సీఎం విజయ్ కూడా స్టార్ట్ చేశాడా?
తమిళనాడు రాజకీయాలంటేనే ఒక అద్భుతమైన చలనచిత్రం. రోజూ ఒక సరికొత్త ట్విస్ట్.. ప్రతి ఫ్రేమ్‌లోనూ ఊహించని సస్పెన్స్ ఉండే ఈ చిత్రంలో ఇప్పుడు మరో కొత్త సీన్ వెలుగులోకి వచ్చింది.
సినిమాల్లోంచి.. రాజకీయాలు ఈయనకు ఏం తెలుసులే.. ఓ ఆట ఆడుకుందామని తమిళనాట ద్రవిడ పార్టీలు డీఎంకే, అన్నాడీఎంకేలు అనుకున్నాయి.. రాజకీయం తెలియని విజయ్ సీఎం కాగానే వారు అలా డిసైడ్ అయిపోయారు. కానీ సినిమాల్లో ప్రభంజనం సృష్టించినట్టే.. రాజకీయాలను సీఎం కాగానే బాగానే వంటపట్టించుకున్నాడు మన సీఎం విజయ్.. కాలుకు కాలు.. లెక్కకు లెక్క తేల్చేందుకు ప్రత్యర్థుల పని పడుతున్నాడు. ఫక్తు రాజకీయ నాయకుడిలా ఆలోచిస్తూ సీఎం విజయ్ కూడా తమిళనాడులో రాజకీయం మొదలుపెట్టేశాడు. విజయ్ నిర్ణయాలు.. దుందుడుకు రాజకీయం ఇప్పుడు తమిళనాట హాట్ టాపిక్ గా మారింది.
తమిళనాడు రాజకీయాలంటేనే ఒక అద్భుతమైన చలనచిత్రం. రోజూ ఒక సరికొత్త ట్విస్ట్.. ప్రతి ఫ్రేమ్‌లోనూ ఊహించని సస్పెన్స్ ఉండే ఈ చిత్రంలో ఇప్పుడు మరో కొత్త సీన్ వెలుగులోకి వచ్చింది. అదే మాజీ పాఠశాల విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేశ్ అరెస్టు వ్యవహారం. మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్‌కు అత్యంత ప్రాణస్నేహితుడైన మహేశ్ గారిపై ప్రైవేట్ బడుల వద్ద నుంచి పార్టీ ఫండ్స్ పేరుతో వంద కోట్లు వసూలు చేశారనే ఆరోపణలు రావడం సంచలనం సృష్టించింది. పాపం ముందస్తు బెయిల్ కోసం ఆయన కోర్టు తలుపు తడితే.. అక్కడ నో ఎంట్రీ బోర్డు పడేసరికి పోలీసులు నేరుగా రంగంలోకి దిగి ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.
సినిమాలాంటి ఈ సీన్ ఇప్పుడు రియల్ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. రజినీకాంత్, కమల్ హాసన్‌లు సైతం ఆలోచించి వెనక్కి తగ్గిన తమిళ రాజకీయాల్లోకి మన దళపతి విజయ్ స్ట్రెయిట్‌గా ఎంట్రీ ఇవ్వడమే కాకుండా ఇప్పుడు సీఎం సీట్లో కూర్చుని తొలి క్లాప్ కొట్టేశారు. అయితే అసలు ప్రశ్న ఏంటంటే ఇది నిజంగానే కొత్త ముఖ్యమంత్రి గారు అవినీతిపై తీసిన సింగం రేంజ్ సర్జికల్ స్ట్రైకా లేక పాత రాజకీయ కక్షల రీలోడెడ్ సినిమానా అని ప్రజలు చర్చిస్తున్నారు. పాఠశాలల అభివృద్ధి కోసం పని చేయాల్సిన విద్యాశాఖలో వంద కోట్ల ఫండ్స్ కలెక్ట్ అయ్యాయంటే.. మహేశ్ గారు విద్యార్థులకు పాఠాలు కాకుండా కలెక్షన్ లెక్చర్లు బాగానే నేర్పించినట్లున్నారు.
అటు ప్రతిపక్షంలో ఉన్న డీఎంకే మాత్రం ఈ వ్యవహారంతో అటూ ఇటూ ఊగిపోతోంది. తమ పార్టీ కంటికి రెప్పలాంటి నేత అరెస్ట్ కాగానే.. ఇది పక్కా రాజకీయ కక్ష సాధింపు అని గగ్గోలు పెట్టడం ప్రారంభించారు. అది వింటుంటే ప్రతీసారి అధికారంలో నుంచి దిగిపోయిన పార్టీలు పాడే పాతపాటే మళ్లీ గుర్తుకొస్తుంది. కానీ నిజంగానే తప్పు జరిగిందా? లేక విజయ్ ప్రభుత్వం తమ పవర్ ఏంటో చూపించడానికి ఫస్ట్ వికెట్ ఎగరేసిండా అనేది కాలమే తేల్చాలి.
ముఖ్యమంత్రి విజయ్ కి మాత్రం ఇది కేవలం విజిల్ వేసి థియేటర్లో ఎగిరి గంతేసే మాస్ సినిమా కాదు.. రియల్ గవర్నెన్స్. అధికారంలోకి రాగానే తమ యాక్షన్ చూపించాలి కాబట్టి ఆయన ఒక పవర్ఫుల్ అడుగు వేశారు. కానీ ఇది కేవలం ఒకప్పటి ప్రత్యర్థులను టార్గెట్ చేసే రాజకీయ డ్రామా కాకుండా.. నిజంగానే వ్యవస్థలో పారదర్శకత తీసుకొస్తుందా అన్నదే అసలు పాయింట్.
అరెస్టులతో సినిమా సస్పెన్స్‌ని క్రియేట్ చేయడం చాలా తేలికే. కానీ చట్టం ముందు ఆ ఆరోపణలను నిరూపించి.. బాధ్యులకు శిక్ష పడేలా చేయడం అసలైన క్లైమాక్స్. మరి విజయ్ ప్రభుత్వం ఈ పాలిటిక్స్ డ్రామాను బ్లాక్‌బస్టర్ హిట్ చేస్తుందో.. లేక రూటిన్ ఫ్లాప్ రోల్‌గా ముగిస్తుందో చూడాలి.