• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ట్రంప్‌ సుంకాలు :...

ట్రంప్‌ సుంకాలు : భారత్‌లో భారీగా ఉద్యోగాలు ఊస్ట్

| అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విధించిన సుంకాల ప్రభావం ఇప్పుడు కేవలం ఆర్థిక లెక్కల్లోనే కాదు.. భారత ఉద్యోగ మార్కెట్‌ దాకా చేరుకుంది.

By - A.N.Kumar
Update: 2025-09-12 16:14 GMT

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విధించిన సుంకాల ప్రభావం ఇప్పుడు కేవలం ఆర్థిక లెక్కల్లోనే కాదు.. భారత ఉద్యోగ మార్కెట్‌ దాకా చేరుకుంది. సూరత్‌లో 1.35 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోవడం ఒక్క ఉదాహరణ మాత్రమే. ముత్యాలు, ఆభరణాలు, సముద్రపు ఆహార ఎగుమతులు, తయారీ రంగం అన్నీ ఈ దెబ్బ తాలూకు ప్రతికూలతను అనుభవిస్తున్నాయి. కాంగ్రెస్‌ నేత శశి థరూర్‌ సింగపూర్‌లో చేసిన వ్యాఖ్యలు ఈ వాస్తవానికి ప్రతిబింబం.

ట్రంప్‌ వైఖరి.. దౌత్యానికి విరుద్ధం

థరూర్‌ చేసిన విమర్శల్లో ఒక ముఖ్యమైన కోణం ట్రంప్‌ ప్రవర్తన. అమెరికా అధ్యక్షుడి స్థాయి నుంచి ఎప్పుడూ వినిపించని మాటలు ఆయన నోట వినిపిస్తున్నాయి. ప్రపంచ దేశాలు తన ముందు మోకరిల్లుతాయని చెప్పడం, భారత్‌–రష్యాలను “డెడ్‌ ఎకానమీలు”గా వ్యవహరించడం, తనకే నోబెల్‌ శాంతి బహుమతి అర్హత ఉందని గొప్పలు చెప్పుకోవడం ఇవన్నీ ఒక దేశాధినేతగా చూపవలసిన సమతుల్య వైఖరికి విరుద్ధం.

దౌత్యం అనేది సహకారం, గౌరవం, సమన్వయం మీద నడుస్తుంది. కానీ ట్రంప్‌ ఆచరణలో అవి అరుదుగా కనిపిస్తున్నాయి. అమెరికా వంటి శక్తివంతమైన దేశం తీసుకునే నిర్ణయాలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయి. అలాంటప్పుడు నిర్లక్ష్య ధోరణి అనేక దేశాలను ఇబ్బందుల్లోకి నెడుతోంది.

* భారత్‌ ముందున్న మార్గం

అమెరికా సుంకాల వల్ల భారత్‌కు వచ్చిన ఇబ్బందులు వాస్తవమే. కానీ దీన్ని కేవలం విమర్శలతో ముగించలేం. మన ఎగుమతులను ఒకే మార్కెట్‌కు పరిమితం చేయడం ఎంత ప్రమాదకరమో ఈ పరిణామం మనకు గుర్తు చేసింది. ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా, ఆసియా దేశాల్లో కొత్త మార్కెట్లను వెతకడం అత్యవసరం. తయారీ రంగానికి విస్తృత మద్దతు ఇవ్వడం, దేశీయ వినియోగాన్ని పెంచడం కూడా కీలకం... అమెరికాతో చర్చలు కొనసాగించడం అవసరమే అయినా, దానిపై ఆధారపడటం మాత్రం ప్రమాదకరం.

ట్రంప్‌ విధానం, అతని దౌత్య శైలి ఇవి గందరగోళాన్ని సృష్టిస్తున్నాయన్నది థరూర్‌ వ్యాఖ్యల సారాంశం. కానీ ఈ గందరగోళం మనకు ఒక పెద్ద పాఠాన్ని కూడా చెబుతోంది. ప్రపంచ మార్కెట్లలో విభిన్న అవకాశాలను అన్వేషించకపోతే, ఒకే దేశంపై ఆధారపడితే, భారత ఆర్థిక వ్యవస్థ మరిన్ని దెబ్బలు తినే ప్రమాదం ఉంది. కాబట్టి, ట్రంప్‌ సుంకాలను విమర్శించడం మాత్రమే కాకుండా, భారత్‌ కొత్త వ్యూహాలతో ముందుకు సాగాల్సిన సమయం ఇది.

Tags:    
  • TrumpTariffs 
  • IndiaJobs 
  • IndianExports 
  • ShashiTharoor 
  • ట్రంప్ సుంకాలు 
  • భారత ఎగుమతులు 
  • సూరత్ ఉద్యోగ నష్టం 

Similar News

ఇతరుల ఆనందమే కొలమానమా? జెన్ జెడ్ ను ఒత్తిడికి గురిచేస్తున్న సోషల్ మీడియా

2026-11-02 11:30 GMT

50 టీఎంసీల వరద..?! ‘మురసు’తో నిండనున్న పులిచింతల, నాగార్జునసాగర్

2026-11-02 11:04 GMT

దక్షిణాదికి బుల్లెట్ ట్రైన్.. బెంగళూరు నుంచి చెన్నైకి కేవలం 73 నిమిషాల్లోనే!

2026-11-02 10:24 GMT

తుఫాన్ల నెల నవంబర్.. అసలు కారణాలు ఏంటి?

2026-11-02 10:00 GMT

అమెరికా ఎన్నికలతో భారత్‌కు కొత్త పరీక్ష.. ట్రంప్ ఓడితే భారత్ కు లాభమా? నష్టమా?

2026-11-02 10:00 GMT

రాప్తాడు ఉన్మాదికి పోలీసు శిక్ష.. కుళ్లిపోయిన కుడికాలు, తొలగించే అవకాశం!

2026-11-02 09:58 GMT

తెలంగాణపై బీజేపీ ఫుల్ ఫోకస్.. అమిత్ షా ‘హైదరాబాద్ వ్యూహం’ గేమ్ ఛేంజర్ అవుతుందా?

2026-11-02 09:50 GMT

నెల్లూరుకు సమీపంలో ‘మురసు’.. ఐదు జిల్లాలలో భారీ వర్షాలు

2026-11-02 08:24 GMT

రాప్తాడు బాలిక హెల్త్ బులిటెన్.. కీలక సమాచారం వెల్లడించిన మంత్రి లోకేశ్

2026-11-02 07:56 GMT

ఓడిపోతానని ట్రంప్ కు జ్ఞానోదయం.. ఇన్నాళ్లకు తెలిసి (తెలివి) వచ్చింది..

2026-11-02 07:05 GMT

మారథాన్‌లో విజయం.. జీవితంలో విషాదం.. పరుగుపందెం పూర్తి చేసి ప్రాణాలు విడిచిన టెక్కీ

2026-11-02 06:43 GMT

తొలిరోజే రూ.68 లక్షల జరిమానాలు.. ఢిల్లీలో కాలుష్యంపై యుద్ధం..

2026-11-02 05:28 GMT

Copyright @2026

Powered by Blink CMS