“టీవీ9” ను టేకోవర్ చేస్తోన్న “సాక్షి”... ఇదిగో పూర్తి క్లారిటీ!!

దీనికి సంబంధించి ఎవరివద్దా పక్కా సమాచారం లేకపోయినా.. ఈ భారీ గాసిప్ మీడియా సర్కిల్స్ లో హల్ చల్ చేయడం మొదలెట్టింది.

Update: 2024-05-23 14:19 GMT

టీవీ9 గ్రూప్‌ ని ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చెందిన "సాక్షి" మీడియా గ్రూప్ టేకోవర్ చేయబోతుందంటూ మీడియా వర్గాల్లో గత రెండు రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీనికి సంబంధించి ఎవరివద్దా పక్కా సమాచారం లేకపోయినా.. ఈ భారీ గాసిప్ మీడియా సర్కిల్స్ లో హల్ చల్ చేయడం మొదలెట్టింది.

ఇదే సమయంలో... గతంలో సాక్షి టీవీ సీఈవోగా పనిచేసి, అనంతరం ఏపీ ప్రభుత్వ సలహాదారుగా కూడా ఉన్న నేమాని భాస్కర్.. టీవీ9 ని సందర్శించినట్లు కొన్ని ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారిన పరిస్థితి అని అంటున్నారు. దీంతో... అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లుగా ప్రచారం కాస్తా తీవ్రమైంది.

ఇలా జగన్ కి, సాక్షి మేనేజ్మెంట్ కి అత్యంత సన్నిహితుడైన వ్యక్తి టీవీ9ని సందర్శించారని.. టీవీ9ని వైఎస్ జగన్ సాక్షి గ్రూప్ టేకోవర్ చేయడానికి అవసరమైన కార్యక్రమాలు జరుగుతున్నాయంటూ ప్రచారాలు వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలో టీవీ9 స్పందించింది. ఇందులో భాగంగా తమ అధికారిక “ఎక్స్” అకౌంట్ లో ఈ ఊహాగాణాలపై వివరణ ఇచ్చింది.

అవును... టీవీ9 ని సాక్షి గ్రూప్ టేకోవర్ చేయబోతుందంటూ వస్తున్న గాసిప్స్ పై టీవీ9 స్పందించింది. ఇందులో భాగంగా టీవీ9పై వస్తున్న వదంతులు నిరాధారమైనవని, వాటిలో నిజం ఏమాత్రం లేదని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా సుధీర్ఘమైన పోస్ట్ పెట్టిన టీవీ9... ప్రపంచవ్యాప్త ముందడుగుతో తదుపరి శిఖరాలను అదిరోహించడానికి సిద్ధంగా ఉందని వెల్లడించింది!

Read more!

ఇలా తమపై వస్తోన్న ఊహాగానాలు, పుకార్లను కొట్టిపారేస్తూ టీవీ9 వివరణాత్మక వివరణ ఇవ్వడంతో ఇకపై ఆ పుకార్లకు తెరపడినట్లయ్యిందని అంటున్నారు పరిశీలకులు.

Tags:    

Similar News