విద్యార్థి తండ్రితో అక్రమ సంబంధం... టీచర్ అరెస్ట్!
అవును... బెంగళూరులో ఒక విద్యార్థిని పేరెంట్ ను బ్లాక్ మెయిల్ చేసి డబ్బు వసూలు చేసిన ఆరోపణలపై ఓ టీచర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.;
ఓ విద్యార్థి తండ్రితో ఆ స్కూలు టీచర్ (25) అక్రమ సంబంధం నడిపిన ఘటన తెరపైకి వచ్చింది. అంతవరకూ ఒకెత్తు అయితే... ఈ సమయంలో వారిద్ధరి మధ్య జరిగిన ఫోన్ కాల్స్, వాట్సప్ చాటింగ్, పర్సనల్ ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేయాలని ఫిక్సై.. మరొ ఇద్దరి సహకారంతో ఆమె ఆ పనికి పూనుకున్నారు. ప్రస్తుతం వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అవును... బెంగళూరులో ఒక విద్యార్థిని పేరెంట్ ను బ్లాక్ మెయిల్ చేసి డబ్బు వసూలు చేసిన ఆరోపణలపై ఓ టీచర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో ఫోటోలు, వీడియోలతో రూ.20 లక్షలు డిమాండ్ చేశారనే ఆరోపణలపై పాతికేళ్ల టీచర్ తో పాటు మరో ఇద్దరిని బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. పశ్చిమ బెంగళూరు పరిసరాల్లో ఓ వ్యాపారి తన భార్య, ముగ్గురు కుమర్తెలతో నివసిస్తున్నారు. ఈ క్రమంలో 2023లో తన చిన్న బిడ్డను స్కూల్ లో చేర్పించాలని నిర్ణయించారు. ఈ అడ్మిషన్ ప్రక్రియ సమయంలో అతనికి ఓ టీచర్ పరిచయం అయ్యారు. ఈ క్రమంలో ఫోన్ నెంబర్లు మార్చుకుని టచ్ లోకి వెళ్లారు!
ఈ క్రమంలో ప్రత్యేక సిమ్ కార్డులతో ఫోన్ లో మెసేజ్ ల దగ్గర నుంచి ఫోటోలు షేర్ చేసుకోవడంతో పాటు వీడియో కాల్స్ మాట్లాడుకోవడం, పర్సనల్ మీటింగ్స్ వరకూ వెళ్లింది వ్యవహారం! ఈ క్రమంలో సదరు టీచర్.. ఆ విద్యార్థి తండ్రి నుంచి రూ.4 లక్షలు బలవంతంగా వసూలు చేశారు. ఆ తర్వాత జనవరిలో రూ.15 లక్షలు డిమాండ్ చేశారు.
ఈ సమయంలో సదరు టీచర్ కు గణేష్, సాగర్ అనే ఇద్దరు వ్యక్తులు సహకరించారు. ఈ క్రమంలో... ఆ విద్యార్థి తండ్రి వ్యాపారంలో ఒడిదుడుకులు ఎదురవ్వడంతో తన కుటుంబాన్ని గుజరాత్ కు మార్చాలని నిర్ణయించుకున్నారు. దీంతో.. పిల్లల టీసీ ల కోసం స్కూల్ కి వెళ్లగా.. టీచర్ తో పాటూ గణేష్, సాగర్ లు అతనికి ప్రైవేటు ఫోటోలు చూపించి బెదిరింపులకు దిగారు.
తాము అడిగిన మొత్తం ఇవ్వకపోతే ఈ ఫోటోలు మీ కుటుంబ సభ్యులకు చూపిస్తామని అన్నారు. ఈ సమయంలోనే.. వారు డిమాండ్ చేసినంత సొమ్ము ఇవ్వలేనని.. రూ.15 లక్షలు మాత్రం ఇవ్వగలని చెప్పి ఒప్పించారు. ఈ క్రమంలోనే.. తొలుత రూ.1.9 లక్షలు బదిలీ చేశారు. ఈ క్రమంలో మార్చి 17న టీచర్ మరోసారి కాల్ చేసి, చెల్లింపుల విషయాన్ని గుర్తు చేసింది.
ఈ సందర్భంగా.. మాజీ పోలీసు అధికారికి రూ.5 లక్షలు, గణేష్, సాగర్ లు ఒక్కొక్కరికీ రూ.1 లక్ష, మిగిలిన రూ.8 లక్షలు తనకు ఇవ్వాలని ఆమె తెల్లిపింది. దీంతో... ఈ టార్చర్ భరించలేకపోయారో ఏమో కానీ.. విద్యార్థి తండ్రి పోలీసులను ఆశ్రయించారు. దీంతో... రంగంలోకి దిగిన పోలీసులు ఆ టీచర్ తో పాటు గణేష్, సాగర్ లను అరెస్ట్ చేసి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ కు పంపించారు!