• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  'ఏఐ డిజిటల్ ట్వీన్'......

'ఏఐ డిజిటల్ ట్వీన్'... యూట్యూబ్ క్రియేటర్లకు గుడ్ న్యూస్ ఇది!

| ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ దిగ్గజం యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది.

By - Raja Ch
Update: 2026-01-22 10:33 GMT

ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ దిగ్గజం యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. 2026 నాటికి అంతిమ వినోద కేంద్రంగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంఏలిజెన్స్, క్రియేటర్ టూల్స్, పేరెంట్స్ కంట్రోల్ లను రెట్టింపు చేస్తున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలోనే.. ఇకపై క్రియేటర్లు కెమెరా ముందుకు రాకుండానే.. తమలా కనిపించే 'ఏఐ డిజిటల్ ట్విన్' సహాయంతో షార్ట్స్, వీడియోలను క్రియేట్‌ చేయవచ్చని వెల్లడించింది.

అవును... ఇకపై క్రియేటర్లు కెమెరా ముందుకు రాకుండానే. తమలాగే కనిపించే కృత్రిమ మేధతో రూపొందించిన ప్రతిరూపం సహాయంతో షార్ట్స్, వీడియోలను క్రియేట్‌ చేయవచ్చు. ఈ విషయాన్ని యూట్యూబ్ సీఈఓ నీల్ మోహన్.. తన 2026 వార్షిక లేఖలో వెల్లడించారు. ఈ సందర్భంగా స్పందిస్తూ... ఏఐ అనేది భావ వ్యక్తీకరణకు ఒక సాధనం మాత్రమేనని, ఇది మనిషి సృజనాత్మకతను పూర్తిగా భర్తీ చేయలేదని నీల్ మోహన్ స్పష్టం చేశారు.

ఈ టెక్నాలజీ సాయంతో క్రియేటర్లకు వీడియోల తయారీలో శ్రమ తగ్గించడమే తమ ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో... క్రియేటర్ల అనుమతి లేకుండా వారి ముఖాన్ని ఎవరైనా వాడితే, దానిని నియంత్రించే టూల్స్ కూడా అందుబాటులోకి తేనున్నారని తెలుస్తోంది. ఇదే క్రమంలో... తమ ఏఐ టూల్స్ ద్వారా రూపొందించిన వీడియోలకు ‘సింథటిక్ కంటెంట్’ అని స్పష్టంగా లేబుల్ వేస్తామని చెబుతున్నారు. ఇది డీప్ ఫేక్ పై అప్రమత్తత అని అంటున్నారు.

ఈ క్రమంలో... ఈ నూతన ఆవిష్కరణ ఓపెన్ ఏఐకి చెందిన 'సోరా' యాప్ తరహాలో పని చేస్తుందని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ఫీచర్ ద్వారా తమ సొంత ముఖ కవళికలతో, తమ గొంతుతోనే క్రియేటర్లు వీడియోలను సులభంగా రూపొందించుకునే వెసులుబాటు కలగనుంది. ఈ కొత్త ఫీచర్ యూజర్ల సెల్ఫీ క్లిప్, ఆడియో రికార్డింగ్ ఆధారంగా 3డీ అవతార్‌ ను సృష్టిస్తుందనే అంచనాలున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా... యూట్యూబ్ షార్ట్స్ వీడియోలు రోజుకు సగటున దాదాపు 200 బిలియన్ల వ్యూస్ సాధిస్తున్నాయని చెబుతున్నారు. ఈ తరుణంలో.. యూట్యూబ్ మరిన్ని కొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది. ఇకపై షార్ట్స్ ఫీడ్‌ లో నేరుగా ఇమేజ్ పోస్ట్‌ లను యాడ్ చేసుకునే వెసులుబాటు కల్పించనుంది. ఇదే క్రమంలో... పిల్లలు, టీనేజర్లు షార్ట్స్ చూసే సమయాన్ని తల్లిదండ్రులు నియంత్రించేలా కొత్త 'పేరెంటల్ కంట్రోల్స్' రాబోతున్నాయని చెబుతున్నారు.

Tags:    
  • youtube2026 
  • aidigitaltwin 
  • shortsai 
  • nealmohan 
  • aicreators 
  • syntheticcontent 

Similar News

మూడు ముళ్ల బంధం.. రూ. 7.50 లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం!

2026-11-19 19:30 GMT

వీఐపీలు వస్తేనే ముంబైకి అందం.. సామాన్యులు ఉంటే ఎందుకీ దుర్గంధం?

2026-11-19 18:30 GMT

సహచరుల వద్ద తలెత్తుకోలేకపోతున్నా.. ఇప్పుడే వైసీపీలోకి వెళ్లిపోండి! – టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు

2026-11-19 17:30 GMT

AI హడావుడి.. సినిమాకు ఒరిగిందేంటి!

2026-11-19 17:30 GMT

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

Copyright @2026

Powered by Blink CMS