ఎప్ స్టీన్ ఫైల్స్ సంచలనం.. హాట్ టబ్ లో బిల్ క్లింటన్ పిక్స్ వైరల్!
అగ్రరాజ్యాన్ని కుదిపేసిన ఎప్ స్టీన్ ఫైల్స్ సెక్స్ కుంభకోణంకు సంబంధించిన విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే;
అగ్రరాజ్యాన్ని కుదిపేసిన ఎప్ స్టీన్ ఫైల్స్ సెక్స్ కుంభకోణంకు సంబంధించిన విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఈ కేసుకు సంబంధించిన ఫైల్స్ ను బహిర్గతం చేసే బిల్లును ఇంతకు ముందు వ్యతిరేకించిన ఆయన.. ఇటీవల మద్దతు ఇవ్వాలని హౌస్ రిపబ్లికన్లను కోరారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆ పత్రాలను విడుదల చేశారు.
అవును... అమెరికాను కుదిపేసిన సెక్స్ కుంభకోణంలోని లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్ స్టీన్ కు సంబంధించిన లక్షలాది పేజీల డాక్యుమెంట్స్ ను అమెరికా న్యాయశాఖ శుక్రవారం విడుదల చేసింది. తాజాగా బహిర్గతం చేయబడిన ఫైల్స్ లో ప్రధానంగా మాజీ డెమోక్రాట్ అధ్యక్షుడు బిల్ క్లింటన్ ను పదే పదే ప్రస్తావిస్తుండగా... ప్రస్తుతం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్థావన చాలా తక్కువగా కనిపించిందని అంటున్నారు.
ఏది ఏమైనా తాజాగా విడుదలైన డాక్యుమెంట్స్ లోని కొన్ని ఫోటోల్లో బిల్ క్లింటన్ ను స్పష్టంగా చూపించగా.. అందులో కనిపించిన అమ్మాయిల ఫేస్ లను, మరికొంత భాగాలను బ్లాక్ రెక్టెంగిల్ షేప్ లో మార్క్ చేశారు. విడుదలైన ఫోటోల్లో బిల్ క్లింటన్ యువకుడిగా కనిపిస్తున్నారు. తాజాగా విడుదలైన ఫోటోల్లో ఒకదానిలో.. హాట్ టబ్ లో పడుకుని ఉన్న యువకుడిగా కనిపించే బిల్ క్లింటన్ కనిపిస్తుండగా.. అక్కడ కొంతభాగం బ్లాక్ గా కప్పి ఉంచబడింది.
ఇక మరో ఫోటోలో ఎప్ స్టీన్ సహచరురాలు గిస్లైన్ మాక్స్వెల్ గా ప్రచారం జరుగుతున్న స్త్రీతో కలిసి బిల్ క్లింటన్ ఈత కోడుతున్నట్లు చూపించారు. మరో ఫోటోలో బిల్ క్లింటన్, పాప్ స్టార్ మైఖేల్ జాక్సన్ తో కలిసి ఉండగా.. పక్కన గాయని డయానా రాస్ నిలబడి ఉన్నారు. అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన ఈ చిత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరోవైపు ట్రంప్ ప్రస్థావన తక్కువగా ఉండటమూ చర్చనీయాంశంగా మారింది.
ఈ నేపథ్యంలో బిల్ క్లింటన్ ప్రతినిధి స్పందించారు. ఇందులో భాగంగా.. ఎప్ స్టీన్ దర్యాప్తు బిల్ క్లింటన్ గురించి కాదని నొక్కి చెప్పారు. ఈ సందర్భంగా వారు 20 ఏళ్లు పైబడినవారి ఫోటోలు ఎన్ని కావాలంటే అన్ని విడుదల చేయవచ్చని.. కానీ, ఇది బిల్ క్లింటన్ గురించి కాదని ఏంజెల్ యూరియా ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా స్పందించిన న్యాయశాఖ.. 1,200 మందికి పైగా వ్యక్తులను చివరికి ఎప్ స్టీన్ బాధితులుగా లేదా వారి కుటుంబ సభ్యులుగా గుర్తించినట్లు తెలిపింది. ఈ మేరకు కాంగ్రెస్ కు రాసిన లేఖలో పేర్కొంది.