• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  బెయిల్ వచ్చాకా.. వంశీకి...

బెయిల్ వచ్చాకా.. వంశీకి వేధింపులు తప్పట్లేదా?

| వివిధ కేసుల్లో జైలుకు వెళ్లి.. ఇటీవల బెయిల్ మీద విడుదలయ్యారు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.

By - Tupaki Desk
Update: 2025-07-13 03:57 GMT

వివిధ కేసుల్లో జైలుకు వెళ్లి.. ఇటీవల బెయిల్ మీద విడుదలయ్యారు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా ఆయనకు వేధింపులు తప్పట్లేదని చెబుతున్నారు. పోలీసుల్ని అడ్డు పెట్టుకొని కూటమి సర్కారు కక్ష సాధింపు చర్యలు చేపడుతుందని వైసీపీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇందుకు తాజాగా చోటు చేసుకున్న ఒక పరిణామమే నిదర్శనమని చెబుతున్నారు. ఇక్కడ ప్రస్తావించాల్సిన అంశం ఒకటి ఉంది. వంశీని పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నట్లుగా వైసీపీ వర్గాలు మండిపడుతుంటే.. వారిని బుజ్జగిస్తూ ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన దారిన తాను వెళ్లిపోయారు వంశీ. ఇంతకూ అసలేం జరిగిందంటే..

కోర్టు నుంచి బెయిల్ అందుకున్న నేపథ్యంలో జైలు నుంచి విడుదలయ్యారు వంశీ. అయితే..కోర్టు ఆదేశాల నేపథ్యంలో క్రైం నెంబరు 142/25 మైనింగ్ కేసులో వంశీ విచారణ కోసం గన్నవరం పోలీసు స్టేషన్ కు వెళ్లారు. శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో స్టేషన్ కు వెళ్లిన ఆయన సంతకాలు చేశారు. విచారణ అధికారి పోలీస్ స్టేషన్ కు రాకపోవటంతో ఆయన అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది.

దాదాపు మూడు గంటల పాటు పోలీస్ స్టేషన్ కు కూర్చొండిపోయారు వంశీ. ఆయనకు ఆరోగ్యం బాగోలేదని.. ఆసుపత్రికి వెళ్లాల్సి ఉందని.. త్వరగా విచారించి పంపేయాలని వంశీ మద్దతుదారులు.. అభిమానులు పోలీసుల్ని కోరారు. విచారణ అధికారి రాకుండా తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని పోలీసు సిబ్బంది తేల్చి చెప్పారు. దీంతో మూడు గంటలకు పైనే పోలీస్ స్టేషన్ లో ఉండిపోయారు వంశీ.

చివరకు సదరు విచారణ అధికారి స్టేషన్ కు రారని.. విచారణ కోసం వంశీ స్టేషన్ కు ఎప్పుడు రావాలో తాము లేఖ ద్వారా తెలియజేస్తామని చెప్పటంతో వంశీ వర్గీయులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పోలీసుల్ని అడ్డు పెట్టుకొని కూటమి సర్కారు వంశీని వేధింపులకు గురి చేస్తుందని మండిపడ్డారు. అయితే.. వారిని వంశీ సముదాయించారే కానీ ఒక్క విమర్శ కూడా చేయకుండా పోలీస్ స్టేషన్ నుంచి నేరుగా విజయవాడ ఆసుపత్రికి వెళ్లారు. మొత్తంగా వంశీ వ్యవహారంలో పోలీసులు అనుసరిస్తున్న వైఖరిని వైసీపీ వర్గాలు ఆగ్రహన్ని వ్యక్తం చేస్తున్నాయి.

Tags:    
  • VamsiBailIssue 
  • PoliticalVendetta 
  • YSRCPAllegations 
  • AndhraPolitics 
  • Gannavaram 
  • VallabhaneniVamsi 
  • APGovernment 
  • VamsiBailCase 
  • AndhraLawAndOrder 

Similar News

పవన్ ఇలాకాలో ఏంటీ తేడా...బిగ్ నంబర్ తోనే !

2026-11-04 17:46 GMT

రేవంత్ బయటపెట్టిన ‘ది గ్రేట్ ఫైనాన్షియల్’ మార్వలస్ ఐడియా

2026-11-04 13:15 GMT

రేవంత్ గెలవడని కేటీఆర్ డిసైడ్.. ఆ భూములు కొనొద్దని పారిశ్రామికవేత్తలకు హెచ్చరిక

2026-11-04 13:10 GMT

పాపం ష‌ర్మిల‌.. ఇంత హ‌ర్ట్ అవుతార‌నుకోలేదా ..?

2026-11-04 13:01 GMT

మాజీ ఐపీఎస్‌.. ఓట‌మి స్ఫూర్తి.. !

2026-11-04 13:00 GMT

నాన్న‌గారి ఆశ‌యాలు నెర‌వేరుస్తా: రాధా ఫ‌స్ట్ స్పీచ్‌

2026-11-04 13:00 GMT

నియంతలు ట్రంప్, నెతన్యాహు ఔట్ అట.. ‘సీజేపీ‘ నేతలు హ్యాపీ.. టార్గెట్ మోడీయేనా?

2026-11-04 12:57 GMT

ఓటువేయలేదుగా.. నా డబ్బులు నాకివ్వండి.. వైసీపీ అభ్యర్థి 'రివర్స్ వసూళ్లు' వైరల్

2026-11-04 11:17 GMT

భారతీయులతో పెట్టుకున్నాడు.. ట్రంప్ అనుభవిస్తున్నాడు..

2026-11-04 10:57 GMT

టికెట్ ధ‌ర‌ల‌పై CM విజ‌య్ ముందు చూపు మనవాళ్ల‌కు ఏదీ?

2026-11-04 09:39 GMT

ఏపీలో మ‌రో ఎన్నిక‌ల పోరు..!

2026-11-04 09:22 GMT

రాప్తాడు నిందితుడిపై కాల్పుల కేసులో కీలక పరిణామం

2026-11-04 09:14 GMT

Copyright @2026

Powered by Blink CMS