• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  జెన్‌జీల కొత్త ట్రెండ్...

జెన్‌జీల కొత్త ట్రెండ్ ‘మాగింగ్’.. అసలేంటిది? ఏం చేస్తున్నారు?

| సోషల్ మీడియాలో జెన్‌జీ యువతను ఇప్పుడు ‘మాగింగ్’ అనే కొత్త ట్రెండ్ ఆకట్టుకుంటోంది. ఎదుటివారితో పోలిస్తే తమ లుక్స్, శరీరాకృతితో పైచేయి సాధించి వారిని తక్కువగా చూపించడమే ఈ ట్రెండ్ ఉద్దేశం. జిమ్ కల్చర్ నుంచి మొదలైన ఈ పదం ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్‌లో వైరల్ అవుతోంది. అయితే నిరంతర పోలికలు మానసిక ఒత్తిడికి దారితీసే ప్రమాదం ఉంది.

By - A.N.Kumar
Update: 2026-11-09 13:30 GMT

అబ్బా.. మహాద్భుతం.. మన జెన్‌జీ మహానుభావులు మరో కొత్త అస్త్రంతో సోషల్ మీడియాను దున్నేస్తున్నారు. కొత్తక ఒక వింత.. పాత ఒక రోత అంటారు.. ఇప్పుడు జెన్ జీ అదే ఫాలో అవుతున్నారు. కాలిన్స్ డిక్షనరీ వారిని సాక్షాత్తూ సింహాసనం మీద కూర్చోబెట్టి మరీ గౌరవించిన సరికొత్త పదం ‘మాగింగ్’.. ఇదే ఇప్పుడు జెన్ జెడ్ ఫాలో అవుతున్న కొత్త ట్రెండ్.. ఇంతకాలం మన పెద్దవాళ్ళు "పరులకి సాయం చేయి.. నలుగురితో కలసిమెలసి ఉండు.. ఎవరితోనూ పోటీ పడకు" అని ఏవో ఏడారంచుల ముసలి కబుర్లు చెప్పేవారు. కానీ మన నేటి తరం జెన్‌జీలు ఆ కాలంచెల్లిన సూత్రాలన్నింటినీ చెత్తబుట్టలో పడేసి సరికొత్త ఫిలాసఫీతో ముందుకు వచ్చారు. అదేంటంటే.. "ఎదుటివాడు ఎంత కుచించుకుపోతే మనం అంత ఎత్తుకు ఎదుగుతాం" అని అంటున్నారు. ఇదేకొత్త జెన్ జెడ్ ట్రెండ్ ‘మాగింగ్’..

ఒకప్పుడు ఎవరైనా అద్దం ముందు నిలబడి "నేను బాగున్నానా?" అని అమాయకంగా అడిగేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ అమాయకత్వం పోయింది. నేటి యువత అద్దంలో చూసుకుంటూ అడుగుతున్న ప్రశ్న వేరు... "నా పక్కన నిలబడిన ఈ రోడ్డు సైడ్ లూజర్ నాకంటే ఎంత డీలా పడిపోయాడు? నా గెటప్ ముందు వీడి మొహం ఎంత చిన్నబోయింది?" ఇదే కదా అసలైన ప్రోగ్రెస్ అంటే..

ఇక ఈ ‘మాగింగ్’ పుట్టింది ఎక్కడో తెలుసా? మన జిమ్‌లలోని కండల వీరుల నుంచి.. అద్దం ముందు నిలబడి బైసెప్స్ చూపించి పక్కవాడిని చిన్నచూపు చూసే ఆ అహంకారపూరిత దృష్తే ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్.. యూట్యూబ్ షార్ట్స్ ద్వారా మహావృక్షమైంది. వీధిలో నలుగురు ఫ్రెండ్స్ నడుచుకుంటూ వెళ్తుంటే.. అందులో ఒకడు కాస్త స్టైలిష్‌గా మీసాలు మెలేస్తూ నడిస్తే చాలు.. కామెంట్ల వర్షం కురిపించేస్తారు.. "అరేయ్.. వాడు మిగతా ముగ్గురినీ ఘోరంగా మాగ్ చేసేస్తున్నాడురా.." అని.. అంటే పక్కవాడి ఆత్మవిశ్వాసాన్ని ముక్కలు చేసి వాడి శవాల మీద మన స్టైల్ సామ్రాజ్యాన్ని కట్టుకోవడమే ఈ ట్రెండ్ సారాంశం..

ఇది ఎంత అద్భుతమైన ఆలోచనో చూడండి.. మనకి చదువు రావక్కర్లేదు.. పది మందికి ఉపయోగపడే పనీ చేయక్కర్లేదు. కేవలం మన జుట్టు స్టైల్, జాకెట్ ఫిట్టింగ్, లేదంటే మొహంలో ఆ టెర్మినేటర్ లుక్ పెట్టి పక్కవాడిని చిన్నబుచ్చితే చాలు.. మనం గ్రేట్ అయిపోతాం. ఇక సోషల్ మీడియాలో వ్యూస్, లైక్స్ కోసం పడే పాట్లు చూస్తే కన్నీళ్లు ఆగవు. ఎవడైనా జిమ్‌లో చెమటలు కక్కుకుంటూ కసరత్తు చేస్తుంటే వాడు ఆరోగ్యంగా ఉండడం కోసం చేస్తున్నాడని అనుకుంటే పొరబడినట్టే.. వాడు పక్కవాడిని ఎలా ‘మాగ్’ చేయాలనే ప్రాణాంతకమైన రీసెర్చ్‌లో ఉన్నాడని అర్థం చేసుకోవాలి.

కానీ ఈ మహామేధావుల ట్రెండ్‌లో చిన్న చిన్న ‘సైడ్ ఎఫెక్ట్స్’ లేకపోలేదు. నిరంతరం ఇతరులతో పోల్చుకోవడం వల్ల పక్కవాడిని ఎలా తొక్కేయాలనే టెన్షన్‌లో వీళ్ల బ్రెయిన్ సెల్స్ అన్నీ కాలిపోతుంటాయి. అద్దంలో చూసుకుంటూ వీళ్లే డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతుంటారు. "అయ్యో వాడు నన్ను మాగ్ చేసేశాడే" అని కుమిలిపోతుంటారు. ఇదే ఈ జెన్ కొత్త ట్రెండ్ లో అసలైన ఉపద్రవం..

అయినా వీటన్నిటినీ మనం తప్పుబట్టలేం బాబూ.. ట్రెండ్స్ మారుతుంటాయి, స్లాంగ్స్ వస్తుంటాయి.. నిన్నటి మొన్నటిదాకా రీల్స్, మీమ్స్ అనుకుంటూ తిరిగిన జెన్‌జీలు, రేపు పొద్దున ఏకంగా ‘మాగింగ్ మినిస్ట్రీ’ పెట్టేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఎందుకంటే, తోటివాడిని ప్రేమించడం కంటే, వాడిని మన చూపులతో, లుక్స్‌తో తొక్కేయడంలో వచ్చే మజానే వేరు కదా మరి!

Tags:    
  • mogging 
  • genz 
  • genztrends 
  • socialmediatrends 
  • viraltrends 
  • instagramreels 

Similar News

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

Copyright @2026

Powered by Blink CMS