ట్రంప్ సలహాదారుగా మాజీ ఉగ్రవాదులు.. జర్నలిస్ట్ సంచలన రిపోర్ట్!

ఉగ్రవాద కేసుల్లో మాజీ దోషి అయిన ఇస్మాయిల్ రోయర్.. కాలిఫోర్నియాలోని జైతునా కాలేజ్ సహ వ్యవస్థాపకుడు షేక్ హంజా యూసఫ్ లను వైట్ హౌస్ అడ్వైజరీ బోర్డు ఆఫ్ లే లీడర్స్ గా నియమించారని.. ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ లారా లూమర్ నివేదించారు.;

Update: 2025-05-18 21:30 GMT

అత్యంత ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... అమెరికాకు చెందిన జర్నలిస్ట్ దర్యాప్తు ప్రకారం... ఉగ్రవాద గ్రూపులైన లష్కరే తోయిబా, ఆల్ ఖైదాతో సంబంధాలు సహా ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాలకు సంబంధించిన డాక్యుమెంట్ హిస్టరీ కలిగిన ఒక వ్యక్తి.. ఉగ్రవాద సంబంధిత ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో వ్యక్తిని ట్రంప్ తన అడ్వైజరీ బోర్డులో నియమించారు.

అవును... ఉగ్రవాద కేసుల్లో మాజీ దోషి అయిన ఇస్మాయిల్ రోయర్.. కాలిఫోర్నియాలోని జైతునా కాలేజ్ సహ వ్యవస్థాపకుడు షేక్ హంజా యూసఫ్ లను వైట్ హౌస్ అడ్వైజరీ బోర్డు ఆఫ్ లే లీడర్స్ గా నియమించారని.. ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ లారా లూమర్ నివేదించారు. ఈ సందర్భంగా వారి ఇద్దరి గురించిన కీలక విషయాలు ఆమె వెల్లడించారు. ఈ విషయం వైరల్ గా మారింది!

ఈ సందర్భంగా... ఇస్మాయిల్ రోయర్ విషయానికొస్తే గతంలో కాశ్మీర్ లోని భారత స్థావరాలపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో పాల్గొనడంతో పాటు 2008 ముంబై దాడులతోనూ సంబంధాలు కలిగి ఉన్నాడని అంటున్నారు. ఇక షేక్ హంజా యూసఫ్ విషయానికొస్తే... హమాస్ తో పాటు పలు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నాడని చెబుతున్నారు.

"రోయర్ అనే ముస్లిం బ్రదర్ హుడ్.. హమాస్ జీహాదీ, పాక్ లోని ఉగ్రవాద శిబిరంలో శిక్షణ పొందేందుకు వెళ్లినట్లు యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ గుర్తించి.. అమెరికాపై దాడి చేయడానికి ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చిన వర్జీనియా జీహాదీ నెట్ వర్క్ లో భాగమైనట్లు ఎఫ్.బీ.ఐ దర్యాప్తు చేసిన అతడు ఇప్పుడు వైట్ హౌస్ అడ్వైజరీ బోర్డు ఆఫ్ లే లీడర్స్ లో ఉన్నారు" అని ట్వీట్ చేశారు సారా.

ఇక తన ప్రసంగాలలో యూసఫ్.. అమెరికాను జాత్యహంకార దేశంగా అభివర్ణించాడని, అల్ అమీన్ ను తప్పుగా నిందించాడని చెబుతున్నారు. 1990ల న్యూయార్క్ ల్యాండ్ మార్క్ బాంబు దాడులకు సంబంధించి దోషిగా తేలిన షేక్ ఒమర్ అబ్దుల్ రెహ్మాన్ విచారణపైన యూసఫ్ బహిరంగంగా ప్రశ్నించాడని చెబుతున్నారు.

ఈ సందర్భంగా 9/11 దాడుల తర్వాత యూసఫ్ గతంలో చేసిన జీహాద్ అనుకూల వ్యాఖ్యల గురించి ఎఫ్.బీ.ఐ. ప్రశ్నించినట్లు తెలుస్తోందని జర్నలిస్ట్ సారా పేర్కొన్నారు. దీంతో.. ఈ వ్యవహారంపై వైట్ హౌస్ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తిగా మారింది.

కాగా... వైట్ హౌస్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ లే లీడర్స్ అనేది రిలీజియస్ లిబర్టీ కమిషన్ కింద ఉన్న ఒక సంస్థ. ఇది ట్రంప్ పరిపాలనకు మత స్వేచ్ఛ, విశ్వాస ఆధారిత విధానాలకు సంబంధించిన విషయాలపై సలహాలు, సూచనలు ఇచ్చే మూడు సలహా సమూలాలలో ఒకటి!

Tags:    

Similar News