చిన్న శ్రీను కూతురుదే జెడ్పీ పీఠం ?

విజయనగరం జడ్పీ పీఠం చిన్న శ్రీను కూతురు పరం అవుతుందని ఆయన మద్దతుదారులు అంటున్నారు.

Update: 2026-10-25 17:30 GMT

విజయనగరం జడ్పీ పీఠం చిన్న శ్రీను కూతురు పరం అవుతుందని ఆయన మద్దతుదారులు అంటున్నారు. రెండు చోట్ల నుంచి నామినేషన్లు దాఖలు చేసిన చిన్న శ్రీను కూతురు సిరి సహస్ర ప్రత్యర్ధి వైసీపీకి దడ పుట్టించింది అని అంటున్నారు. అందుకే ఆమె కుల ప్రస్తావన తో వైసీపీ విమర్శలు చేస్తోంది అని అంటున్నారు. విజయనగరం జిల్లా కొత్త వలస, తెర్లాం మండలాల నుంచి సిరి సహస్ర తన నామినేషన్లు జెడ్పీటీసీగా దాఖలు చేశారు. దాంతో విజయనగరం జిల్లా రాజకీయాల్లో చిన్న శ్రీను పట్టు ఏమిటి అన్నది రుజువు అయింది అని అంటున్నారు.

మొగ్గు అటు వైపే :

ఇదిలా ఉంటే పోటా పోటీ అనుకున్న విజయనగరం జిల్లా పరిషత్తు ఎన్నికల్లో మొగ్గు నామినేషన్ల సమయంలోనే కూటమి వైపు ఉందని అంటున్నారు. కూటమి నుంచి బలమైన అభ్యర్ధులు బరిలోకి దిగారని గుర్తు చేస్తున్నారు. అదే విధంగా మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు, సీనియర్ నేతల వారసులు అంతా ముగ్గులోకి దిగినందువల్ల గట్టిగానే కూటమి ఫోకస్ ఉందని అంటున్నారు. ఇక వైసీపీ నుంచి సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ ఫ్యామిలీ నుంచే నలుగురు అభ్యర్ధులు నామినేషన్లు దాఖలు చేస్తే ముగ్గురివి మాత్రమే ఆమోదం పొందాయి. బొత్స తమ్ముడు కొడుకు నామినేషన్ తిరస్కరణకు గురి కావడం షాకింగ్ పరిణామంగా భావిస్తున్నారు. మరో వైపు వైసీపీకి సరైన అభ్యర్ధులు దొరకడం లేదని కూటమి నేతలు ఆరోపించారు.

బస్తీ మే సవాల్ :

చిన్న శ్రీను మద్దతుదారులు అంతా వైసీపీ నుంచి టీడీపీ నుంచి రావడంతో కూటమి బలం రెట్టింపు అయింది అని అంటున్నారు. దాంతో పాటు జిల్లా రాజకీయాల మీద చిన్న శ్రీనుకు మంచి అవగాహన ఉండడంతో జెడ్పీ ఎన్నికలు కూటమికి కలసి వచ్చేలా కనిపిస్తున్నాయని అంటున్నారు. ఇక ఈ ఎన్నికలు తన రాజకీయ జీవితానికే పరీక్ష కాబట్టి చిన్న శ్రీను ప్రతిష్టగా తీసుకున్నారు అని అంటున్నారు. కూటమికే జిల్లా మొత్తం మీద ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నారు. అంతా కసి మీద పని చేస్తున్నారని తెలుస్తోంది. దాంతో వైసీపీని బస్తీ మే సవాల్ అని లోకల్ ఫైట్ లో రెట్టిస్తున్నారు.

బొత్స శిబిరానికి పరీక్ష :

అదే విధంగా చూస్తే బొత్స సత్యనారాయణ శిబిరానికి ఇది అగ్ని పరీక్ష అని అంటున్నారు. చిన్న శ్రీను ప్రభావం ఏదీ లేదని చాటి చెప్పాలని వైసీపీ గట్టి ప్రయత్నమే చేస్తోంది. బొత్స అయితే పూర్తిగా విజయనగరం జిల్లా మీదనే ఫోకస్ పెట్టారు అంటున్నారు. అయితే వైసీపీకి నెల్లిమర్ల, గజపతినగరం, ఎస్ కోట, బొబ్బిలిలతో పాటు బొత్స సొంత ఇలాకా చీపురుపల్లిలో సైతం ఈసారి పరిస్థితులు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయని అంటున్నారు. గ్రౌండ్ లెవెల్ లో చిన్న శ్రీను మద్దతుదారులు ఆ వైపు వెళ్ళడంతో ఎన్నికల సమయంలో ఆల్టర్నేషన్ లీడర్ షిప్ ని వైసీపీ తయారు చేసుకోలేకపోయింది అని అంటున్నారు. ఏది ఏమైనా బొత్స కూడా తన రాజకీయ చాతుర్యాన్ని ఈ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో ఉపయోగిస్తున్నారు. మరి ఢీ అంటే ఢీ కొడుతున్న ఈ ఎన్నికలు అయితే ఆసక్తిని పెంచుతున్నాయి.

Tags:    

Similar News