టీడీపీకి యనమల రాజీనామా... తెరపైకి సంచలన వ్యాఖ్యలు!

ఇలా టీడీపీకి షాకిచ్చిన యనమల కృష్ణుడు... వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Update: 2024-04-26 08:32 GMT

ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల వేళ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే నామినేషన్ల స్వీకరణ పర్వం ముగిసిన నేపథ్యంలో ఇక ప్రచారాలను హోరెత్తించడంపైనే అందరి దృష్టీ నెలకొందని అంటున్నారు. ఇదే సమయంలో ఆపరేషన్ ఆకర్షలూ తదనుగుణంగా తెరపైకి వస్తున్నాయి. ఈ సమయంలో కూటమికి ఊహించని షాక్ తగిలింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ దెబ్బపడింది!

అవును... సార్వత్రిక ఎన్నికల వేళ ఏపీ రాజకీయాల్లో అనూహ్యపరిణామాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... తెలుగుదేశం పార్టీకి మరో షాక్‌ తగిలింది. ఇందులో భాగంగా... మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడు టీడీపీకి రాజీనామా చేశారు. దీంతో ఇది ఉమ్మడి తునితో పాటు, కాకినాడ లోక్ సభ స్థానంలోనూ కూటమికి కొత్త సమస్యే అని అంటున్నారు పరిశీలకులు!

ఇలా టీడీపీకి షాకిచ్చిన యనమల కృష్ణుడు... వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అన్నీ అనుకూలంగా జరిగితే.. ఈ నెల 27న యనమల కృష్ణుడు వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో ఆయన ఆ పార్టీ కండువా కప్పుకోనున్నారని అంటున్నారు.

ఈ సందర్భంగా స్పందించిన యనమల కృష్ణుడు... సుమారు 42 ఏళ్లుగా టీడీపీ కోసం పనిచేసినట్లు తెలిపారు. ఈ సమయంలో పార్టీ మారడం బాధగా ఉన్నప్పటికీ తప్పలేదని ఆయన వెల్లడించారు. ఈ క్రమంలో... వైఎస్ జగన్ ఆహ్వానం మేరకు వైసీపీలో చేరుతున్నట్లు ఆయన తెలిపారు. తునిలో వైసీపీ జెండా మరోసారి ఎగరడానికి పని చేస్తానని ఆయన అన్నారు.

Read more!

అనంతరం కాస్త డోసు పెంచిన ఆయన... మోసపూరిత రాజకీయాలను వదలక తప్పలేదని, తనను దూరం పెట్టాలని కొందరు దురుద్దేశంతో పని చేశారని తెలిపారు. దాని ఫలితమే ఈ రోజు తాను సైకిల్ దిగడం అన్నట్లుగా యనమల కృష్ణుడు స్పందించారు.

కాగా... గత నలభై ఏళ్లుగా అన్న యనమల రామకృష్ణుడికి నమ్మకంగా ఉన్న తమ్ముడు యనమల కృష్ణుడికి తన అన్న వెన్నుపోటు పొడిచారని చెబుతున్నారు! యనమల కృష్ణుడి స్థానంలో తన కుమార్తెకు రామకృష్ణుడు సీటు వచ్చేలా రాజకీయం నడిపారని అంటున్నారు. ఈ క్రమంలో యనమల కృష్ణుడిని కావాలనే ఆయన దూరం పెట్టారని.. దీంతో, సోదరుల మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయని తెలుస్తోంది!

Tags:    

Similar News