మరో ప్రభుత్వాన్ని కూల్చిన జెన్ జెడ్.. చాలా దేశాల్లో అస్థిరత.. ఇండియాలో సాధ్యమవుతుందా?
మొదటగా శ్రీలంక.. మొన్న నేపాల్.. అంతకుముందు బంగ్లాదేశ్.. ఇలా యువత, విద్యార్థులు ప్రభుత్వాలను కూల్చారు. జెన్ జెడ్ తిరుగుబాటు ఆయా దేశాల్లో యువతను రోడ్డెక్కేలా చేసింది.
మొదటగా శ్రీలంక.. మొన్న నేపాల్.. అంతకుముందు బంగ్లాదేశ్.. ఇలా యువత, విద్యార్థులు ప్రభుత్వాలను కూల్చారు. జెన్ జెడ్ తిరుగుబాటు ఆయా దేశాల్లో యువతను రోడ్డెక్కేలా చేసింది. కొత్త తిరుగుబాటుకు నాంది పలికింది. ప్రపంచంలోని చాలా దేశాల్లో మూస రాజకీయాలను, అవినీతికి వ్యతిరేకంగా యువతను పోరాటానికి ఉసిగొల్పడంలో ఈ ఉద్యమాలు కొత్త ఊపిరిపోశాయి.
బంగ్లాదేశ్ లో ‘షేక్ హసీనా’.. నేపాల్ లో ప్రధానిని పారిపోయేలా చేసి రేజిమ్ చేంజ్ ఆపరేషన్ ను అక్కడి జెన్ జీ యువత దిగ్విజియంగా పూర్తి చేసింది. శ్రీలంక దివాళా తీయడానికి పాత ప్రభుత్వాలు కారణమని అక్కడి పోరాటం ప్రభుత్వాన్ని మార్చడానికి కారణమైంది. ఇప్పుడు ఈ ఉద్యమ స్ఫూర్తి ప్రపంచవ్యాప్తంగా ఇనుమడిస్తోంది. భారత్ లోనూ నీట్ ఉద్యమాలు సాగిన బలమైన ప్రజాస్వామ్య పునాదులు గల భారత్ లోనూ రేజిమ్ చేంజ్ కేవలం ఓటు ద్వారానే సాధ్యమవుతుందన్న విషయం ప్రపంచానికి అర్థమైంది.
అయితే కేవలం వర్ధమాన దేశాలే కాదు.. అభివృద్ధి చెందిన యూరప్ లాంటి దేశాల్లో కూడా ఇప్పుడు యువత రాజకీయ అవినీతి... అధికారంలో ఉన్న పార్టీలపై పోరుబాటతో అక్కడ ప్రభుత్వాలను మారుస్తున్న పరిస్థితి నెలకొంది.
తాజాగా సెర్బియాలోని విద్యార్థుల ఉద్యమం అక్కడి పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించి ప్రస్తుత ప్రభుత్వాన్ని గద్దెదించే వరకూ సాగింది. 14 ఏళ్లుగా అప్రతిహతంగా పాలిస్తున్న సెర్బియన్ ప్రోగ్రెసివ్ పార్టీ 14 ఏళ్ల సుధీర్ఘ పాలనకు తెరపడేలా చేసింది. ఈయన ప్రభుత్వ అవినీతియే విద్యార్థుల ఉద్యమానికి కారణమైంది. ప్రభుత్వాన్ని దించేసేలా చేసింది.
2024లో నోవి సాద్ రైల్వే స్టేషన్ పైకప్పు కూలి 16 మంది మరణించిన విషాద ఘటన తర్వాత అవినీతి వల్లే ఈ ఘోరం జరిగిందని ఆరోపిస్తూ చెలరేగిన దేశంలో విద్యార్థులు యువత ఉద్యమించారు. ప్రభుత్వ వ్యతిరేక నిరసనల నేపథ్యంలోనే ఈ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో విద్యార్థుల తరుఫున పోటీచేసిన అభ్యర్థులలో ఎక్కువమంది విద్యావేత్తలు, కళాకారులు, వివధ రంగాల నిపుణులు ఉన్నారు. దీంతో దేశవ్యాప్తంగా ఓటర్లు భారీ సంఖ్యలో తరలివచ్చి మూడు దశాబ్దాల్లో ఎన్నడూ లేనివిధంగా సుమారు 65 శాతం పోలింగ్ నమోదు చేశారు. పోలింగ్ ముగిసిన రెండు గంటల్లోనే ప్రస్తుత అధ్యక్షుడు పూచిక్ తన ఓటమిని అంగీకరించడంతో.. ఉద్యమించిన యువత, ప్రజలు, విద్యార్థులు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా వేడుకలు జరుపుకున్నారు.
చాలా దేశాల్లో అస్థిరత..
మన పొరుగున ఉన్న పాకిస్తాన్ లోనూ ఇలాంటి ఆందోళనలు సాగుతున్న అక్కడ బలమైన సైనిక నియంత అసీమ్ మునీర్ దేశంలోని ఆందోళనలను అణిచివేస్తూ కాల్పులు జరుపుతూ ప్రాణాలు తీస్తున్న పరిస్థితి నెలకొంది. ఇక యూరప్ లోని కొన్ని దేశాల్లోనూ ఇలాంటి ఉద్యమాలు సాగాయి. ఇటీవల ఫ్రాన్స్ లోనూ విద్యావవ్యస్థ, టీచర్ల కొరత, నిరుద్యోగంపై యువత భగ్గుమని విధ్వంసం సృష్టించారు. అమెరికాలోనూ ట్రంప్ కు వ్యతిరేకంగా ర్యాలీలు సాగుతూనే ఉన్నాయి. బ్రిటన్ లో పాకిస్తానీ ముస్లింల లైంగిక దాడులపై పెద్ద ఎత్తున ఆందోళన సాగింది. స్పెయిన్ లోనూ ఆఫ్రికా నుంచి వచ్చిన వలసల వల్ల కుతకుత నడుస్తోంది. సో ప్రస్తుతం ఏఐ, యుద్ధాలు, వలసల వల్ల ఉపాధి, నిరుద్యోగం పెరిగి యూరప్ లోని చాలా దేశాల్లో ఈ అస్థిరమైన పరిస్థితులున్నాయి. ఇజ్రాయెల్ లోనూ ప్రస్తుత ప్రధాని ఫెయిల్ అయిపోయాడని.. హమాస్ దాడిని ఎదుర్కోలేదని పెద్ద ఎత్తున నిరసన జరిపారు. దీంతో ఏ దేశంలో ఎప్పుడు భగ్గుమంటుందోనన్న పరిస్థితి నెలకొంది.
ఇండియాలో సాధ్యమేనా?
భారత్ లో ఇలాంటి రెజీమ్ చేంజ్ యత్నాలు సాగాయి. ఇటీవల కాక్రోచ్ జనతాపార్టీ చేసిన నిరసనలు ఆ కోవలోనే.. కానీ మన దగ్గర బలమైన ప్రజాస్వామ్యం ఉంది. కేవలం ఓటు ద్వారానే రెజీమ్ చేంజ్ సాధ్యం. సీజేపీ నిరసనలతో అలాంటివి చేయాలనుకున్న సాధ్యపడలేదు. నీట్ ఆందోళనలతో దిద్దుబాటు చర్యలు చేపట్టిన మోడీ సర్కార్.. ఆ తర్వాత సీజేపీ ఆందోళనపై ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి ఎలాంటి భారీ హైప్ రాకుండా నిరసనలు తుత్తునియలు అయ్యేలా చేసింది. బలమైన నేతలు, ప్రజాస్వామ్యం, చట్టం, పోలీస్ వ్యవస్థ ఉండడం వల్ల భారత్ లో ఇలాంటి చేయాలనుకుంటే భంగపాటు తప్పదు. ఇక్కడ ఏదైనా ఓటు ద్వారానే నేతల తలరాతలు మార్చవచ్చు.