ఒక టీవీ చానల్ హెడ్...జనసేన మీద నెగటివ్ గా రాస్తాడు !

జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ జనసేన గురించి తన గురించి మీడియాలో వచ్చే నెగిటివ్ కధనాల మీద తనదైన విశ్లేషణ చేశారు.

Update: 2026-05-26 07:18 GMT

జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ జనసేన గురించి తన గురించి మీడియాలో వచ్చే నెగిటివ్ కధనాల మీద తనదైన విశ్లేషణ చేశారు. తన స్వీయ అనుభవాలను కూడా ఆయన ఈ సందర్భంగా పంచుకున్నారు. రాజమండ్రిలో జరిగిన జనసేన పార్టీ కార్యకర్తల సమావేశంలో పవన్ మాట్లాడుతూ ఒక ఉదాహారణ చేప్పారు. ఒక టీవీ చానల్ హెడ్ ఉంటాడు వాళ్ల ఫంక్షన్స్ కి రెగ్యులర్ గా ప్రతి సంవత్సరం వెళ్తూంటాను, ఒక ఏడాది కనుక పొరపాటున వెళ్లలేదంటే మాత్రం నా మీద జనసేన మీద నెగటివ్ ఆర్టికల్ రాసేస్తాడు అని సంచలన కామెంట్స్ చేశారు. ఏడాదికి ఒకసారి చేసే ఆ సంస్థ ఫంక్షన్ కి నేను వెళ్తే ఓకే అంతా బాగుంటుంది, కొన్నాళ్ళ పాటు జనసేన గురించి న్యూట్రల్ వార్తలే ఆ చానల్లో వస్తాయి. ఒకవేళ వెళ్ళలేదు అంటే చాలు నెగిటివ్ వార్తలు స్టార్ట్ అవుతాయని పవన్ చెప్పారు. ఇలా ఉంటుంది పరిస్థితి అని ఆయన క్యాడర్ కి చెబుతూ ఈ హాట్ కామెంట్స్ చేశారు.

ఎవరా టీవీ చానల్ హెడ్ :

పవన్ కళ్యాణ్ చెప్పిన తరువాత అందరి ఆలోచనలు ఎవరా చానల్ హెడ్ అన్న దాని మీదకే మళ్ళుతున్నాయి. ఏపీలో అనేక టీవీ చానళ్ళు ఉన్నాయి. వాటిలో చాలా వరకూ రాజకీయ పార్టీలకు అనుబంధమై పోయి వచ్చే వార్తలే కనిపిస్తాయి. ఇక జనసేన అధినేత మీద గతంలో గట్టిగానే నెగిటివ్ వార్తలు కొన్ని చానళ్ళలో వచ్చాయి. అయితే ఇపుడు పరిస్థితి మారింది. జనసేన మీద వైసీపీకి చెందిన ఒక చానల్ లోనే తప్ప ఎక్కడా వ్యతిరేక వార్తలు రావడం లేదు, మరి పవన్ చెప్పినది ఏ టీవీ చానల్ గురించి అన్నదే అంతా సెర్చ్ చేస్తున్నారు.

మీడియా గుట్టు బయటకు :

పవన్ కళ్యాణ్ యధాలాపంగా పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ చెబుతున్నట్లుగానే అనేక విషయాలు ఉంటాయి. కానీ వాటి లోతుల్లోకి వెళ్తే ఆశ్చర్యకరమైన పరిస్థితులు కనిపిస్తాయని అంటున్నారు. మీడియా పోకడలు వాటి తీరు గురించి పవన్ చెప్పుకొచ్చారా అనదే ఇపుడు సాగుతున్న చర్చ. నిజానికి తెలుగు మీడియా రాజకీయంగా ఎపుడో చీలిపోయింది అన్న చర్చ ఉండనే ఉంది. పవన్ విషయం తీసుకుంటే ఆయన పార్టీ గురించి గతంలో విమర్శలు రాసిన చానళ్ళు కూడా ఇపుడు అయితే పెద్దగా నెగిటివ్ రాయడం లేదు. మరి గతంలో జరిగిన వాటిని దృష్టిలో ఉంచుకుని ఆయన ఆ విధంగా చెప్పారా లేక ఇప్పటికీ అలాగే జరుగుతోంది అన్న ఉద్దేశ్యంతో చెప్పారా అన్నది తెలియడం లేదు. మొత్తానికి ఒక టీవీ చానల్ యజమాని ఉంటారు అని పవన్ చెప్పిన దాని మీద అంతా తీవ్రంగానే ఆలోచన చేస్తున్నారు. పవన్ తన ప్రసంగంలో అనేక విషయాలను ప్రస్తావించారు. రాజకీయ విశ్లేషకుల నుంచి రాజకీయ పార్టీల నుంచి మీడియా తీరు గురించి కూడా ఆయన చెప్పిన అంశాలు ఇపుడు హాట్ టాపిక్ గా మారి తెగ వైరల్ అవుతున్నాయి.

Tags:    

Similar News