• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  హర్యానా 'హస్త' గతమయ్యేనా...

హర్యానా 'హస్త' గతమయ్యేనా ?!

| గత రెండు విడతలుగా బీజేపీ ఇక్కడ అధికారాన్ని చేజిక్కించుకుంటుండడమే కాకుండా పదికి పది ఎంపీ స్థానాలను గెలుచుకుంటూ వస్తుంది.

By - Tupaki Desk
Update: 2024-07-26 13:30 GMT

రాజకీయాల్లో ఆయారాం .. గయారాం పదానికి అంకురార్పణ చేసిన హర్యాన రాష్ట్ర శాసనసభ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఈ ఏడాది నవంబరులో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉన్న తరుణంలో అక్టోబరు నెలాఖరుకు ఎన్నికలు పూర్తి కానున్నాయి. గత రెండు విడతలుగా బీజేపీ ఇక్కడ అధికారాన్ని చేజిక్కించుకుంటుండడమే కాకుండా పదికి పది ఎంపీ స్థానాలను గెలుచుకుంటూ వస్తుంది.

ప్రస్తుతం ఇక్కడి శాసనసభలో 90 స్థానాలకు గాను బీజేపీకి ఒక ఇండిపెండెంట్, మరొక మిత్రపక్ష ఎమ్మెల్యేతో కలిసి 43 మంది శాసనసభ్యులున్నారు. కాంగ్రెస్ పార్టీకి 29 మంది సభ్యుల బలం ఉండగా, ముగ్గురు మిత్రపక్ష ఎమ్మెల్యేల బలంతో 32 మంది సభ్యులున్నారు. అయితే ఇటీవల ఎన్నికల్లో బీజేపీ ఆధిపత్యానికి గండి కొడుతూ 10 ఎంపీ స్థానాలలో ఐదు కాంగ్రెస్ చేజిక్కించుకున్నది. అంబాలా, సిర్సా, హిసార్, సోనీపట్, రోహ్ తక్ స్థానాలలో విజయం సాధించింది. కురుక్షేత్ర, కర్నాల్, భివానీ, గుర్గావ్, ఫరీదాబాద్ లలో బీజేపీ గెలిచింది.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ మీద రెండు సార్లు పాలించిన ప్రజా వ్యతిరేకత మూలంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అదృష్టం కలిసివస్తుందని అంతా భావిస్తున్నారు. అయితే ఆప్ సొంతంగా పోటీ చేస్తే ఫలితాలు బీజేపీకి కలిసి వస్తాయేమోనన్న అనుమానాలు నెలకొన్నాయి. ఇక్కడ ఆప్ గెలిచేంత పరిస్థితి లేకున్నా .. పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు తప్పవని అంటున్నారు.

హర్యానాలో ప్రస్తుతం యువత, రైతులు సానుకూలంగా ఉండటం, దళిత -జాట్ సామాజిక వర్గాల్లో మద్దతు పెరగటం కాంగ్రెస్ పార్టీకి అనుకూలిస్తున్నది. 90 శాసనసభ స్థానాలు ఉన్న హర్యానాలో ఈ ఎన్నికల్లో 43 నుండి 48 కాంగ్రెస్ కూటమి, 34 నుండి 39 స్థానాలు బీజేపీ కూటమి గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని పీపుల్స్ పల్స్, ట్రాక్టర్ పోల్ వంటి సర్వేలలో వెల్లడయింది. హర్యానాలో నాలుగో వంతు జనాభా జాట్లే కావడం, ఈ ఎన్నికల్లో వారి మద్దతు కాంగ్రెస్ దక్కించుకోవడం లాభం చేకూరుస్తుందని అంటున్నారు. లోక్ సభ ఎన్నికల ఫలితాలు దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. మరి బీజేపీ నిలబెట్టుకుంటుందా ? కాంగ్రెస్ దక్కించుకుంటుందా ? వేచిచూడాలి.

Tags:    
  • Haryana 
  • Upcomingeletions 
  • Congressparty 
  • Bjp 
  • Nda 
  • Kurukshetra 
  • Karnal 
  • Bhiwani 
  • Gurgaon 
  • Faribad 
  • Loksabhaelections 
  • MlaSeats 
  • MpSeats 

Similar News

బాబు విజనరీ కారు...జగన్ ప్రజా నేత కాలేరు !

2026-11-11 07:31 GMT

విజయసాయి తలుపులు తెరచారు...వైసీపీకి బిగ్ ఆఫర్

2026-11-11 07:30 GMT

ప్రణబ్ ప్రధాని ఆశలు...సోనియా నెరవేర్చలేక పోయారా ?

2026-11-11 07:29 GMT

చిరంజీవిది విలీనం.. విజయసాయి కొత్త ‘పీఆర్పీ’ లక్ష్యం చేరుతుందా?

2026-11-11 06:43 GMT

ఏపీలో రాజకీయ శూన్యత ...టీడీపీ వైసీపీ సంగతేంటి ?

2026-11-11 06:43 GMT

విజయసాయిరెడ్డి క్లాస్...పార్టీ పేరూ క్లాసే !

2026-11-11 06:16 GMT

సరికొత్త క్యాబ్స్ : రేటు తక్కువ.. కార్లు కంఫర్ట్.. వియత్నం కార్లతో 30వేల జీతం..

2026-11-11 05:59 GMT

కాలేజీల్లో సినిమా ప్రమోషన్లకు తెలంగాణ ప్రభుత్వం చెక్?

2026-11-11 05:57 GMT

హెచ్1బీ వీసాదారులపై మరో పిడుగు.. ఐబీఎం షురూ చేసింది..

2026-11-11 04:56 GMT

టాప్ స్టోరి: న‌గ‌ర శివారులో స్టార్ హీరోల ఫామ్‌హౌస్‌ల విలాసాలు

2026-11-11 04:29 GMT

2008లో ఆస్ట్రేలియా వెళ్లిన భారతీయ యువకుడు.. ఇప్పుడు ఆయన సాధించిన ఘనత ఏంటో తెలుసా?

2026-11-11 04:28 GMT

ధర్మాన బ్రదర్స్ చేతుల్లో గుండ ఫ్యామిలీ పొలిటికల్ లైఫ్

2026-11-11 03:55 GMT

Copyright @2026

Powered by Blink CMS