారానే మోడీకి విషెస్..? యూ ట్యూబర్ సంచలన విషయాలు..
గ్లోబల్ లీడర్ గుర్తింపు సంపాదించుకున్న నరేంద్ర మోడీ 75వ పుట్టిన రోజు సెప్టెంబర్ 17వ తేదీ జరిగింది.;
గ్లోబల్ లీడర్ గుర్తింపు సంపాదించుకున్న నరేంద్ర మోడీ 75వ పుట్టిన రోజు సెప్టెంబర్ 17వ తేదీ జరిగింది. ఆయనకు సాధారణ కార్యకర్త నుంచి అసాధారణ లీడర్ వరకు క్యూ శుభాకాంక్షలు చెప్పారు. అదే విధంగా ఆయనకు ఎంతో మంది సోషల్ మీడియా ద్వారా కూడా శుభాకాంక్షలు చెప్పారు. అయితే ఈ శుభాకాంక్షల చుట్టూ విమర్శలు అల్లుకున్నాయి.
శుభాంక్షలకు సంబంధించి ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాథీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీకి దేశంలోని సీఎంల నుంచి సాధారణ కార్యకర్త వరకు శుభాకాంక్షలు వెళ్లాయి. అయితే.. ఈ ఇవన్నీ జన్యూన్ కాదని, ఇదంతా ముందస్తుగా సెట్ చేసిందేనని, దీని కోసం మోడీ టీం ఒక ‘టూల్ కిట్’ వాడిందని ఆరోపణలు చేశారు. ధ్రువ్ రాథీ చేసిన విమర్శల్లో నిజం లేకపోలేదని కొందరు అంటున్నారు. టెక్నాలజీ పెరుగుతున్న ఈ రోజుల్లో ముందస్తుగా శుభాంక్షలను సెట్ చేయడం ఏమంత పెద్ద విషయం కాదని కొందరు అంటున్నారు. దేశంలోని నేతలు టూల్ కిట్ వాడారని అనుకుంటే.. ప్రపంచ నేతలైన ట్రంప్, పుతిన్, మెలోని లాంటి వారు చెప్పిన విషెస్ గురించి ఏంటని మోడీ ఫ్యాన్స్ నిలదీస్తున్నారు.
పార్టీలను పక్కన పెడితే మోడీ అంటే అభిమానం ఉన్న వారు దేశంలో ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ధ్రువ్ రాథీ ఆరోపణలను వారు ఖండిస్తున్నారు. ఇలాంటి ఆరోపణలతో ప్రపంచం గుర్తించిన నేతను అవమానిస్తున్నారని మండిపడుతున్నారు.
మోడీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పేలా మోడీ టీమ్ ఒక ‘టూల్ కిట్’ ఏర్పాటు చేసిందని ధ్రువ్ చెప్పుకచ్చారు. ఈ టూల్ కిట్ ద్వారా ఆటో మెటిక్ గా విషెస్ వెళ్తుందని, వారు జెన్యూన్ గా చెప్పింది కాదని ఆయన విమర్శించారు. డొనాల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్, మెలోని లాంటి ప్రపంచ దిగ్గజ నేతల ట్వీట్లను అందరూ గమనిస్తుంటారు. వాటికి కూడా టూల్ కిట్ ఉపయోగించడం సాధ్యం అవుతుందా? అని ప్రశ్నించారు.
సాంకేతికత విషయంలో యూ ట్యూబర్ చెప్పిన వాస్తవాలు నిజమే కావచ్చు కానీ.. మోడీ విషయంలో అలా జరిగేందుకు అవకాశం లేదు.. ఎందుకంటే ఆయనకు విషెస్ చెప్పడమే ప్రపంచంలోని చాలా దేశాల నేతలు గౌరవంగా భావిస్తున్నారు. ఇలాంటి ప్రపంచ గుర్తింపు ఉన్న నేత గురించి మాట్లాడేప్పుడు కాస్త ఆలోచించుకోవాలని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.