వైసీపీ పోలవరం అభ్యర్థి ఎస్టీ కాదంటూ పిటీషన్.. ఆరోపణలేంటి?

రాజ్యలక్ష్మిపై సంచలన ఆరోపణలపై స్పందించిన కోర్టు ఈ అంశంపై విచారణకు ఏప్రిల్ 25న జరపనున్నట్లుగా పేర్కొంది.

Update: 2024-03-29 06:53 GMT

వైసీపీ తరఫున పోలవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్న తెల్లం రాజ్యలక్ష్మిపై సంచలన ఆరోపణలు తెర మీదకు వచ్చాయి. ఆమె అసలు ఎస్టీ కాదన్న వాదనను వినిపిస్తూ తాజాగా హైకోర్టులో వ్యాజ్యాన్ని వేశారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. ఈ అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. రాజ్యలక్ష్మిపై సంచలన ఆరోపణలపై స్పందించిన కోర్టు ఈ అంశంపై విచారణకు ఏప్రిల్ 25న జరపనున్నట్లుగా పేర్కొంది.

ఇంతకూ తెల్లం రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం వేసిందెవరు? వారేం చెబుతున్నారు? అన్న విషయానికి వస్తే మాదంవారిగూడెం నివాసి మడకం వెంకటేశ్వరరావు ఈ పిటిషన్ దాఖలు చేశారు. తప్పుడు కుల ధ్రువపత్రంతో రాజ్యలక్ష్మి ఎస్టీగా చలామణి అవుతున్నారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి తగిన ఉత్తర్వులు ఇవ్వాల్సిందిగా కోరుతూ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.

ఇదిలా ఉంటే.. రాజ్యలక్ష్మి ఎస్టీ అంటూ బుట్టాయిగూడెం తహశీల్దార్ ఇచ్చిన ఉత్తర్వులను ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే.. సదరు తహశీల్దారు తన పరిధిలో లేనప్పటకి రాజ్యలక్ష్మికి కుల ధ్రువీకరణ పత్రం ఎలా జారీ చేస్తారని ప్రశ్నిస్తున్నారు. దీనిపై కోర్టును ఆశ్రయించగా.. దీనిపై విచారణ త్వరలో జరగనుంది. తనపై వచ్చిన ఆరోపణలపై రాజ్యలక్ష్మి స్పందించాల్సి ఉంది. పిటిషనర్ వాదన ప్రకారం రాజ్యలక్ష్మి ఎస్టీ కాదని.. బీసీ వర్గానికి చెందిన మహిళగా చెబుతున్నారు. కోర్టు ఎలా రియాక్టు అవుతుందో చూడాలి.

Tags:    

Similar News