• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  అమెరికా వ్యథలు : ఇలా...

అమెరికా వ్యథలు : ఇలా విద్యార్థి వీసా అప్రూవ్.. అలా రిజెక్ట్

| కానీ ఆ ఆనందం ఎక్కువ కాలం నిలబడలేదు. ఎటువంటి ఇమెయిల్ లేకుండా కారణం తెలియజేయకుండానే వారి వీసా స్థితి మళ్లీ “Refused” (నిరాకరించబడింది)గా మార్చబడింది.

By - Tupaki Desk
Update: 2025-07-11 17:04 GMT

అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలనే కలలు కల్లలవుతున్నాయి. అంతర్జాతీయ విద్యార్థులకు ఎఫ్-1 వీసా ప్రక్రియ చుక్కలు చూపిస్తోంది. ఈ ప్రక్రియలో “వీసా ఆమోదం” అనే స్థితిని చూడటం అత్యంత సంతోషకరమైన క్షణంగా మారింది.. అయితే ఇప్పుడు ఆ సంతోషం కూడా నమ్మలేని పరిస్థితిని సృష్టించింది.

ఇటీవల ఒక Reddit యూజర్ తన ఆశ్చర్యకరమైన అనుభవాన్ని పంచుకున్నారు. వారి వీసా కొన్ని వారాలుగా అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెసింగ్‌లో ఉండగా అకస్మాత్తుగా “Approved” అని స్థితి మారిందట. మూడు వారాల క్రితమే 221(g) నోటీసు అందిందని, భయంతో తమ సోషల్ మీడియా ఖాతాలన్నింటినీ పబ్లిక్‌గా మార్చానని వారు పేర్కొన్నారు. ఈ ఇంటర్వ్యూ, కొత్త స్క్రీనింగ్ విధానం అమలులోకి రావడానికి ముందే జరిగింది.

కానీ ఆ ఆనందం ఎక్కువ కాలం నిలబడలేదు. ఎటువంటి ఇమెయిల్ లేకుండా కారణం తెలియజేయకుండానే వారి వీసా స్థితి మళ్లీ “Refused” (నిరాకరించబడింది)గా మార్చబడింది. ఇది ఒక్క సంఘటన మాత్రమే కాదు. “Approved” నుండి “Refused”కి, లేక మళ్లీ “Administrative Processing”కి తిరిగి వెళ్ళడం వంటి స్టేటస్ మార్పులు మరికొంతమంది విద్యార్థులకు కూడా ఎదురయ్యాయి.

ఇక్కడ విచిత్రమేమంటే.. ఈ మార్పులు ఏమైనా కొత్త సమస్యల వల్ల జరగడం లేదు. అమెరికాలో వీసా వ్యవస్థ అస్థిరంగా మారడంతో ఈ పరిస్థితి ఎదురవుతోంది. "Approved" అనే స్థితి అంటే వీసా పూర్తిగా ముద్రించబడిందని అర్థం కాదు. అది కేవలం ఒక దశ పూర్తయిందని మాత్రమే. కానీ ఈ లోతైన వివరాలు విద్యార్థులకు ఎవరు వివరిస్తారన్నది ప్రశ్న.

"Refused" అయినప్పటికీ వీసా ఇంకా ప్రాసెసింగ్‌లోనే ఉందని గతంలో భావించేవారు. ఇప్పుడు "Approved" అయినా కూడా మళ్లీ ప్రాసెసింగ్‌లోకి వెళ్తుందంటే, అసలు విశ్వసనీయతే లేకుండా పోతోంది.

ఈ విధంగా విద్యార్థుల నమ్మకాన్ని పెంచి, అర్ధాంతరంగా వారి ఆశలను విచ్ఛిన్నం చేయడం కేవలం నిర్లక్ష్యమే కాదు.. ఇది అమానుషంగా మారుతోంది.

ఇటువంటి సాంకేతిక లోపాలను వెంటనే పరిష్కరించాలని, స్పష్టతతో పాటు విద్యార్థుల మనోభావాలను కూడా గౌరవించాల్సిన అవసరం అమెరికా అధికారులకు ఉందని ఈ సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి.

Tags:    
  • F1Visa 
  • USVisaIssues 
  • StudentVisaTrouble 
  • VisaStatusChange 
  • 221g 
  • AdministrativeProcessing 
  • VisaApprovedRefused 

Similar News

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

Copyright @2026

Powered by Blink CMS