• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  తెలంగాణ ఎన్నికల్లో నిజం...

తెలంగాణ ఎన్నికల్లో నిజం యువ రక్తం... శుభ సూచికమే!

| ఇదే సమయంలో సీనియర్ జూనియర్, పాత కొత్త కలయిక మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

By - Tupaki Desk
Update: 2023-11-11 04:05 GMT

సాధారణంగా రాజకీయాల్లోకి యువత రావాలని అంతా పిలుపునిస్తుంటారు. కేవలం అన్ని రకాలుగానూ తలపండిన వారే కాకుండా... యంగ్ బ్లడ్ కూడా రాజకీయాల్లోకి రావాలని, ఫలితంగా కాలంతోపాటు దూసుకూపోవడమే కాకుండా.. అప్ డేట్ పాలనకు అవకాశం ఉందని అంటుంటారు. ఇదే సమయంలో సీనియర్ జూనియర్, పాత కొత్త కలయిక మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పుడు అదిజరిగే పరిస్థితి ప్రారంభమైనట్లు తెలుస్తుంది!

అవును... సాధారణంగా రాజకీయాల్లో యువనేత, యూత్ లీడర్, యూత్ పార్టీ చీఫ్ వంటివి ఇప్పటికే ఉన్నాయి. అయితే వాటిలో యువనేత అంటే 40 - 45 ఉన్నవాళ్లు ఉంటారని.. 50 - 60 వచ్చాక సీనియర్ నేతలుగా గుర్తించబడుతుంటారని చెబుతుంటారు! అలా కాకుండా యువనాయకులు అంటే బిలో 30-35 ఉండాలని అంతా కోరుకుంటుంటారు. అయితే ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అలాంటి నేతలు నలుగురైదుగురు బరిలోకి దిగుతున్నారు.

ఈసారి అత్యంత ప్రతిష్టాత్మకంగా, మరింత కీలకంగా జరగబోతోన్న.. రసవత్తరంగా మారబోతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు యువనేతలకు అవకాశాలు కల్పించాయి. యువనేతలు అంటే... నిజంగానే యువరక్తం ఉన్నవారు అన్నట్లుగా వారంతా పాతిక నుంచి ముప్పై ఏళ్ల లోపువారే కావడం గమనార్హం. దీంతో... ఇది శుభసూచికం అంటున్నారు పరిశీలకులు.

ఇదే సమయంలో వారంతా విద్యావంతులు, ఉన్నత చదువులు చదివిన వారు కావడం మరొక గుడ్ న్యూస్ అని చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రధానంగా ముప్పై ఏళ్లలోపు ఉన్న ముగ్గురు అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తుండగా... ఒకరు బీఎస్పీ నుంచి బరిలోకి దిగుతున్నారు. వీరితోపాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులు కూడా ఉన్నారు.

వీరిలో మెదక్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మైనంపల్లి హన్మంతరావు కుమారుడు మైనంపల్లి రోహిత్ పోటీ చేస్తున్నారు. ఈయన వయసు 26ఏళ్లు కాగా... ఈయన వైద్య విద్యనభ్యసించారు. అంటే ఈసారి మెదక్ కాంగ్రెస్ అభ్యర్థిగా యంగ్ డాక్టర్ బరిలోకి దిగుతున్నారన్నమాట. ఇదే క్రమంలో పాలకుర్తి కాంగ్రెస్ అభ్యర్థిగా యశస్విని పోటీకి దిగుతున్నారు.

ఈమె వయసు కూడా 26ఏళ్లు కాగా... ఈమె బీటెక్ పూర్తి చేశారు. నారాయణపేట్ కాంగ్రెస్ అభ్యర్థి పర్ణికా రెడ్డి రేడియోలజీలో పీజీ చేస్తున్నారు. ఈమె వయసు 30 ఏళ్లు! ఇదే క్రమంలో... బహుజన సమాజ్ వాదీ పార్టీ (బీఎస్పీ) తరుపున పెద్దపల్లిలో బరిలోకి దిగుతున్న ఉష వయసు 27 కాగా... ఆమె బీటెక్ పూర్తిచేశారు. వీరితో పాటు మరికొంతమంది యువతరం స్వతంత్ర అభ్యర్థులుగా ఈ దఫా బరిలోకి దిగుతున్నారు.

Tags:    
  • Telanganaelections 
  • Brspary 
  • Bjpparty 
  • Congressparty 
  • Bspparty 
  • Mynampallyrohit 
  • Hanmantharao 
  • Yashaswini 

Similar News

పోలవరం ...గోదావరి మీద అద్భుత నిర్మాణం !

2026-11-03 19:30 GMT

ఇక రాత్రిపూట కూడా సూర్యుడి వెలుగులు.. ప్రకృతి నియమాలకు విరుద్ధంగా వెళుతున్నామా?

2026-11-03 18:30 GMT

అతి పెద్ద కార్పోరేషన్ కి పిన్న వయసులో మేయర్ గా!

2026-11-03 18:24 GMT

పవన్ పిఠాపురంలో రెబెల్స్ కొత్త రికార్డు !

2026-11-03 18:23 GMT

తమిళనాడుకు ప్రత్యేక జెండా ...ఏం జరుగుతోంది ?

2026-11-03 18:16 GMT

బాబుతో విజయ్ డీకే రేవంత్ : దక్షిణాదిన కొత్త ఐక్యత !

2026-11-03 18:15 GMT

ఒక్క ఓటుతో విజేత‌లు.. ఎన్నెన్నో విచిత్రాలు!

2026-11-03 18:13 GMT

బంగ్లా బార్డర్ లో భారత జవాన్లపై దాడి చేస్తే.. ట్రీట్ మెంట్ వేరేలా ఉంటుంది.. అదే జరిగింది..

2026-11-03 18:09 GMT

ఢిల్లీ హోటల్ గొడవపై స్పందించిన మంత్రి దామోదర.. అసలేం జరిగింది?

2026-11-03 18:06 GMT

వైసీపీని 'ఓటు' బ్యాంకు కాపాడిందా?!

2026-11-03 17:30 GMT

కోయ ప్రవీణ్...వైసీపీకి ఆయన కఠినం కానీ !

2026-11-03 17:00 GMT

పెళ్లి కోసం 7 వేల మంది క్యూ.. ఇంత కరువులో ఉన్నారేంట్రా సామీ

2026-11-03 16:30 GMT

Copyright @2026

Powered by Blink CMS