• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పాపం ఏబీవీ : సోషల్ మీడియా...

పాపం ఏబీవీ : సోషల్ మీడియా హైప్....డిపాజిట్ గల్లంతు

| ఏబీ వెంకటేశ్వరరావు అంటే ఎంత మందికి తెలుసు. ఇది మొదటి ప్రశ్న. ఆయన గురించి పాత్రికేయులకు అధికార వర్గాలకు పై స్థాయి రాజకీయ వర్గాలకు మాత్రమే తెలుసు.

By - Satya P
Update: 2026-11-04 08:06 GMT

ఏబీ వెంకటేశ్వరరావు అంటే ఎంత మందికి తెలుసు. ఇది మొదటి ప్రశ్న. ఆయన గురించి పాత్రికేయులకు అధికార వర్గాలకు పై స్థాయి రాజకీయ వర్గాలకు మాత్రమే తెలుసు. అయితే ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నపుడు వైసీపీ వారు టార్గెట్ చేయడం వల్ల కొంత వరకూ ఒక సెక్షన్ ఆఫ్ గ్రూప్ ద్వారా మాత్రమే వార్తలలో ఎక్కువగా వినిపించి కనిపించేవారు.. ఆయన రిటైర్ అయిన తరువాత రాజకీయాల మీద ఆసక్తితో ఉన్నారు. వామపక్షాలు ప్రజా సంఘాలతో కలసి వివిధ అంశాల మీద రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తూ కొంత వరకూ మీడియా అటెన్షన్ సంపాదించారు. అలాంటిది ఆయన ఒక్కసారిగా విజయవాడ మేయర్ బరిలో పోటీ చేయడానికి సిద్ధపడడం ఒక పెద్ద సర్ ప్రైజ్. పైగా ఇండిపెండెంట్ గా. రెండు ప్రధాన పార్టీలు బలంగా ఉన్న చోట ఆయన పోటీకి దిగడం పెద్ద రిస్క్ అని అంతా అనుకుంటూనే ఉన్నారు. అయితే సోషల్ మీడియా మాత్రం ఏబీ వెంకటేశ్వరరావు బరిలోకి దిగడంతో మొత్తం సమీకరణలు మారిపోతాయన్నట్లుగా హైప్ క్రియేట్ చేసింది. తీరా రిజల్ట్ చూస్తే ఆయన డిపాజిట్ గల్లంతు అయింది.

ఇద్దరు అభ్యర్థుల మధ్యలో :

ఇక విజయవాడ మేయర్ ఎన్నికల మీద ఎంతో కొంత ఆసక్తి కనిపించడానికి ఏబీవీ రేసులో ఉండడం ఒక కారణం కావచ్చు. అలాగే వంగవీటి రాధాకృష్ణ అవతల వైపు కూటమి నుంచి అభ్యర్థిగా ఉన్నారు. వైసీపీకి అయిదేళ్ళు మేయర్ గా చేసిన రాయన భాగ్యలక్ష్మి ఉన్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన భాగ్యలక్ష్మికి వైసీపీ ఓటు బ్యాంక్ అండగా ఉంది. ఇక రాధాకు పటిష్టమైన కూటమి వెనక ఉంది. మరి ఈ ఇద్దరి మధ్యలో ఏబీవీ ఏ విధంగా రేసులో దూసుకుని వస్తారో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి హైప్ క్రియేట్ చేసిన వారికే తెలియాలి అని అంటున్నారు. అందుకే సోషల్ మీడియాలో ప్రచారం ఒక వైపుగా ఉంటే గ్రౌండ్ లెవెల్ లో రియాలిటీ స్పష్టంగా కనిపించింది. విజయవాడ మేయర్ ఎన్నికల్లో వంగవీటి రాధాకు 2,65,888 ఓట్లు, రాయన భాగ్యలక్ష్మికి 1,35,016 ఓట్లు వస్తే, ఏబీ వెంకటేశ్వరరావుకు 12,642 ఓట్లు మాత్రమే వచ్చాయి.

కీలకం అంటూ :

నిజానికి సోషల్ మీడియాను నమ్ముకుని ఏబీవీ దిగారా అన్నది ఒక చర్చ. అదే నిజం అనుకుంటే ఆయన రిస్క్ ని తానే ఆహ్వానించారనే అంటున్నారు. ఏబీవీ రంగంలోకి దిగడంతోనే ఆయన గెలిచేస్తారు అని సోషల్ మీడియాలో ఒక క్రియేషన్ సాగింది. అంతే కాదు ఆయన అటూ ఇటూ ఓట్లు చీల్చేసి ప్రధాన పార్టీలకు గండి కొడతారు అని కూడా ప్రచారం సాగింది. ఆ తరువాత చూస్తే ఆయనకూ వంగవీటి రాధాకు మధ్యనే పోటీ వైసీపీ మూడవ ప్లేస్ లోకి వెళ్తుందని కూడా ఇంకో ప్రచారం సాగింది. ఒక విధంగా ఏబీవీ అయితే విన్నర్ లేదా రన్నర్ అంటూ సాగిన ప్రచారం అంతా కేవలం ఆన్ లైన్ లోనే ఉంది. కానీ గ్రౌండ్ లెవెల్ లో అంత సీన్ లేదని ఫలితాలు నిరూపించాయి.

డిపాజిట్లు రావాలంటే :

ఇక ఏబీవీ సీనియర్ మోస్ట్ ఐపీఎస్ అధికారి, ఆయనకు అఫీషియల్ సెక్షన్లలో అయితే ప్రముఖ స్థానమే ఉంది. కానీ పాలిటిక్స్ అంటే మాస్ అప్పీల్ ఉండాలి. జనంతో మమేకం కావాలి. ఆయన ఇంకా మరి కొన్నాళ్ళు గ్రౌండ్ వర్క్ చేసి 2029 టార్గెట్ గా చేసుకుని ఎక్కడైనా ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేసి ఉంటే కధ వేరేగా ఉండేదేమో అన్న చర్చ కూడా ఇప్పుడు సాగుతోంది. అలా కాకుండా ఏబీవీ మేయర్ సీటుకు పోటీ చేయడం ముందే కోయిల కూసింది అన్నట్లుగా మారింది. ఇక ఆయనకు వచ్చిన ఓట్లు నికరంగా 12,000 ఓట్లు మాత్రమే. అదే సమయంలో వైసీపీ టీడీపీలకు లక్షల ఓట్లు వచ్చాయి. ఆయన కనుక డిపాజిట్ సాధించాలంటే మొత్తం పోలైన ఓట్లలో 16 శాతం ఓట్లు తెచ్చుకోవాల్సి ఉంది. కానీ వచ్చిన ఓట్లు చూస్తే డిపాజిట్ గల్లంతు అయింది అని అంటున్నారు. ఇది ఏబీవీకి ఊహించని ఫలితం అని అంటున్నా ఆయన సోషల్ మీడియా భ్రమలో పడి పోటీ చేసిన ఫలితం ఇది అని కూడా కామెంట్స్ వస్తున్నాయి.

Tags:    
  • abvenkateswararao 
  • vijayawada 
  • mayorelection 
  • andhrapradeshpolitics 

Similar News

రోజంతా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తే జీతం ఇచ్చేస్తారంట..!

2026-11-06 01:50 GMT

ఆ రెండు జెడ్పీల మీదనే హాట్ డిస్కషన్ !

2026-11-06 01:50 GMT

విజయ్ జగన్ కేటీఆర్...ఒకే ఫ్రేమ్‌ లో !

2026-11-06 01:43 GMT

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

Copyright @2026

Powered by Blink CMS