వల్లభనేని వంశీకి బెదిరింపు కాల్స్ ఎవరి నుంచి ?
మరో వైపు చూస్తే వంశీ వైసీపీ అధినేత జగన్ ని కలిశారు. ఈ సందర్భంగా తాను పార్టీ కార్యక్రమాలలో తిరిగి చురుకుగా పాల్గొంటానని వంశీ ఆయనకు చెప్పారని అంటున్నారు.;
వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బెదిరింపు కాల్స్ వస్తున్నాయా. ఆయనను ఎవరు బెదిరిస్తున్నారు. నిన్ను చంపేస్తామని అదే పనిగా ఫోన్ కాల్స్ వస్తున్నాయని అంటున్నారు. దాంతో వంశీ విజయవాడ సబ్ జైలు నుంచి ఇలా వచ్చీ రావడంతోనే ఆయన సతీమణి పంకజాక్షి పోలీసులకు ఈ బెదిరింపు కాల్స్ మీద ఫిర్యాదు చేశారని అంటున్నారు.
ఇదిలా ఉండగా వంశీని బయట తిరగనీయమని ఆయనను లేకుండా చేస్తామని బెదిరింపు కాల్స్ వస్తున్నాయని వైసీపీ వర్గాలు అంటున్నారు. వంశీ డైనమిక్ పొలిటికల్ లీడర్ గా ఉన్నారని అందుకే ఆయనను టార్గెట్ చేశారని అంటున్నారు. వంశీని ఏకంగా నాలుగు నెలల పాటు జైలు గోడల మధ్య తప్పుడు కేసులు పెట్టి బంధించారని ఇపుడు అన్ని కేసులలో బెయిల్ తెచ్చుకుని బయటకు వస్తే ఈ బెదిరింపు కాల్స్ ఏమిటి అని అంటున్నారు
మరో వైపు చూస్తే వంశీ వైసీపీ అధినేత జగన్ ని కలిశారు. ఈ సందర్భంగా తాను పార్టీ కార్యక్రమాలలో తిరిగి చురుకుగా పాల్గొంటానని వంశీ ఆయనకు చెప్పారని అంటున్నారు. అయితే వంశీ జైలులో చాలా కాలం పాటు ఉండడంతో ఆయన ఆరోగ్యం పాడైందని అందువల్ల ఆయన కొన్నాళ్ళ పాటు రెస్ట్ తీసుకోవాలని ఆ మీదట పార్టీ కార్యక్రమాలలో పాల్గొనాలని జగన్ సూచించారని అంటున్నారు.
మరో వైపు వంశీ గన్నవరంలో పవర్ ఫుల్ లీడర్ గా ఉన్నారు. ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి తీరుతారు అని ఆయన అనుచరులు అంటున్నారు. అయితే ఆయన సతీమణి పంకజాక్షి పోటీ చేస్తారు అని కూడా ప్రచారం సాగుతోంది. ఏది ఏమైనా గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గాన్ని వంశీకే విడిచిపెట్టాలని జగన్ ఆలోచిస్తున్నారు అని అంటున్నారు.
బలమైన సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో పాటు కమిట్మెంట్ ఉన్న నాయకుడుగా వంశీ ఉన్నారని అందుకే ఆ సీటు విషయంలో ఆయన నిర్ణయానికే వదిలిపెట్టాలని వైసీపీ హైకమాండ్ ఆలోచిస్తోంది అని అంటున్నారు.
ఇంకో వైపు నుంచి చూస్తే కనుక వంశీకి బెయిల్ లభించింది కానీ మీడియా ముందు ఏమీ మాట్లాడరాదు అని కండిషన్లు పెట్టారని అంటున్నారు. దాంతోనే ఆయన మౌనంగా ఉండిపోతున్నారు అని చెబుతున్నారు. ఇక రానున్న కాలంలో కనుక ఈ షరతులు సడలిస్తే ఆయన మీడియా ముందుకు వస్తారని చెబుతున్నారు.
వంశీ విషయంలో మాత్రం వైసీపీ గట్టిగా నిలబడింది అని అంటున్నారు. అదే విధంగా ఆయన కూడా తన పోరాట పటిమను చూపించి జైలు గోడల నుంచి బయటకు వచ్చారని అంటున్నారు. ఉమ్మడి క్రిష్ణా జిల్లాలో బలమైన నాయకులు వైసీపీకి అవసరంగా ఉంది అని అంటున్నారు. దాంతో రానున్న రోజులలో వంశీ పొలిటికల్ యాక్షన్ ప్లాన్ ఏంటి అన్నది తెలుస్తుంది అని అంటున్నారు.