ఆవు జీవితమే నయం! ఉద్యోగుల బాధలు వర్ణిస్తూ వైరల్ అవుతున్న ట్వీట్!

ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో మనిషి ఎన్నో ఒత్తిళ్లకు గురవుతున్నాడు.;

Update: 2025-04-22 05:10 GMT

ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో మనిషి ఎన్నో ఒత్తిళ్లకు గురవుతున్నాడు. ముఖ్యంగా ఉద్యోగుల జీవితం మరింత కష్టంగా మారిపోతుంది. పని ఒత్తిడి, బాస్ టెన్షన్, సాలరీ బాధలు, భవిష్యత్ గురించిన ఆలోచనలు వారిని నిత్యం వెంటాడుతూనే ఉంటాయి. ఈ నేపథ్యంలో ఒక నెటిజన్ ఉద్యోగుల జీవితాన్ని ఆవు-దూడతో పోలుస్తూ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ట్వీట్‌లో ఏముందో చూద్దాం!

నెట్ జన్ ఒక ఆవు దూడ నెమరు వేస్తున్న వీడియోను షేర్ చేస్తూ తన గోడు వెల్లబోసుకున్నాడు. "రేపు ఆఫీసుకెళ్లాలి అనే బాధ లేదు. బాస్ గురించి, అప్రైజల్ గురించిన భయం లేదు. జీతం ఎప్పుడొస్తుందా అన్న టెన్షన్ లేదు. పిల్లల చదువు వాళ్ల భవిష్యత్ గురించి చింత లేదు. రేపేం తినాలి, అసలు రేపనేది ఉందా లేదా అని తెలుసుకోవాలన్న కుతూహలం లేదు. వీటిని వెతికే క్రమంలో మనిషి జీవితాన్ని పోగొట్టుకుంటున్నాడు." అని ఆయన తన ట్వీట్‌లో రాసుకొచ్చారు.

ఈ ట్వీట్ చూసిన తర్వాత చాలా మంది ఉద్యోగులు తమకు కూడా ఇలాంటి ఆలోచనలే వస్తున్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. పని ఒత్తిడి, వచ్చిన జీతం సరిపోకపోవడం, భవిష్యత్ గురించిన భయం వంటి అంశాలు వారిని ఎంతగానో కలవర పెడుతున్నాయని చెబుతున్నారు. మరికొందరైతే ఆవు జీవితమే బాగుందని సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.

వాస్తవానికి నేటి పోటీ ప్రపంచంలో ఉద్యోగులు అనేక రకాల ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారు. టార్గెట్ చేరుకోవాలన్న ఒత్తిడి, పని సమయానికి పూర్తి చేయాలన్న ఆందోళన, పెరిగిపోతున్న ఖర్చులు, పిల్లల భవిష్యత్ గురించిన బెంగ వారిని నిత్యం వెంటాడుతూనే ఉంటుంది. దీనికి తోడు, చాలా మందికి తమ పనికి తగిన గుర్తింపు, జీతం రావడం లేదని భావిస్తుండడం వారిని తీవ్ర నిరాశకు గురి చేస్తుంది.

నెట్ జన్ షేర్ చేసిన ఈ ట్వీట్ కేవలం పైకి ఓ సరదా పోస్టులా అనిపించినా, దాని వెనుక ఉద్యోగులు వారు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు దాగి ఉన్నాయి. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. చాలా మంది దీనికి తమదైన శైలిలో నెటిజన్స్ స్పందిస్తున్నారు.

Tags:    

Similar News