• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  వైసీపీ ఎమ్మెల్యే '11...

వైసీపీ ఎమ్మెల్యే '11 ప్లేయర్స్' ట్వీట్.. సోషల్ మీడియాలో వైరల్

| టీమ్ ఇండియా గత రాత్రి ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుత విజయాన్ని సాధించింది, 12 సంవత్సరాల తర్వాత ఆ ప్రతిష్టాత్మక ట్రోఫీని ముద్దాడింది.

By - Tupaki Desk
Update: 2025-03-10 09:52 GMT

టీమ్ ఇండియా గత రాత్రి ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుత విజయాన్ని సాధించింది, 12 సంవత్సరాల తర్వాత ఆ ప్రతిష్టాత్మక ట్రోఫీని ముద్దాడింది. దీంతో దేశమంతా ఈ చారిత్రాత్మక విజయాన్ని సంబరాలు చేసుకుంటుండగా, వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మలచుకోవడానికి ప్రయత్నించారు. .

వైసీపీ యెర్రగొండపాలెం ఎమ్మెల్యే టి. చంద్రశేఖర్ భారత జట్టు 11 మంది ఆటగాళ్లతో ఎలాంటి కూటములు లేకుండా గెలిచిందని 100 కోట్ల మంది భారతీయులకు గర్వకారణమైందని పేర్కొన్నారు. "ఎవరి పొతులేకుండా ఇండియా 11 మెంబర్స్ తో నిజాయితీగా కప్ గెలిచింది. 4 సంవత్సరాల తర్వాత ఏపీలో ఇదే రిపీట్ అవుతుంది," అని ఎమ్మెల్యే తన ట్వీట్‌లో రాశారు.

ఇక్కడ ఎమ్మెల్యే అర్థం చెప్పాలనుకున్నది.. భారత జట్టు ఎలాంటి కూటములు లేకుండా గెలిచిందని, '11' సంఖ్య తాము కలిగిన ఎమ్మెల్యే సీట్ల సంఖ్యకు సంకేతమని.. అయితే ఆయన పార్టీ కార్యకర్తల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో చేసిన ఈ ప్రయత్నం, అందుకు విరుద్ధంగా ట్రోలింగ్‌కు గురైంది.

ఎన్డీయే కూటమి మద్దతుదారులు సరదాగా స్పందిస్తూ, "టీమ్ ఇండియా 'వై నాట్ 175' అనలేదు కదా.. చివరికి 11 ఆటగాళ్లతోనే గెలిచింది," అని వ్యంగ్యంగా కామెంట్ చేశారు. మరొకరు "క్రికెట్‌కి, రాజకీయాలకి పోలిక తెలియని ఈ ఎమ్మెల్యే, స్పోర్ట్స్‌లో కూటములు ఉండవని కూడా తెలియదా?" అని చమత్కరించారు.

వైసీపీ ఎమ్మెల్యే పార్టీ వైసీపీకి బూస్ట్ ను ఇవ్వాలనే ఉద్దేశంతో చేసిన ఈ ట్వీట్, సాక్షాత్తూ ఆయనకే ఎదురుదెబ్బ తగిలినట్టైంది.. టీమ్ ఇండియా అందరి ప్రశంసలు అందుకుంటుండగా ఈ ఎమ్మెల్యే ట్వీట్ మాత్రం సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురవుతోంది.

అందుకే అంటారు.. ఏదైనా కానీ సోషల్ మీడియాలో పోస్టులు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా దాని పూర్వపరాలు తెలుసుకొని పోస్టులు పెట్టాలి.. లేదంటే ఇలానే ఎదురుదెబ్బలు తగిలే అవకాశాలు ఉంటాయి.

ఎవరితో పొత్తు లేకుండా, 11 మందే నిజాయితీగా ఆడి ఇండియాలోని 100 కోట్ల మందిని విజేతలుగా నిలిపారు.!

సేవ్ చేసుకొని పెట్టుకొండి... మరో 4 ఏళ్ళ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిపీట్ అవుతుంది.#ChampionsTrophy2025 #indvsnzfinal #ChampionsTrophy

— T Chandra Sekhar MLA (@TatiparthiOnX) March 10, 2025
Tags:    
  • YCP 
  • IndiaChampionsTrophy 
  • YSRCP 
  • TChandrasekhar 
  • PoliticalComparisons 
  • SportsAndPolitics 
  • AndhraPradeshPolitics 
  • CricketVictory 
  • TeamIndia 
  • YSRCPBacklash 
  • PublicImage 
  • PoliticalTweets 

Similar News

జడ్పీ పీఠాలు : టీడీపీకి 22, జనసేనకు 4, బీజేపీకి 1

2026-11-20 03:36 GMT

యూత్ కి బీపీ షుగర్...ఏంటీ జనరేషన్ !

2026-11-20 03:36 GMT

బీఆర్ఎస్ కి రాజకీయ సిద్ధి...అక్కడే రేవంత్ గురి !

2026-11-20 03:35 GMT

పిచ్చికుక్క కరిచిందా.. ఎర్రగడ్డకు పంపిస్తాం.. కోమటిరెడ్డికి రేవంత్ రెడ్డి పరోక్ష పంచ్.. కాంగ్రెస్‌లో మాటల మంటలు

2026-11-19 21:30 GMT

విశాఖ నుంచి తిరుపతి వెళ్ళే భక్తులకు సూపర్ న్యూస్

2026-11-19 21:15 GMT

సీనియర్లను రంగంలోకి దించిన జనసేన

2026-11-19 21:15 GMT

ఎవరు గెలిచినా మేమే...వైసీపీ అలా తృప్తి పడుతోందా ?

2026-11-19 21:12 GMT

మంత్ర్రుల‌ను కాద‌న‌లేరు.. కార్య‌క‌ర్త‌ల‌ను వ‌ద్ద‌న‌లేరు: బాబుకు చిక్కులు

2026-11-19 21:12 GMT

పెరిగే సీట్లు వైసీపీ రాజకీయాన్ని ముంచేస్తాయా ?

2026-11-19 21:11 GMT

మలేషియా గేట్లు మూసేసింది.. భారతీయులకు ఇక వీసా కష్టాలు.. అసలు కారణమిదే..

2026-11-19 21:10 GMT

కొలువు తీరిన ఎంపీపీలు...రికార్డు స్థాయిలో పదవులు

2026-11-19 21:01 GMT

మోదీ ప్రస్తావించిన లైసెన్స్ రాజ్ అంటే ఏమిటి? ఏంటా కథ?

2026-11-19 21:00 GMT

Copyright @2026

Powered by Blink CMS