• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ప్రతి తండ్రి తప్పక...

ప్రతి తండ్రి తప్పక చదవాల్సిన సర్వే వివరాలివి!

| సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ స్కీమ్స్ అండ్ పాలసీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆధ్యయనానికి.. ఉస్మానియా వర్సిటీకి చెందిన అనుబంధ కళాశాలల్లో చదివే విద్యార్థులపై ఈ సర్వే ను చేపట్టారు.

By - Garuda Media
Update: 2026-01-27 06:30 GMT

ఆసక్తికర సర్వే వివరాలు వెల్లడయ్యాయి. కాకుంటే.. ఈ సర్వే తెలంగాణలో మాత్రమే నిర్వహించారు. ఇంట్లో పిల్లలు.. వారి చదువులు.. వారి కెరీర కోసం అదే పనిగా ఆందోళన చెందే తల్లిదండ్రుల తీరు కామన్ గా ఉంటుంది కాబట్టి.. ఈ సర్వేలో గుర్తించిన అంశాలన్ని కాస్త అటు ఇటుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వారందరికి వర్తిస్తాయని చెప్పక తప్పదు. డిగ్రీ చదువుతున్న విద్యార్థుల్లోని మూడో వంతు మందిలో ఏదో ఒక సమస్య వెంటాడుతుందన్న కీలక అంశాన్ని తాజా సర్వే స్పష్టం చేసింది.

నూటికి 59 శాతం విద్యార్థుల్లో వారికున్న మానసిక సమస్యల పరిష్కారానికి కౌన్సెలింగ్ కావాల్సిన అవసరం ఉందని కోరుకుంటున్న కీలక అంశాన్ని ఈ సర్వే వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్యా సంస్థల్లో చదివే గ్రాడ్యుయేషన్ విద్యార్థుల్లో మూడో వంతు మంది విద్యార్థులు ఏ మాత్రం సంతోషంగా లేరు కుటుంబ ప్రోత్సాహం లేకపోవటం.. ఆర్థిక.. కమ్యూనికేషన్ సమస్యలు.. ఫ్యూచర్ మీద ఆందోళనలు.. లాంటి సమస్యలు వారిని మానసికంగా ఒత్తిడికి గురి చేస్తున్నాయి.

సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ స్కీమ్స్ అండ్ పాలసీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆధ్యయనానికి.. ఉస్మానియా వర్సిటీకి చెందిన అనుబంధ కళాశాలల్లో చదివే విద్యార్థులపై ఈ సర్వే ను చేపట్టారు. ఈ సందర్భంగా గుర్తించిన అంశాలు ఆసక్తికరంగానే కాదు.. తల్లిదండ్రులను మేలుకొలిపేలా ఉన్నాయని చెప్పాలి. సర్వేలో దాదాపు 2800 మంది విద్యార్థులు పాల్గొంటే.. వీరిలో అమ్మాయిలు 56 శాతం.. అబ్బాయిలు 43 శాతం. ఇందులో 62 శాతం నగరాలు.. పట్టణాలకు చెందిన వారు కాగా.. 37 శాతం గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారున్నారు.

చదువుల్లో ప్రతిభ చూపుతామా? లేదా? అన్న ఆందోళన.. పరీక్షలు.. బ్యాక్ లాగ్ లపై భయం.. ఫ్యూచర్ లో మంచి ఉద్యోగాలు వస్తాయో? లేదో? అన్న బెంగ.. లక్ష్యాన్ని చేరుకోవటంపై సందిగ్థత.. ఆత్మస్థైర్యం తక్కువగా ఉండటం.. తమను తాము తక్కువగా అంచనా వేసుకోవటం లాంటి సమస్యల్ని విద్యార్థులు ఎదుర్కొంటున్నారు. వీటికి తోడు కుటుంబ సంఘర్షణలు.. ఆర్థిక అభద్రత.. తల్లిదండ్రుల అనారోగ్య సమస్యలు.. పేదరికం కారణంగా ఒత్తిడి లాంటివి విద్యార్థుల్ని మరింత ఒత్తిడికి గురి చేస్తున్నాయి.

వీటికి తోడు విద్యా పరమైన అంశాల్లో కుటుంబ మద్దతు లేని విద్యార్థులు 23 శాతం మంది ఉంటే.. చదువుకు అవసరమైన ఆర్థిక సహకారం లేని వారు 36 శాతం మంది ఉన్నారు. వివిధ పరిస్థితులకు అనుగుణంగా బాగా మాట్లాడే సామర్థ్యం లేనోళ్లు 41 శాతం మంది ఉన్నట్లు గుర్తించారు. అన్నింటికి మించి సర్వేలో పాల్గొన్న వారిలో 59 వాతం మంతి కౌన్సెలింగ్ కోరుకోవటం కీలక అంశంగా చెప్పాలి. ఇంగ్లిషులో మాట్లాడలేక ఇబ్బంది పడుతున్నోళ్లు 31 శాతం మందిగా గుర్తించారు. మొత్తంగా విద్యార్థుల్లో అత్యధికులు మానసిక సమస్యలతో సతమతమవుతున్నారన్న విషయాన్ని తల్లిదండ్రులు ఎంత త్వరగా గుర్తిస్తే.. అంత మంచిది. అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకొని.. వారిని సమస్యల సుడిగుండం నుంచి వెలికి తీయాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉందన్నది మర్చిపోకూడదు.

Tags:    
  • studentmentalhealth 
  • telanganastudents 
  • academicanxiety 
  • studentstress 

Similar News

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

Copyright @2026

Powered by Blink CMS