• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఆ రాయి టీడీపీని...

ఆ రాయి టీడీపీని భయపెడుతుందా ?

| విజయవాడ ఎన్నికల ప్రచారానికి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద జరిగిన రాయి దాడి తెలుగుదేశం పార్టీ వర్గాలలో ఇప్పుడు కలకలం రేపుతున్నది

By - Tupaki Desk
Update: 2024-04-20 04:14 GMT

విజయవాడ ఎన్నికల ప్రచారానికి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద జరిగిన రాయి దాడి తెలుగుదేశం పార్టీ వర్గాలలో ఇప్పుడు కలకలం రేపుతున్నది. జగన్ మీద జరిగిన రాయి దాడిని మొదట అందరూ ట్రాష్ అని, తన మీద తను చేసుకున్న దాడి అని కొట్టిపారేశారు. చివరకు నిందితుడు సతీష్ పోలీసుల చేతజిక్కడం, ఈ ఘటన వెనక టీడీపీ బీసీ సెల్ హస్తం ఉందని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొనడం టీడీపీ శ్రేణులలో వణుకు పుట్టిస్తున్నది. ఇది మరో కోడికత్తి డ్రామా అని తెలుగుదేశం నేతలు ఎద్దేవా చేశారు. కానీ అదే కోడికత్తి గత ఎన్నికలలో ఎంత పనిచేసిందో అందరికీ తెలుసే. అందుకే ఇప్పుడు ఈ రాయి దాడి ఘటన ఎక్కడికి దారి తీస్తుందో అన్న ఉత్కంఠ నెలకొన్నది.

ఈ కేసులో టీడీపీ నేత బోండా ఉమ ప్రమేయం ఉన్నదన్న ఆరోపణలు వచ్చాయి. అయితే బోండా ఉమాకు భధ్రత కల్పించేందుకు విజయవాడ టీడీపీ కార్యాలయానికి పోలీసులు వెళ్లారు. వారు తనను అరెస్టు చేసేందుకే వచ్చారని భావించిన ఉమా అక్కడి నుండి వెళ్లిపోవడం టీడీపీ నేతలకు ఉన్న భయాన్ని స్పష్టం చేస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తున్నది అపధర్మ పాలన. వ్యవస్థలు అన్నీ ఈసీ కనుసన్నలలోనే పనిచేస్తాయి. అందుకే జగన్ పై దాడి కేసులు పోలీసులు తీసుకుంటున్న చర్యలు టీడీపీని ఇరకాటంలోకి నెడుతున్నాయి.

జగన్ పర్యటన నేపథ్యంలో డబ్బులకు ఆశపడి నిందితులు అక్కడికి వెళ్లారని, డబ్బులు తక్కువ ఇవ్వడం మూలంగా ఆగ్రహంతో అలా చేశారని కుటుంబ సభ్యులు రోడ్డు మీదకు వచ్చి ఆందోళనలు చేశారు. కానీ రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్న అంశాలను బట్టి రాయి దాడి ఖచ్చితమైన పథకం ప్రకారమే జరిగిందని పేర్కొనడంతో సీన్ మారిపోయింది. ఇప్పుడు ఈ దాడి ఆరోపణల నుండి తమకు డ్యామేజీ కాకుండా ఎలా భయటపడాలా ? అన్న ఆలోచనలో తెలుగుదేశం పార్టీ ఉంది. జగన్ మీద దాడి ఘటన తర్వాత గత కొన్ని రోజులుగా ఏపీ రాజకీయాలు అన్నీ ఆ రాయి చుట్టే తిరుగుతుండడం గమనార్హం.

Tags:    
  • Jagan 
  • Chandrababu 
  • Appolitics 
  • YSRCP 
  • TDP 
  • Satish 
  • Jaganstoneattack 
  • Bondauma 
  • Jaganattacked 
  • Apelections 

Similar News

అమెరికా కాంగ్రెస్‌లోకి మరో భారత సంతతి మహిళ.. ఫ్లోరిడాలో పియా దండియా చారిత్రాత్మక విజయం!

2026-11-04 08:52 GMT

పాపం ఏబీవీ : సోషల్ మీడియా హైప్....డిపాజిట్ గల్లంతు

2026-11-04 08:06 GMT

సుప్రీంషాక్‌: దిగొచ్చిన ఎన్నిక‌ల సంఘం.. బిగ్ రిలీఫ్‌!

2026-11-04 08:02 GMT

ఈమె ఏ పార్టీలోచేరినా విజయమే.. లక్ అంటే రమాకుమారిదే..

2026-11-04 08:01 GMT

కొత్త ఏటీఎం స్కాం.. విత్ డ్రా చేసినా డబ్బులు రావు.. జర జాగ్రత్త

2026-11-04 06:09 GMT

2029 ఎన్నికల్లో యువతదే కీలక పాత్ర.. రాజకీయ పార్టీలకు Gen Z కొత్త సవాల్!

2026-11-04 05:40 GMT

ఫుట్‌బాల్ మైదానంలో విషాదం.. గోల్‌కీపర్‌తో ఢీకొని ఆటగాడు మృతి!

2026-11-04 05:07 GMT

ఆదోనిలో జనసేన రెబల్ సంచలనం.. టీడీపీ, వైసీపీ అభ్యర్థులకు షాక్!

2026-11-04 04:56 GMT

అమెరికాలో 3 లక్షలకు పైగా వీసాలు రద్దు.. ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం!

2026-11-04 04:55 GMT

ట్రంప్‌కు అమెరికా ఓటర్ల షాక్.. ప్రతినిధుల సభపై డెమోక్రాట్ల పట్టు

2026-11-04 04:29 GMT

పట్టణ రిజల్ట్...పరిషత్తులలో రిపీట్ ?

2026-11-04 03:38 GMT

మోడీ ఓపెన్ డిబేట్ విత్ రాహుల్...జనం కోరిక కూడానా ?

2026-11-04 01:30 GMT

Copyright @2026

Powered by Blink CMS