జగన్ అత్యవసరం భేటీలు...వైసీపీలో ఏం జరుగుతోంది...?

ఇవన్నీ అత్యంత ముఖ్యమైన ప్రాంతాలలో నిర్వహించే సభలుగా ఉంటున్నాయి.

Update: 2024-05-05 09:42 GMT

గత నెల 28 నుంచి నాన్ స్టాప్ గా ప్రతీ రోజూ జగన్ మూడు ఎన్నికల సభలలో పాల్గొనేలా వైసీపీ రూట్ మ్యాప్ ని రెడీ చేసింది. మొత్తంగా చూస్తే 14 రోజులు 42 సభలు అని షెడ్యూల్ చేశారు. ఇవన్నీ అత్యంత ముఖ్యమైన ప్రాంతాలలో నిర్వహించే సభలుగా ఉంటున్నాయి.

మరో విధంగా చెప్పాలంటే వైసీపీకి టఫ్ గా ఉండే సీట్లు అని కూడా అంటున్నారు. కొన్ని సీట్లలో గెలుపు కన్ ఫర్మ్ చేయడం కోసం కూడా ఈ సభను అని చెబుతున్నారు. ఇలా నాన్ స్టాప్ గా ఎన్నికల ప్రచారం నిర్వహించాల్సిన నేపధ్యంలో జగన్ వరసగా రెండోసారి ఎన్నికల సభలకు బ్రేక్ ఇచ్చేశారు. నిజానికి చూస్తే ఆయన ఆదివారం ఎన్నికల షెడ్యూల్ ఖరారు అయిపోయింది కూడా.

అయినా క్యాన్సిల్ చేసుకుని ఆయన కీలక భేటీలను నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా పోలింగ్ డేట్ దగ్గర పడడంతో పార్టీ నేతలతో జగన్ ఎన్నికల గురించి పోలింగ్ తీరు గురించి చర్చించేందుకే ఈ భేటీలు అంటున్నారు. ఈసారి ఎన్నికలు టఫ్ గా సాగనుండడంతో పార్టీ నాయకులకు ఆయన దిశా నిర్దేశం చేస్తున్నారు.

అదే సమయంలో గత రెండు నెలలుగా జనంలో జగన్ ఉన్నారు. ఆయనకు గ్రౌండ్ రియాల్టీస్ పూర్తిగా అర్ధం అవుతున్న నేపధ్యంలో ఎక్కడ పార్టీ వీక్ గా ఉందో ఆయన నేతలకు ఎమ్మెల్యే అభ్యర్ధులకు పిలిచి మరీ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెబుతున్నారని అంటున్నారు.

Read more!

ఈసారి ఎన్నికల బాధ్యతలు మొత్తం జగన్ చూడడంతో ఆయన మీదనే పూర్తి భారం పడుతోంది అని అంటున్నారు. మొత్తం ప్రచారం చేయడంతో పాటు పార్టీ వ్యూహాలు ఎలక్షనీరింగ్ గురించి క్యాడర్ కి దిశా నిర్దేశం చేయడం వంటివి అన్నీ కూడా ఆయనే చేయాల్సి వస్తోంది. దాంతోనే ఈ నాన్ స్టాప్ ఎన్నికల ప్రచారం మధ్యలో రెండు బ్రేకులు వచ్చాయని అంటున్నారు.

మరో వైపు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో విపక్షం ఎమోషనల్ గా రైతాంగం ప్రజలను కలుపుకుంటూ టార్గెట్ చేస్తోంది. ఇది చాలా దూరం వెళ్లిపోయింది. జనాలకు టీడీపీ కూటమి చేస్తున్న ఆరోపణలు రీచ్ అయిపోయాయి. దాంతో ఆలస్యంగా మేలుకున్న వైసీపీ ఉపశమన చర్యలు మొదలెట్టింది.

ఇపుడు వైసీపీ నుంచి కౌంటర్లు వస్తున్నాయి. ఈ యాక్ట్ కేంద్రం చేసిందని కూడా చెప్పడానికి వైసీపీ నుంచి ఎవరూ ముందుకు రాకపోవడం తో కార్నర్ అవుతోంది. మీ భూములు మీవి కావు అన్న టీడీపీ కూటమి స్లోగన్ పోలింగ్ దగ్గర పడుతున్న వేళ జనాల్లోకి బలంగా వెళ్తే అది చేసే డ్యామేజ్ అంతా ఇంతా కాదు. దాంతోనే వైసీపీ అధినాయకత్వం రివర్స్ కౌంటర్ స్ట్రాటజీని అమలు చేయాలని చూస్తోంది. ఈ క్రమంలోనే సీఎం జగన్ సైతం ఎన్నికల ప్రచారానికి బ్రేక్ ఇచ్చి మరీ భేటీలు వేస్తున్నారు అని అంటున్నారు.

మొత్తానికి చూస్తే టీడీపీ కూటమి గట్టిగానే బిగిస్తోంది. గ్రౌండ్ లో అనుకున్నంత స్పీడ్ అయితే ఏ పార్టీకి లేదు. ఈ టైం లో రూట్ మార్చి గేర్ మార్చి స్పీడ్ పెంచాల్సిన ఆవశ్యకతను వైసీపీ అధినాయకత్వం తెలుసుకుందని అంటున్నారు. రానున్న కొద్ది రోజుల ప్రచారంలో కూడా సరికొత్త వ్యూహాలతో వైసీపీ ముందుకు కదల నుంది అని అంటున్నారు.

Tags:    

Similar News