• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  తల్లికి వందనం సంక్రాంతికి...

తల్లికి వందనం సంక్రాంతికి వస్తుందా?

| ఇప్పుడు కూటమి కోరుకున్న సయయం కూడా దగ్గర పడటంతో తల్లికి వందనం ఎప్పుడు అమలు చేస్తారని అంతా ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

By - Tupaki Desk
Update: 2024-12-19 00:30 GMT

కూటమిని అధికారంలోకి తెచ్చిన పథకాల్లో తల్లికి వందనం ఒకటి. ఈ పథకం ఎప్పుడు అమలు అవుతుందని రాష్ట్రం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఘన విజయానికి ప్రధానమైన సూపర్ సిక్స్ హామీలు అమలుపై ఇంకా క్లారిటీ రావడం లేదు. ముఖ్యంగా ఎన్నికల్లో గేమ్ ఛేంజర్ గా నిలిచిన తల్లికి వందనం పథకంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు పూర్తయింది. తల్లికి వందనంతోపాటు సూపర్ సిక్స్ హామీలను ఎప్పుడు అమలు చేస్తారని విపక్ష వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీస్తోంది. ఈ విద్యాసంవత్సరంలో కచ్చితంగా తల్లికి వందనం ఇస్తామని ప్రభుత్వం ఇంతకాలం చెబుతూ వస్తోంది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు ప్రవేశపెట్టిన అమ్మ ఒడి పథకాన్ని 2020 జనవరిలో ప్రవేశపెట్టిందని గుర్తు చేసింది. అంటే తమకు ఆరేడు నెలల సమయం కావాలని పరోక్షంగా చెప్పింది కూటమి ప్రభుత్వం. ఇప్పుడు కూటమి కోరుకున్న సయయం కూడా దగ్గర పడటంతో తల్లికి వందనం ఎప్పుడు అమలు చేస్తారని అంతా ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

164 సీట్లతో ఘన విజయం అందుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఆరు నెలల పాటు చాలా రకాలైన పరిపాలనా సంస్కరణలు తీసుకువచ్చారు. రాజధాని అమరావతితోపాటు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ఎక్కువ ఫోకస్ చేశారు. సంపద స్రుష్టించాలనే సంకల్పంతో పనిచేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా సరిగా లేకపోవడంతో కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని ప్రజలు కూడా సంక్షేమ పథకాలను ఇన్నాళ్లు పెద్దగా ఆశించలేదనే చెప్పాలి. కానీ, ఆర్నెల్ల హనీమూన్ పీరియడ్ ముగిసిపోవడంతో సంక్షేమం పథకాలు ఎప్పుడిస్తారంటూ ప్రజలు ఆరా తీయడం మొదలైంది. ఇన్నాళ్లు విపక్షం గోలగోల చేసినా పట్టించుకోని ప్రజలు సంక్రాంతి పండగ సమయంలో అయినా తల్లికి వందనం కింద ఆర్థిక సాయం చేస్తారా? లేదా? అని ఎదురుచూస్తున్నారు.

కూటమి విజయంలో తల్లికి వందనం పథకం పాత్ర ఎక్కువ శాతం ఉందనే విశ్లేషణలు ఉన్నాయి. ఈ పథకం కింద ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి 15 వేల రూపాయల చొప్పున ఇస్తామని ఎన్నికల్లో కూటమి నేతలు హామీనిచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో ఇదే పథకాన్ని అమ్మ ఒడి అనే పేరుతో అమలు చేశారు. అమ్మ ఒడి కింద ఇంట్లో ఒకరికే డబ్బు చెల్లించేవారు. తొలుత 2020 జనవరిలో అమ్మ ఒడి చెల్లింపులు చేసిన వైసీపీ ప్రభుత్వం ఆ తర్వాత ఏడాది జూన్ నెలకు మార్చింది. ఈ విధానంలో ఐదేళ్ల పాలనలో నాలుగేళ్లు మాత్రమే ఈ పథకాన్ని అమలు చేసింది. అదే సందర్భంలో తొలి ఏడాది మాత్రమే రూ.15 వేలు ఇచ్చి ఆ తర్వాత రూ.14 వేలు, రూ.13 వేలుకి తగ్గించింది. కూటమి నేతలు మాత్రం తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కచ్చితంగా రూ.15 వేలు చొప్పున ఎంతమంది చదువుకుంటే అంతమందికి తల్లికి వందనం పథకం వర్తింపజేస్తామని ప్రకటించారు. దీంతో ప్రజలు కూటమివైపు మొగ్గారని చెబుతున్నారు. ఎన్నికలు ముగిసి ఆరు నెలలైనా ఇప్పటికీ తల్లికి వందనం ఎప్పుడు అమలు చేస్తారనేది క్లారిటీ లేకపోవడంతో రకరకాల విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

తల్లికి వందనం పథకంపై ఇన్నాళ్లు వైసీపీ విమర్శలు చేస్తే, ఇంకా సమయం ఉందని కూటమి నేతలు చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు లోకేశ్ విద్యాశాఖ మంత్రి కావడంతో కచ్చితంగా తల్లికి వందనం పథకం అమలు అవుతుందని అంతా ఆశించారు. ఇన్నాళ్లు సంక్రాంతికి వస్తుందని ఆశించగా, ప్రభుత్వంలో ఎలాంటి కదలిక లేకపోవడంతో సంక్రాంతికి తల్లికి వందనం డబ్బులు అందడం డౌటేనంటున్నారు. ఏప్రిల్ వరకు ఈ విద్యా సంవత్సరం ఉండటంతో ఆ లోగా ఎప్పుడైనా నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఒక వేళ సంక్రాంతికే ఇవ్వాలంటే వచ్చే నెల 10లోగా విద్యార్థుల డేటా సేకరించాల్సివుంది. జనవరి 10 నుంచి సంక్రాంతి సెలవులు ఉండటంతో ఆ లోగా పాఠశాలల నుంచి సమాచారం సేకరించాల్సివుంది. మరోవైపు ఈ నెలలో పాఠశాలల స్థాయిలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించిన ప్రభుత్వం తల్లికి వందనంపై ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. దీంతో ఈ పథకం ఎప్పుడు అమలు చేస్తారు? ఎలాంటి విధి విధానాలు అమలు చేస్తారనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది.

Tags:    
  • Andhrapradesh 
  • Thallikivandanam 
  • Politics 
  • Chandrababu 
  • Alliancegovernment 
  • Amaravati 
  • Polavaramproject 

Similar News

రేవంత్ బయటపెట్టిన ‘ది గ్రేట్ ఫైనాన్షియల్’ మార్వలస్ ఐడియా

2026-11-04 13:15 GMT

రేవంత్ గెలవడని కేటీఆర్ డిసైడ్.. ఆ భూములు కొనొద్దని పారిశ్రామికవేత్తలకు హెచ్చరిక

2026-11-04 13:10 GMT

పాపం ష‌ర్మిల‌.. ఇంత హ‌ర్ట్ అవుతార‌నుకోలేదా ..?

2026-11-04 13:01 GMT

మాజీ ఐపీఎస్‌.. ఓట‌మి స్ఫూర్తి.. !

2026-11-04 13:00 GMT

నాన్న‌గారి ఆశ‌యాలు నెర‌వేరుస్తా: రాధా ఫ‌స్ట్ స్పీచ్‌

2026-11-04 13:00 GMT

నియంతలు ట్రంప్, నెతన్యాహు ఔట్ అట.. ‘సీజేపీ‘ నేతలు హ్యాపీ.. టార్గెట్ మోడీయేనా?

2026-11-04 12:57 GMT

ఓటువేయలేదుగా.. నా డబ్బులు నాకివ్వండి.. వైసీపీ అభ్యర్థి 'రివర్స్ వసూళ్లు' వైరల్

2026-11-04 11:17 GMT

భారతీయులతో పెట్టుకున్నాడు.. ట్రంప్ అనుభవిస్తున్నాడు..

2026-11-04 10:57 GMT

టికెట్ ధ‌ర‌ల‌పై CM విజ‌య్ ముందు చూపు మనవాళ్ల‌కు ఏదీ?

2026-11-04 09:39 GMT

ఏపీలో మ‌రో ఎన్నిక‌ల పోరు..!

2026-11-04 09:22 GMT

రాప్తాడు నిందితుడిపై కాల్పుల కేసులో కీలక పరిణామం

2026-11-04 09:14 GMT

ఎలా గెలవాలో చెప్పారు...జగన్ కంగ్రాట్స్ !

2026-11-04 09:06 GMT

Copyright @2026

Powered by Blink CMS