అటు ఆర్నబ్...ఇటు స్థానిక ఎన్నికలు

ఇక ఆర్నబ్ చూస్తే గంటకు 15 కిలోమీటర్ల వేగంగా కోస్తాను కమ్మేస్తోంది. దీంతో మొదట అనుకున్న అంచనాలు తప్పుతున్నాయి.

Update: 2026-10-26 15:03 GMT

ఏపీలో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు మంచి కాక మీద ఉన్నాయి. మరో వైపు చూస్తే అతి భయంకరంగా ఆర్నబ్ తుఫాన్ భీకర రూపంలో దూసుకుని వస్తోంది. ఆర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్ ఏపీలో ఉత్తరాంధ్రా సహా కోస్తా జిల్లాల మొత్తం మీద ఉంటుందని అంటున్నారు. భారీ నుంచి అతి భారీ వర్షాలతో అతలాకుతలం చేస్తుందని అంటున్నారు. భారత వాతావరణ కేంద్రం కూడా ఏపీని అలెర్ట్ చేసింది. ఏపీలో అత్యధిక జిల్లాలు ఆర్నబ్ తాకిడికి ప్రభావితం అవుతాయని అంచనాలు ఉన్నాయి. అనేక జిల్లాలలో వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ కూడా జారీ చేస్తోంది. అలాగే పాఠశాలలతో పాటు అన్ని విద్యాసంస్థలకు సెలవుని రానున్న రెండు రోజుల పాటు ప్రకటించిన నేపథ్యం ఉంది.

యంత్రాంగం సన్నద్ధం :

భారీ తుఫాన్ ఏపీకి రావడం అది కూడా అక్టోబర్ నెలలో అంటే ప్రభుత్వం పూర్తి స్థాయిలో సన్నద్ధం అవుతోంది. గతంలో హుదూద్, కాకినాడలో మూడు దశాబ్దాల క్రితం సంభవించిన తీవ్రమైన తుఫాన్ ని అంతా తలచుకుంటున్నారు. ఇక ఉత్తరాంధ్రాలో తిత్లీ తుఫాన్ కూడా 20118 డిసెంబర్ లో శ్రీకాకుళం జిల్లా మొత్తాన్ని అతలాకుతలం చేసింది. దాంతో ప్రభుత్వ యంత్రాంగం ఆర్నబ్ తుఫాన్ వల్ల ప్రాణ నష్టం సంభవించకుండా చర్యలు తీసుకుంటోంది. దాంతో యంత్రాంగం మొత్తం సమాయత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

గంటకు 15 కిలోమీటర్లతో :

ఇక ఆర్నబ్ చూస్తే గంటకు 15 కిలోమీటర్ల వేగంగా కోస్తాను కమ్మేస్తోంది. దీంతో మొదట అనుకున్న అంచనాలు తప్పుతున్నాయి. ఈ నెల 28న ఈ తుఫాన్ బాపట్ల విశాఖ మధ్యన తీరాన్ని దాటుతుందని అంటున్నా మరింతగా సమయం పడుతుందా అనేది కూడా చర్చకు వస్తోంది. అదే సమయంలో తుఫాన్ తీరాన్ని తాకినా అది బలహీనపడటానికి మరో నలభై ఎనిమిది గంటలు పట్టవచ్చు అని అంటున్నారు. దాంతో స్థానిక సంస్థల ఎన్నికలు ఏ విధంగా జరిపిస్తారు అన్నది కూడా చర్చకు వస్తోంది. నవంబర్ 1న అర్బన్ స్థానిక సంస్థలకు ఎన్నికలు ఉన్నాయి. ఆ వెంటనే 3న కౌంటింగ్ ఉంది. అదే రోజున జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు పోలింగ్ ఉంది. ఇలా చూసుకుంటే ప్రభుత్వ యంత్రాంగం అంతా స్థానిక ఎన్నికల కోసం పూర్తి స్థాయిలో అలెర్ట్ కావాల్సి ఉంది. మరి ఆర్నబ్ తుఫాన్ కూడా ముంచుకొస్తోంది. దాంతో సహాయ చర్యలు తీసుకోవాలని, ముందస్తుగా సన్నద్ధత కూడా అవసరంగా ఉంది.

ఎన్నికలు వాయిదా వేయాలా :

ఈ నేపథ్యంలో స్థానిక సంస్థలను వాయిదా వేయాలని కోరుతున్న వారూ ఉన్నారు. ఆర్నబ్ తుఫాన్ నుంచి ఏపీ క్షేమంగా బయటపడటమే ఇపుడు ముఖ్యమని అంటున్నారు. దాని కోసం పూర్తి స్థాయిలో ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించాలని అంతవరకూ ఎన్నికల కార్యక్రమాలను పక్కన పెట్టాలని అంటున్నారు. ఈ విధంగా చేయడం వల్ల మాత్రమే ఆర్నబ్ తుఫాన్ ని సమర్ధంగా ఎదుర్కోగలమని చెబుతున్నారు. ఎన్నికలు వారం రోజులైనా వాయిదా వేస్తే తప్పు లేదని కూడా అంటున్నారు. నిజంగా చూస్తే ప్రభుత్వ అధికార యంత్రాంగానికి అటు ఎన్నికలా ఇటు ఆర్నబ్ తుఫాన్ నా అన్నది ఉంది. రెండూ ముఖ్యమే. కానీ ప్రకృతి విపత్తు చెప్పి రాదు, అది వచ్చినప్పుడు సర్దుకోవాలి. ఆస్తి ప్రాణ నష్టం కాకుండా చూసుకోవాలి. అలా చూస్తే ఆర్నబ్ కే ప్రాధాన్యత ఇవ్వాలని అంటున్నారు.

Tags:    

Similar News