• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ట్రైన్ లో చోరీ.. దొంగకు...

ట్రైన్ లో చోరీ.. దొంగకు దిమ్మతిరిగే షాకిచ్చిన ప్రయాణికులు

| బిహార్ లోని భాగల్ పుర్ జిల్లాకు చెందిన ఒక దొంగ.. కదులుతున్న ట్రైన్ లోని పర్సును దొంగలించే ప్రయత్నం చేశారు.

By - Tupaki Desk
Update: 2024-01-18 10:30 GMT

విన్నంతనే వణుకు పుట్టే శిక్షను వేశారు రైల్వే ప్రయాణికులు ఒక దొంగకు. ట్రైన్ జర్నీ వేళ.. చేతి వాటం చూపే దొంగల కారణంగా ప్రయాణికులు పడే అవస్థలు అన్ని ఇన్ని కావు. ఇదిలా ఉంటే.. తాజా ఉదంతంలో ట్రైన్ లో పర్సు దొంగతనం చేసే ప్రయత్నం చేసిన ఒక దొంగకు దిమ్మ తిరిగేలా షాకిచ్చారు ఆ ట్రైన్ లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు. అనూహ్యంగా మారిన ఈ ఉదంతానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. అసలేం జరిగిందంటే.

బిహార్ లోని భాగల్ పుర్ జిల్లాకు చెందిన ఒక దొంగ.. కదులుతున్న ట్రైన్ లోని పర్సును దొంగలించే ప్రయత్నం చేశారు. అయితే.. అప్రమత్తంగా ఉన్న ఆ రైల్లోని ప్రయాణికులు ఆ దొంగను పట్టుకున్నారు. అక్కడితో ఆగని వారు.. చోరీ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవటమే కాదు.. కదులుతున్న ట్రైన్ లో సదరు దొంగ చేతుల్ని కిటీకీ వైపు పట్టేసుకున్నారు.

దీంతో.. కొన్ని మీటర్ల పాటు కదులుతున్న రైలు కిటికీకి వేలాడదీశారు. దీంతో.. లబోదిబోమన్న దొంగ.. తన చేతుల్ని విడిచి పెట్టాల్సిందిగా వేడుకున్నాడు. అయినప్పటికీ రైల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు మాత్రం ససేమిరా అన్నారు. చోరీకి పాల్పడే దొంగకు దిమ్మ తిరిగే షాకిచ్చిన ప్రయాణికుల కారణంగా.. సదరు దొంగకు పగలే చుక్కలు కనిపించాయి. చివరకు ట్రాక్ మారే వేళ.. అక్కడున్న కొందరు.. ఆ దొంగను దింపటంతో బతికి బయటపడ్డాడు. దీనికి సంబంధించి తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Tags:    
  • Bihar 
  • Bhagalpur 
  • Train 
  • Theif 
  • Purse 
  • Steal 
  • Movingtrain 
  • Travel 
  • Passenger 

Similar News

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

బోస్టన్‌లో తెలుగు విద్యార్థిని అదృశ్యం.. 36 గంటలుగా జాడలేదు.. అసలేమైంది?

2026-11-06 06:33 GMT

వైఫై, ఎమోజీ, క్యూఆర్ కూడా ఇలా దైనందిత జీవితంలో ఉపయోగించే ఈ అద్భుత ఆవిష్కరణల వెనుక ఉన్న దేశాలేవో తెలుసా?

2026-11-06 06:30 GMT

సోషల్ మీడియా స్వేచ్ఛకు కొత్త సవాల్..

2026-11-06 05:47 GMT

Copyright @2026

Powered by Blink CMS