• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  3 గంటల్లో శ్రీవారి...

3 గంటల్లో శ్రీవారి దర్శనం.. మాజీ సీఎస్ సుబ్రహ్మణ్యం కీలక వ్యాఖ్యలు

| తిరుమల శ్రీవారి దర్శన సమయాన్ని వీలైనంత తొందరగా పూర్తి చేయాలనే టీటీడీ ప్రయత్నాలను ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం తప్పుబట్టారు.

By - Tupaki Desk
Update: 2025-08-03 07:55 GMT

తిరుమల శ్రీవారి దర్శన సమయాన్ని వీలైనంత తొందరగా పూర్తి చేయాలనే టీటీడీ ప్రయత్నాలను ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం తప్పుబట్టారు. ఆధునిక సాంకేతిక వాడుకుని క్యూలైన్ లోకి వెళ్లి గంటలోగా దర్శనం ముగించేలా టీటీడీ ప్రయత్నిస్తోంది. చైర్మన్ బీఆర్ నాయుడు బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఈ దిశగా టీటీడీ అడుగులు వేస్తోంది. ఏఐ ద్వారా ఫేసియల్ రికగ్నేషన్ ద్వారా దర్శనాల సమయాన్ని తగ్గించాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం శ్రీవారి దర్శనానికి ఆరేడు గంటల సమయం పడుతోంది. దీన్ని ముందుగా మూడు గంటలకు కుదించి ఆ తర్వాత గంట కాలానికి తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారు. అయితే టీటీడీ ప్రయత్నాలపై మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలు నీళ్లు జల్లినట్లైందని అంటున్నారు.

ఆదివారం ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న మాజీ సిఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం మూడు గంటల్లో శ్రీవారి దర్శనం చేయించడం అసాధ్యమని తేల్చిచెప్పారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా శ్రీవారి దర్శనాన్ని ఒక గంటలో చేయిస్తామన్న విధానాన్ని విరమించుకోవాలని మాజీ సీఎస్ సూచించారు.

‘‘నేను వచ్చే దారిలో భక్తుల సంభాషణ విన్నాను. తిరుమల శ్రీవారి దర్శనం గంట, మూడు గంటల్లో చేయిస్తామనే ఆలోచన విధానం గురించి వారు చర్చించారు. శ్రీవారి భక్తులకు 3 గంటల్లో దర్శనం చేయిస్తామనడం అసంభవం. అలా ప్రయత్నం చేయడం క్షేమకరం కాదు. ఏఏఐని మానవుడు తన శక్తితో ఎంత గ్రహించినా ఆలయంలో పరిమితులు ఉన్నాయి. భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించడంపై దృష్టి పెట్టాలి’’ అని మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం సూచించారు.

Tags:    
  • TirumalaDarshan 
  • TTD 
  • LVSubramanyam 
  • AIDarshan 
  • FacialRecognition 
  • TempleTech 
  • DevoteeExperience 
  • TTDUpdates 
  • Tirumala Darshan 
  • LV Subramanyam 
  • AI Darshan 
  • Tirupati 

Similar News

పొగ‌డ్త‌లే కాదు.. విమ‌ర్శ‌లనూ త‌ట్టుకోవాలి నాయ‌కా: హైకోర్టు సంచ‌ల‌న తీర్పు

2026-11-03 22:30 GMT

పోలవరం ...గోదావరి మీద అద్భుత నిర్మాణం !

2026-11-03 19:30 GMT

ఇక రాత్రిపూట కూడా సూర్యుడి వెలుగులు.. ప్రకృతి నియమాలకు విరుద్ధంగా వెళుతున్నామా?

2026-11-03 18:30 GMT

అతి పెద్ద కార్పోరేషన్ కి పిన్న వయసులో మేయర్ గా!

2026-11-03 18:24 GMT

పవన్ పిఠాపురంలో రెబెల్స్ కొత్త రికార్డు !

2026-11-03 18:23 GMT

తమిళనాడుకు ప్రత్యేక జెండా ...ఏం జరుగుతోంది ?

2026-11-03 18:16 GMT

బాబుతో విజయ్ డీకే రేవంత్ : దక్షిణాదిన కొత్త ఐక్యత !

2026-11-03 18:15 GMT

ఒక్క ఓటుతో విజేత‌లు.. ఎన్నెన్నో విచిత్రాలు!

2026-11-03 18:13 GMT

బంగ్లా బార్డర్ లో భారత జవాన్లపై దాడి చేస్తే.. ట్రీట్ మెంట్ వేరేలా ఉంటుంది.. అదే జరిగింది..

2026-11-03 18:09 GMT

ఢిల్లీ హోటల్ గొడవపై స్పందించిన మంత్రి దామోదర.. అసలేం జరిగింది?

2026-11-03 18:06 GMT

వైసీపీని 'ఓటు' బ్యాంకు కాపాడిందా?!

2026-11-03 17:30 GMT

కోయ ప్రవీణ్...వైసీపీకి ఆయన కఠినం కానీ !

2026-11-03 17:00 GMT

Copyright @2026

Powered by Blink CMS