• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  లులూ మాల్ లో లుచ్చా...

లులూ మాల్ లో లుచ్చా పనులు చేసింది ఎవరో తెలిసింది... షాకింగ్!

| అయితే, సదరు మహిళలు రద్దీ కారణంగా అనుకోకుండా తగిలి ఉంటుందనుకుని అతడిని ఏమీ అనకుండా అక్కడి నుంచి వెళ్లిపోసాగారు.

By - Tupaki Desk
Update: 2023-11-02 04:04 GMT

బెంగళూరులోని ఓ మాల్‌ లో మహిళలను లక్ష్యంగా చేసుకొని ఓ వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడు. మాల్‌ లోని మహిళలను ఉద్దేశపూర్వకంగానే తాకుతూ కెమెరా కంటికి చిక్కాడు. కిక్కిరిసిన గేం జోన్‌ ఏరియాలో ఓ వ్యక్తి చేతులు ప్యాంటు జేబులో పెట్టుకుని ఎంతో హుందాగా తిరుగుతున్నాడు. ఆ రద్దీలో ఎవరికీ అనుమానం రాకుండా మహిళలు, యువతుల లక్ష్యంగా చేసుకొని అసభ్యకరంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు.

మహిళల వెనుక భాగంలో చేతులతో తడుముతూ కనిపించాడు. అయితే, సదరు మహిళలు రద్దీ కారణంగా అనుకోకుండా తగిలి ఉంటుందనుకుని అతడిని ఏమీ అనకుండా అక్కడి నుంచి వెళ్లిపోసాగారు. దీంతో ఓ యువకుడికి అనుమానం వచ్చి.. అతన్ని ఫాలో అయ్యాడు. అతడు చేసే వికృత చేష్టలను తన ఫోన్‌లో రికార్డు చేసి.. సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆ వ్యక్తిని గుర్తించారని తెలుస్తుంది.

అవును... బెంగళూరు నగరంలోని లులు మాల్‌ లో ఓ యువతి శరీరంలోని వెనుకభాగాన్ని తాకుతూ వికృతచేష్టలకు పాల్పడిన సంఘటనపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఆ వీడియో ఫుటేజీ ఆధారంగా నిందితుడి ఆచూకిని పోలీసులు గుర్తించారని తెలుస్తుంది. అతడు ఒక పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడు అని తెలుస్తుంది. దీంతో... పాఠాలు చెప్పిన మాస్టారా ఈ పనికిమాలిన పనులు చేసింది అని ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు!

సోషల్ మీడియాలో మాల్ లో వికృత చేష్టలకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో లులూ మాల్ మేనేజర్ ఫిర్యాదు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో... ఆ వీడియో ఆధారంగా పోలీసులు నిందితుడి ఆచూకీని కనిపెట్టారని అంటున్నారు. నిందితుడి పేరు అశ్వత్ నారాయణ్ అని.. అతడు ఓ ప్రముఖ మఠానికి చెందిన పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసి పదవీ విరమణ పొందాడని చెబుతున్నారు.

ఎనిమిది నెలల క్రితం ఈయన తన ఉపాధ్యుడిగా పదవీ విరమణ చేశాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది! దీంతో ఇంటి అడ్రస్ సంపాదించిన పోలీసులు అక్కడికి చేరుకోగా... బెంగళూరులోని బసవేశ్వరనగర్ లోని అతని ఇంటికి తాళం వేసి ఉంది. దీంతో... ఎక్కడికో పరారయ్యి ఉంటాడని అనుమానిస్తున్నారు. దీంతో అతడి కోసం బెంగళూరులోని మాగడి రోడ్ పోలీసులు వెతుకుతున్నారు.

కాగా... అక్టోబర్ 29వ తేదీ సాయంత్రం లులు మాల్‌ లోని ఫంచర్ గేం ఫ్లోర్‌ లోని ఒక వ్యక్తి పెద్దమనిషిలా తిరుగుతూ.. ఖాళీగా ఉన్న చోట కూడా యువతి వీపును, ఆమె శరీరంలోని ఇతర భాగాలను కావాలని అసభ్యంగా తాకుతూ.. ఆ తర్వాత ఏమీతెలియనట్లు, పొరపాటున తగిలినట్లు ఫెర్మార్మెన్స్ చేస్తూ వెళ్లిపోతున్న దృశ్యాలు వీడియోలో రికార్డ్ అయ్యాయి. అనంతరం ఈ వీడియో వైరల్ అవ్వడంతో కేసు నమొదైంది.. మాస్టారు పరారీలో ఉన్నాడు.

Tags:    
  • Bengaluru 
  • Lulumall 
  • Aswatnarayan 
  • Basaveshwaranagar 
  • Magadipolice 

Similar News

అమెరికాలో దీపావళి వేడుకలపై ఆంక్షలు.. బాణసంచా కాల్చితే $2,000 ఫైన్!

2026-11-05 04:16 GMT

ట్రంప్‌కు బిగ్ షాక్.. రెండు సభలూ డెమొక్రాట్ల ఖాతాలో!

2026-11-05 04:15 GMT

గూగుల్‌లో ఉద్యోగాలపై ఏఐ ప్రభావం.. మారుతున్న టెక్ కంపెనీల ఆలోచనా విధానం!

2026-11-05 04:14 GMT

డిప్యూటీ మేయర్లు...వైఎస్ చైర్మన్ల ఎన్నికకు కౌంట్ డౌన్

2026-11-05 04:10 GMT

అక్కడా 11 శాతం సీట్లే... వైసీపీకి మళ్ళీ ట్రోలింగ్ !

2026-11-05 04:09 GMT

బ్యూరోక్రాట్స్ హిట్ కొట్టలేకపోతున్నారు..రీజన్ అదే ?

2026-11-04 18:30 GMT

కోస్తా గేట్ తాకని వైసీపీ...సేమ్ సీన్ రిపీట్

2026-11-04 18:03 GMT

విశాఖ డిప్యూటీ మేయర్ మీద బీజేపీ కర్చీఫ్ ?

2026-11-04 18:01 GMT

ఎన్టీఆర్ ఆత్మ గౌరవ నినాదం...కేటీఆర్ కామెంట్స్ వెనక ?

2026-11-04 18:01 GMT

బ్యాలెట్ పేపర్లే.. కానీ కౌంటింగ్ మాత్రం రాకెట్ స్పీడ్.. అమెరికా ఎన్నికల్లో అసలు టెక్నాలజీ ఇదే..

2026-11-04 18:00 GMT

భారత్, చైనా సహా ఈ నాలుగు దేశాలకు హార్మూజ్ ను ఓపెన్ చేసిన ఇరాన్.. కానీ ట్విస్ట్

2026-11-04 17:52 GMT

పవన్ ఇలాకాలో ఏంటీ తేడా...బిగ్ నంబర్ తోనే !

2026-11-04 17:46 GMT

Copyright @2026

Powered by Blink CMS