• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  గడువు ముగిసిన బాంబుల...

గడువు ముగిసిన బాంబుల ప్రయోగమా? అమెరికా 'యుద్ధ నీతి'ని చూసి సిగ్గుపడండి..

| ఇరాన్‌తో సైనిక ఘర్షణల్లో అమెరికా నేవీ గడువు ముగిసిన టోమాహాక్ క్రూయిజ్ క్షిపణులను ఉపయోగించడం చర్చనీయాంశమైంది. పాత క్షిపణులు పరీక్షల్లో సరిగానే పనిచేశాయని అమెరికా రక్షణ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆయుధాల కొరత, ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగానే వీటిని వాడుతున్నారనే చర్చ సాగుతోంది. పాత క్షిపణుల భద్రతపై ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

By - A.N.Kumar
Update: 2026-11-19 05:02 GMT

మన ఇంట్లో పాల ప్యాకెట్ గడువు దాటితే పడేస్తాం.. మందుల షీట్ ఎక్స్‌పైరీ అయితే డస్ట్‌బిన్‌లో విసిరేస్తాం. కానీ ప్రపంచానికి పెద్దన్నగా చెలామణి అయ్యే అమెరికా మాత్రం.. అబ్బే.. అవన్నీ మీలాంటి సామాన్యులకు.. మాకు కాదు అంటోంది. తాజాగా ఇరాన్‌తో సాగుతున్న సైనిక ఘర్షణల్లో అమెరికా నేవీ ఏకంగా గడువు ముగిసిన పాత టోమాహాక్ క్రూయిజ్ క్షిపణులను రంగంలోకి దించడం అంతర్జాతీయంగా హాట్ టాపిక్‌గా మారింది. దీన్ని చూస్తుంటే అగ్రరాజ్యం తన పాత ఆయుధాల గోడౌన్‌లో స్టాక్ క్లియరెన్స్ సేల్ పెట్టిందేమో అన్న అనుమానం కలగక మానదు..

ఈ వ్యవహారంపై అమెరికా తాత్కాలిక నేవీ కార్యదర్శి హంగ్ కావో ఇచ్చిన వివరణ వింటే నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి. గడువు దాటిన క్షిపణులను ఆయన ఏకంగా పాత బ్రెడ్ ముక్కతో పోల్చారు. బ్రెడ్ ఎక్స్‌పైరీ అయినంత మాత్రాన అది వెంటనే విషం అయిపోదు కదా.. క్షిపణులూ అంతే అని ఆయన సెలవిచ్చారు. అయ్యా కార్యదర్శి గారూ పాత బ్రెడ్ తింటే మహా అయితే కడుపు నొప్పి వస్తుంది.. కానీ గడువు ముగిసిన క్షిపణి దారి తప్పితే ఊళ్లకు ఊళ్లే వల్లకాడు అవుతాయన్న చిన్న లాజిక్ అగ్రరాజ్యానికి తట్టినట్టు లేదు.

అత్యాధునిక ఆయుధాలకు కేరాఫ్ అడ్రస్‌గా చెప్పుకునే అమెరికా ఇప్పుడు పాత ఇనుప సామాను లాంటి క్షిపణులను వాడటానికి అసలు కారణం ఏంటి? అన్న ప్రశ్న ఉదయిస్తోంది. ఇరాన్ ఘర్షణ సుదీర్ఘంగా సాగుతుండటంతో అమెరికా ఆయుధాల గోడౌన్లు ఖాళీ అవుతున్నాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. కొత్త క్షిపణులు తయారు చేయాలంటే బిలియన్ల కొద్దీ డాలర్లు కావాలి. అందుకే పాతవాటినే దుమ్ము దులిపి వాడేద్దాం.. పైసా ఖర్చు ఉండదు అన్న పొదుపు మంత్రాన్ని పెంటగాన్ పఠిస్తున్నట్టు కనిపిస్తోంది.

టెస్టింగ్ ల్యాబ్‌లలో పాత క్షిపణులు బాగానే పనిచేశాయని అమెరికా రక్షణ వర్గాలు సర్టిఫికేట్లు ఇస్తున్నాయి. కానీ ఏసీ గదుల్లో జరిగే పరీక్షలకు.. అసలు యుద్ధరంగంలోని పరిస్థితులకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. ఒకవేళ ఈ ఎక్స్‌పైరీ మిసైల్ ప్రయాణంలో సాంకేతిక లోపం తలెత్తి శత్రు స్థావరానికి బదులు సామాన్య ప్రజల ఇళ్లపై పడితే దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? అయ్యో డేట్ అయిపోయింది కదా కొంచెం అటు ఇటు అయింది అని అమెరికా సారీ చెబితే పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా?

ప్రపంచ శాంతి, మానవ హక్కుల గురించి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చే అమెరికా.. యుద్ధం విషయానికి వచ్చేసరికి మాత్రం కనీస భద్రతా ప్రమాణాలను గాలికి వదిలేస్తోంది. శత్రువును దెబ్బతీయాలనే కసిలో పాత ఆయుధాలను ప్రయోగించడం అగ్రరాజ్య నిస్సహాయతకు నిదర్శనమా లేక నిర్లక్ష్యానికి పరాకాష్టా? గడువు ముగిసిన మందులను పారవేసే ప్రపంచంలో.. గడువు ముగిసిన బాంబులను మాత్రం నిర్భయంగా వాడేస్తున్న అమెరికా 'యుద్ధ నీతి'కి జేజేలు కొట్టాలా? లేక సిగ్గుపడాలో మీరే తేల్చుకోండి..

Tags:    
  • usnavy 
  • tomahawkmissiles 
  • iranconflict 
  • usmilitary 

Similar News

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS