ఈమె ఏ పార్టీలోచేరినా విజయమే.. లక్ అంటే రమాకుమారిదే..
| గతంలో టీడీపీ, వైసీపీ నుంచి పోటీచేసి గెలిచి ఇప్పుడు కమలం కండువా కప్పుకొని బరిలోకి దిగినా విజయం ఈమెనే వరించింది. మూడు పార్టీల నుంచి పోటీచేసినా విజయం ఈమెనే వరించడం గమనార్హం.
తినే అదృష్టం ఉండాలి కానీ ఏ మూలన కూర్చున్న మనకు మంచి ముక్కలు పడుతాయి అంటారు.. ఈ సామెతను అక్షరాల నిజం చూసి చూపించింది అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మున్సిపల్ చైర్ పర్సన్ పిల్లా రవికుమారి.. పార్టీలు మారింది.. పోటీచేసింది.. కానీ విజయం మాత్రం ఆమెను వరిస్తూ వచ్చింది. ఏపీలో బలంగా ఉన్న టీడీపీ, జనసేన, వైసీపీలను కాదని బీజేపీ నుంచి బరిలోకి దిగిన ఈమె విజయం సాధించి అబ్బురపరిచింది. గతంలో టీడీపీ, వైసీపీ నుంచి పోటీచేసి గెలిచి ఇప్పుడు కమలం కండువా కప్పుకొని బరిలోకి దిగినా విజయం ఈమెనే వరించింది. మూడు పార్టీల నుంచి పోటీచేసినా విజయం ఈమెనే వరించడం గమనార్హం.
అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మున్సిపాలిటీలో అద్భుతం జరిగింది. ఎలమంచిలి మున్సిపాలిటీ చైర్ పర్సన్ పిల్లా రమాకుమారి అరుదైన ఘనత సాధించారు. 2014లో టీడీపీ నుంచి పోటీచేసిన ఈమె ఘన విజయం సాధించారు. ఆ టైంలో టీడీపీ అధికారంలోకి రావడంతో వ్యూహాత్మకంగా ఆమెకు విజయం దక్కింది. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో ఈమె టీడీపీని కాదని వైసీపీలో చేరారు. 2021లో వైసీపీ తరుఫున విజయం సాధించిన ఆమె మరో రికార్డును నెలకొల్పారు.
ఇక వైసీపీ అధికారం కోల్పోయింది. 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో అధికారం ఎటు ఉంటే నేతలు అటు జంప్ అవుతారు. కానీ ఇదివరకూ టీడీపీలోంచి పోటీచేసిన ఆమెకు వైసీపీ నుంచి బహుశా ఆహ్వానం అందలేదనుకుంటాను. అందుకే వ్యూహాత్మకంగా ఈసారి టీడీపీలో చేరకుండా బీజేపీని ఎంచుకున్నారు.
నిజానికి ఏపీలో బీజేపీ బలం అంత లేదు. టీడీపీ, జనసేన సపోర్టుతోనే ఆ పార్టీ గెలుస్తుంది. అందుకే వ్యూహాత్మకంగా టీడీపీ, జనసేనల్లో ఫుల్ అయిన నేతలతో నిండి కాంపిటీషన్ ఎక్కువగా ఉండడంతో రమాకుమారి బీజేపీలో చేరిపోయారు. పొత్తుల్లో ఎలమంచిలి బీజేపీకి రావడం ఆమెకు కలిసి వచ్చింది.
తాజా ఎన్నికల్లో ఎలమంచిలి మున్సిపాలిటీలో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఈమె 3805 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మూడు పార్టీల నుంచి వరుసగా మూడు సార్లు గెలవడం అంటే మామూలు విషయం కాదు. పార్టీలు మారినా ఆమెకు విజయం మాత్రం దక్కుతూనే ఉండడం విశేషంగా చెప్పొచ్చు. మూడు సార్లు చైర్ పర్సన్ పీఠాన్ని అందరి ఆమోదంతో దక్కించుకోవడం ఓ రికార్డుగా చెప్పొచ్చు. ప్రస్తుతం రమాకుమారి ఈ అరుదైన రికార్డును నెలకొల్పారు.
ఇక రమాకుమారి గతంలో 15 ఏళ్ల పాటు సర్పంచ్ గా పనిచేశారు. ప్రజల్లో ప్రఖ్యాతి పొందారు. జనాలకు చేరువయ్యారు. ఆ అభిమానమే ఆమె ఏ పార్టీలో ఉన్నా ఓట్లు పడేలా చేస్తోంది. ఆమెకు అందలం దక్కేలా చేస్తోంది. నేతలు ఏ పార్టీలో ఉన్నారని కాదు.. జనాలకు ఏం చేశారన్నదే చూస్తారు. అందుకే ఏపీలో బలం లేకున్నా బీజేపీ నుంచి నిలబడి గెలిచారు రమాకుమారి.. ఈమె విజయం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.