• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  నల్లత్రాచును నోటితో...

నల్లత్రాచును నోటితో కొరికేసి.. పక్కలో వేసుకుని.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?

| తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం చియ్యవరం గ్రామానికి చెందిన వెంకటేశ్ అనే వ్యక్తి చేసిన పని ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.

By - Tupaki Desk
Update: 2025-09-19 09:30 GMT

పామును చూస్తే ఎవరైనా జాగ్రత్త పడతారు.. ఎక్కడ కాటేస్తుందోనని భయపడి పరుగులు తీస్తారు.. ఇక అత్యంత ప్రమాదకరమైన నల్లత్రాచు వంటి డేంజర్ స్నేక్ ఎదురైతే.. అంతే సంగతులు.. కానీ, తిరుపతి జిల్లాలో ఓ వ్యక్తి తనను కాటేసిందని నల్లత్రాచు పాముపైనే తిరబడ్డాడు. కాటేసిన క్షణాల వ్యవధిలోనే ఆ పామును పట్టుకుని నోటితో దాని పీక కొరికేశాడు. ఆ తర్వాత ఆ పామును పట్టుకుని ఇంటికి వెళ్లాడు. అంతేనా పక్కలో వేసుకుని పడుకుని తీరిగ్గా తెల్లారి లేద్దామనుకున్నాడు. కానీ, తెల్లారేసరికి ఆస్పత్రి పాలయ్యాడు.

తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం చియ్యవరం గ్రామానికి చెందిన వెంకటేశ్ అనే వ్యక్తి చేసిన పని ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. జాతర జోరులో పూటుగా మద్యం సేవించిన వెంకటేశ్ గత బుధవారం రాత్రి 11 గంటల సమయంలో ఇంటి దారి పట్టాడు. దారి మధ్యలో అతడిని ఓ నల్లత్రాచు పాము కాటేసింది. అయితే మద్యం మత్తులో ఉన్న వెంకటేశ్.. నన్నే కాటేస్తావా? అన్న కోపంతో పాము ఎంతవేగంగా కాటేసిందో.. అంతేవేగంగా దాని తోక పట్టుకుని నోటితో పాము తలను కొరికేశాడు. ఆ తర్వాత తలలేని పామును తీసుకువచ్చి ఇంటి ముందు మంచంపై పడుకున్నాడు.

వేకువజామున కుటుంబ సభ్యులు వెంకటేశ్ పక్కలో నల్లత్రాచును చూసి బెదిరిపోయారు. అతడిని నిద్రలేపాలని చూడగా, అప్పటికే పాము కాటేయడం వల్ల అతడు అపస్మారకస్థితికి చేరుకున్నాడని గమనించి వెంటనే ఆస్పత్రికి తరలించారు. ముందుగా శ్రీకాళహస్తి ఆస్పత్రికి అక్కడి నుంచి తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి విషయంగా ఉండటంతో వెంకటేశ్ ను రక్షించేందుకు డాక్టర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

ఈ భూమిపై అత్యంత ప్రమాదకరమైన విష సర్పాలలో నల్లత్రాచు ఒకటి. అది కాటేస్తే 15 నుంచి 20 నిమిషాల్లోనే ఎవరైనా మరణించే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. నల్లత్రాచు విషం చాలా శక్తివంతమైనది, మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుందని అంటున్నారు. నల్లత్రాచు కాటేస్తే 75 శాతం వరకు రక్షించడం కష్టం. వెంటనే చికిత్స చేస్తే ప్రాణాలను కాపాడవచ్చు అని చెబుతున్నారు. కానీ, వెంకటేశ్ ని పాము కాటేసిన తర్వాత దాదాపు నాలుగైదు గంటల వరకు చికిత్స అందలేదు. అంతేకాకుండా పామును నోటితో కొరికి చంపిన అతడు తీరిగ్గా ఇంటికి వెళ్లి దాన్ని పక్కలో వేసుకుని పడుకున్నాడు. రాత్రి 11 గంటల సమయంలో ఈ ఘటన జరిగితే ఉదయం ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఆస్పత్రికి తీసుకువెళ్లడంలో తీవ్ర జాప్యం జరిగినా అప్పటివరకు ప్రాణాలతో ఉండటంపై డాక్టర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    
  • BlackCobra 
  • SnakeBite 
  • TirupatiIncident 
  • Venkatesh 
  • CobraAttack 
  • SnakeAttack 
  • SnakeBiteSurvival 

Similar News

కూటమి డెడ్లీ కాంబో...అందుకే వైసీపీ ఫల్టీ !

2026-11-04 00:30 GMT

రాజారెడ్డి కట్టిన కోట...జగన్ చూస్తూండగానే !

2026-11-03 23:30 GMT

పొగ‌డ్త‌లే కాదు.. విమ‌ర్శ‌లనూ త‌ట్టుకోవాలి నాయ‌కా: హైకోర్టు సంచ‌ల‌న తీర్పు

2026-11-03 22:30 GMT

పోలవరం ...గోదావరి మీద అద్భుత నిర్మాణం !

2026-11-03 19:30 GMT

ఇక రాత్రిపూట కూడా సూర్యుడి వెలుగులు.. ప్రకృతి నియమాలకు విరుద్ధంగా వెళుతున్నామా?

2026-11-03 18:30 GMT

అతి పెద్ద కార్పోరేషన్ కి పిన్న వయసులో మేయర్ గా!

2026-11-03 18:24 GMT

పవన్ పిఠాపురంలో రెబెల్స్ కొత్త రికార్డు !

2026-11-03 18:23 GMT

తమిళనాడుకు ప్రత్యేక జెండా ...ఏం జరుగుతోంది ?

2026-11-03 18:16 GMT

బాబుతో విజయ్ డీకే రేవంత్ : దక్షిణాదిన కొత్త ఐక్యత !

2026-11-03 18:15 GMT

ఒక్క ఓటుతో విజేత‌లు.. ఎన్నెన్నో విచిత్రాలు!

2026-11-03 18:13 GMT

బంగ్లా బార్డర్ లో భారత జవాన్లపై దాడి చేస్తే.. ట్రీట్ మెంట్ వేరేలా ఉంటుంది.. అదే జరిగింది..

2026-11-03 18:09 GMT

ఢిల్లీ హోటల్ గొడవపై స్పందించిన మంత్రి దామోదర.. అసలేం జరిగింది?

2026-11-03 18:06 GMT

Copyright @2026

Powered by Blink CMS