• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  అపాయింట్మెంట్ ఇవ్వని...

అపాయింట్మెంట్ ఇవ్వని డీజీపీ.. వైసీపీ తీవ్ర అసంతృప్తి

| పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై వైసీపీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.

By - Tupaki Desk
Update: 2025-08-10 12:01 GMT

పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై వైసీపీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఈ రెండు చోట్ల అధికార పార్టీ అరాచకాలు పేట్రేగిపోతున్నాయని, తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై యథేచ్ఛగా దాడులు జరుగుతున్నా పోలీసులు కనీసం పట్టించుకోవడం లేదని వైసీపీ విమర్శిస్తోంది. ఈ విషయంలో జోక్యం చేసుకుని పోలీసులకు సరైన దిశానిర్దేశం చేయాలని కోరేందుకు డీజీపీని కలవాలని రెండు రోజులుగా ప్రయత్నిస్తున్నా, తమను కలిసేందుకు డీజీపీ కనీసం ఇష్టపడటం లేదని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆదివారం సాయంత్రంతో ప్రచార గడువు ముగుస్తున్నందున, వచ్చే రెండు రోజులు సరైన భద్రత కల్పించాలని కోరేందుకు ఈ రోజు కూడా వైసీపీ ప్రయత్నించిందని చెబుతున్నారు. అయితే డీజీపీ అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడంతో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ ఆవేదన, ఆందోళనను వెలిబుచ్చారు.

అసలు పోటీ పోలీసులతోనే..

పోలీసుల వ్యవహారశైలి కారణంగా పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తమకు పోలీసులకు మధ్యే పోటీ జరుగుతుందన్న వాతావరణం నెలకొందరి వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి వ్యాఖ్యానించారు. పోలీసుల తీరు ప్రజాస్వామ్యానికే తలవంపులు తెచ్చేలా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అధికార తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న పోలీసులు తీరు చూస్తుంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అనే సందేహం కలుగుతోందని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో వైయస్ఆర్సీపీ ఒకవైపు, కూటమి పార్టీలు మరోవైపు పోటీ చేస్తున్నాయని, అయితే అసలైన పోటీ పోలీసులతోనే అని అర్థమవుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘పోలీసులే ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకుంటారు, దాడులకు గురైన మా పార్టీ శ్రేణులపై తప్పుడు కేసులు బనాయిస్తారు, బైండోవర్ పేరుతో ప్రతిరోజూ స్టేషన్లో గంటల తరబడి నిర్బంధిస్తారు, దాడులకు పాల్పడుతున్న టీడీపీ శ్రేణులకు పోలీసులే రక్షణ కల్పిస్తుంటారు’’ అంటూ లేళ్ల అప్పిరెడ్డి వ్యాఖ్యానించారు.

వినతిపత్రం ఇచ్చే పరిస్థితి లేదు

ఈ ఎన్నికల్లో కూటమి పార్టీ గెలిస్తే, అది పోలీసులు గెలిచినట్లుగా భావించాలన్నారు. ‘‘దేశంలో ఎక్కడా ఇటువంటి పరిస్థితి గురించి వినలేదు. డీజీపీ ఉన్నది చట్టాన్ని కాపాడటానికి, ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి. పోలీస్ విభాగం అధికార పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం కార్యకర్తల్లా పనిచేస్తుంటే ఆయన ఎందుకు స్పందించడం లేదు? ప్రతిపక్షంగా జరుగుతున్న పరిణామాలను ఆయన దృష్టికి తీసుకువెళ్ళేందుకు నాలుగు రోజులుగా ప్రయత్నిస్తుంటే కనీసం అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. చట్టసభల్లో ప్రజాప్రతినిధులుగా ఉన్న మాకు కూడా డీజీపీ నుంచి సమయం ఇవ్వకుండా చేస్తున్నది ఎవరు? ఎవరి ఒత్తిడితో డీజీపీ ప్రతిపక్ష పార్టీకి చెందిన ప్రతినిధి బృందం నుంచి కనీసం స్వేచ్ఛగా వినతిపత్రంను కూడా తీసుకోలేని నిస్పహాయ స్థితిలో ఉన్నారు?’’ అంటూ ప్రశ్నించారు.

పోలింగ్ కేంద్రాలను మార్చేశారు

మరోవైపు ఉప ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాలను కిలోమీటర్ల దూరంలోని వేరే గ్రామాలకు మార్చేశారు. ఓటర్లు ఏ ధైర్యంతో పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు? పోలీసులతో ఏకపక్షంగా ఓట్లు వేయించుకునే కుట్ర జరుగుతోంది. రాజ్యాంగం ప్రజలకు స్వేచ్ఛగా ఓటు వేసుకునే హక్కును టీడీపీ గూండాలు కాలరాస్తుంటే, పోలీసులు వారికి అండగా నిలబడటం దారుణం. ఇప్పటికైనా డీజీపీ కళ్ళు తెరవాలని లేళ్ల అప్పిరెడ్డి కోరారు.

Tags:    
  • YCP 
  • Pulivendula 
  • Ontimitta 
  • ZPTCBypolls 
  • AndhraPolitics 
  • PoliceBias 
  • TDP 
  • ElectionNews 
  • PoliticalControversy 
  • APByElections 
  • వైసీపీ 
  • పులివెందుల 
  • ఒంటిమిట్ట 
  • జెడ్పీటీసీఉపఎన్నికలు 
  • ఆంధ్రరాజకీయాలు 

Similar News

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

బోస్టన్‌లో తెలుగు విద్యార్థిని అదృశ్యం.. 36 గంటలుగా జాడలేదు.. అసలేమైంది?

2026-11-06 06:33 GMT

వైఫై, ఎమోజీ, క్యూఆర్ కూడా ఇలా దైనందిత జీవితంలో ఉపయోగించే ఈ అద్భుత ఆవిష్కరణల వెనుక ఉన్న దేశాలేవో తెలుసా?

2026-11-06 06:30 GMT

సోషల్ మీడియా స్వేచ్ఛకు కొత్త సవాల్..

2026-11-06 05:47 GMT

సాధారణ ఉప్పుతో గుండెకు ముప్పు.. పొటాషియం ఉప్పుతో లక్షల ప్రాణాలకు రక్షణ!

2026-11-06 05:02 GMT

కేరళ నుంచి అమెరికా వరకు.. లాస్ ఏంజెలెస్ తొలి భారతీయ సంతతి మేయర్‌గా నిత్యా రామన్!

2026-11-06 04:57 GMT

అమెరికాలో డెమోక్రాట్ల విజయం.. భారతీయులకు H-1B, OPT వీసాల విషయంలో ఊరట లభిస్తుందా?

2026-11-06 04:57 GMT

లైఫ్‌లో సెటిల్ అవ్వడమే కాదు.. నచ్చినట్లు బతకడమే ముఖ్యం! జెన్ జీ కొత్త ట్రెండ్ ఇదే!

2026-11-06 04:19 GMT

డెమోక్రాట్లు గెలిచారు కదా.. ట్రంప్ ను దించేయవచ్చా?

2026-11-06 03:56 GMT

పట్టు సాధించిన కొణతాల...బెర్త్ కన్ఫర్మ్ ?

2026-11-06 03:50 GMT

వంగవీటి పట్టాభిషేకానికి మెగాస్టార్...బాలయ్య ?

2026-11-06 03:50 GMT

కూటమి పద్మవ్యూహంలో వైసీపీ విలవిల !

2026-11-06 03:49 GMT

Copyright @2026

Powered by Blink CMS