కొత్త ప్రోటోకాల్ ప్రకారం వందేమాతరం 6 చరణాలు ఇవే.. అర్థం ఏమంటే?

ఇలాంటి వేళ.. కేంద్రం తీసుకొచ్చిన కొత్త ప్రోటోకాల్ నేపథ్యంలో వందేమాతరం ఆరు చరణాలు.. వాటి అర్థం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.;

Update: 2026-02-12 06:30 GMT

కేంద్ర హోంశాఖ తాజాగా వందేమాతరం ఆరు చరణాల్ని పూర్తిగా ఆలపించాలని స్పష్టం చేయటం తెలిసిందే. ఈ నేపథ్యంలో వందేమాతరం 6చరణాలు ఏంటి? దాని అర్థం ఏమిటన్న ప్రశ్న పలువురికి కలుగుతోంది. ఏళ్లకు ఏళ్లుగా మొదటి రెండు చరణాలు మాత్రమే ఆలపించే వందేమాతర గీతం మిగిలిన నాలుగు చరణాలు చాలామందికి అవగాహన ఉండని పరిస్థితి. ఇలాంటి వేళ.. కేంద్రం తీసుకొచ్చిన కొత్త ప్రోటోకాల్ నేపథ్యంలో వందేమాతరం ఆరు చరణాలు.. వాటి అర్థం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

ఆరు చరణాల్లో వందేమాతరం..

వందే మాతరం

సుజలాం సుఫలాం మలయజశీతలాం,

సస్యశ్యామలం మాతరం!

వందేమాతరం!

శుభ్రజ్యోత్స్నా పులకిత యామినీం,

ఫుల్ల కుసుమిత ద్రుమదళ శోభినీం,

సుహాసినీం సుమధుర భాషిణీం,

సుఖదాం వరదాం, మాతరమ్!

వందే మాతరమ్!

కోటి కోటి కంఠ కలకల నినాద కరాళే,

కోటి కోటి భుజైర్ధృత ఖరకరవాలే,

అబలా కేనో మా ఏత బలే?

బహుబల ధారిణీం, నమామి తారిణీం,

రిపుదళ వారిణీం, మాతరం!

వందేమాతరం!

తుమి విద్యా, తుమి ధర్మా తుమి హృది, తుమి మర్మ,

త్వం హి ప్రాణాః శరీరే!

బాహుతే తుమి మా శక్తి హృదయే తుమి మా భక్తి,

తోమరై ప్రతిమా గాడి మందిరే మందిరే,

వందేమాతరం!

త్వం హి దుర్గా దశప్రహరణ ధారిణీ,

కమలా కమల దళ విహారిణీ,

వాణీ విద్యాదాయినీ, నమామి త్వామ్,

నమామి కమలాం అమలాం అతులామ్,

సుజలాం సుఫలాం మాతరం

వందేమాతరం!

శ్యామలాం సరళాం సుస్మితాం భూషితాం,

ధరణీం భరణీం, మాతరం!

వందేమాతరం!

వందేమాతరం!

దీన్ని ఆలపించటానికి పట్టే సమయం మూడు నిమిషాల పది సెకన్లు. ఈ గీతాన్ని ఆలపించే సమయంలో పాటించాల్సిన విధివిధానాల్ని స్పష్టం చేసిన కేంద్ర హోం శాఖ కొన్ని మినహాయింపుల్ని ఇచ్చింది. అదేమంటే.. సినిమాహాళ్ల వంటి వేదికల్లో మధ్యలో వందేమాతరం గేయం ప్లే చేసిన సందర్భంలో లేచి నిలబడటం తప్పనిసరి కాదు. అదే సమయంలో వందేమాతరం.. జనగనమన ఆలపించేందుకు ముందుగా జాతీయ గేయం ఆలపించాల్సి ఉంటుంది.

ఇక.. వందేమాతరం ఆరు చరణాలకు ఉన్న అర్థం ఏమిటి? అన్న విషయంలోకి వెళితే..

వందే మాతరం

(భారత మాతా నీకు వందనం)

సుజలాం సుఫలాం

(గల గల పారే ప్రవాహాలతో)

మలయజ శీతలాం

(ఎంతో వేగవంతమైన చల్లని గాలులతో)

సస్య శ్యామలాం మాతరం

(సస్యశ్యామల మైన దేశమా నీకు వందనాలు)

||వందే మాతరం||

(భారత మాతా నీకు వందనం)

శుభ్రజ్యోత్స్నా పులకితయామినీం

(తెల్లని వెన్నెలలు కలిగిన రాత్రులలో)

పుల్లకుసుమిత ద్రుమదల శోభినీం

(వికసించిన పువ్వులు పచ్చని చెట్ల శోభతో)

సుహాసినీం సుమధుర భాషిణీం

(స్వచ్చమైన నవ్వులు మధురమైన మాటలతో)

సుఖదాం వరదాం మాతరం

(మాకు సుఖమును వరములను ఇచ్చు మాతా నీకు వందనం)

|| వందే మాతరం||

(భారత మాతా నీకు వందనం)

కోటికోటి కంఠ కలకల నినాదకరాలే

(కోటి కోటి కంఠముల నినాదములు)

కోటి కోటి భుజైర్ ధృత కర కరవాలే...

(అనేక కోట్ల భుజములు కరములు కలిగిన దేమి)

అబలా కేయనో మా ఏతో బలే

(అబలకు బలమిచ్చు శక్తిని)

బహుబల ధారిణీం నమామి తారిణీం

(బాహు శక్తులు ధరించిన మాతా)

రిపుదలవారిణీం మాతరామ్...

(శత్రువు నుంచి మమ్ము రక్షించు మా తల్లీ నీకు వందనం)

|| వందే మాతరం ||

(భారత మాతా నీకు వందనం)

తుమి విద్యా తుమి ధర్మ తుమి హృది తుమి మర్మ ...

(నీవే విద్యవు.. నీవే ధర్మము.. నీవే హృదయము.. నీవే మర్మము)

త్వం హి ప్రాణాః శరీరే

(మా శరీరంలో ప్రాణమూ నీవే)

బాహుతే తుమి మా శక్తి హృదయే తుమి మా భక్తి

(మాలో శక్తివి నీవే.. మా మనస్సులో భక్తివి నీవే)

తో మారయి ప్రతిమా గడి మందిరే మందిరే

(మా హృదయ మందిరములో ప్రతి రూపానివి నీవే)

|| వందే మాతరం||

(భారత మాతా నీకు వందనం)

త్వం హి దుర్గా దశ ప్రహరణ ధారిణీ

(పది ఆయుధములు చేత బట్టిన దుర్గవి నీవే)

కమలా కమలదళ విహారిణీ...

(పద్మ దళములందు విహరించే లక్ష్మివి నీవే)

వాణీ విద్యాదాయినీ

(విద్యాధాత్రివైన సరస్వతివి నీవే)

నమామి త్వాం

(తల్లీ నీకు నమస్కారం)

నమామి కమలామ్ అమలామ్ అతులాం

(కమలా..అయలా....అతులా)

సుజలాం సుఫలాం మాతరం

(సుజలా సుఫలా మాతా నీకు వందనం)

|| వందే మాతరం||

(భారతమాతా నీకు వందనం)

శ్యామలాం సరలాం సుస్మితాం భూషితాం

(శ్యామలా సరళా సుస్మితా అలంక్రుతా)

ధరణీం భరణీం మాతరం

(మా భారము మోయు భారత మాతా నీకు వందనం)

Tags:    

Similar News