బలమైన గళం.. టీడీపీకి ప్లస్సు- వైసీపీకి మైనస్సు.. !
రాజకీయాలు చేయడం కాదు.. రాజకీయాల్లో బలమైన గళం వినిపించడమూ పెద్ద రాజకీయమే. ఇది లేకపో తే ఎంత చేసినా ప్రయోజనం ఉండదు.;
రాజకీయాలు చేయడం కాదు.. రాజకీయాల్లో బలమైన గళం వినిపించడమూ పెద్ద రాజకీయమే. ఇది లేకపోతే ఎంత చేసినా ప్రయోజనం ఉండదు. వైసీపీకి ఇది మైనస్ అయితే.. టీడీపీకి ఇదే ప్లస్ అవుతోంది. వైసీపీ హయాంలో ఏం జరిగినా.. టీడీపీ ఊరూ వాడా ప్రచారం చేసింది. ఇది రాజకీయంగా తప్పుబట్టడానికి వీల్లే దు. ఆ మాత్రం సామర్థ్యం.. శక్తి.. బలమైన వాదన వినిపించే అవసరం పార్టీలకు ఉండాలి. దీంతో జగన్ పాలనపై ప్రజల్లో ఒక అభిప్రాయం వ్యక్తమయ్యేలా చేశారు.
కానీ, తాను మంచి చేశానని.. పదే పదే చెప్పే జగన్ దీనిని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లలేక పోయారన్నది పార్టీ నాయకులు కూడా చెబుతున్నమాట. మాజీ మంత్రులు పేర్ని నాని నుంచి గుడివాడ అమర్నాథ్ వరకు.. అందరూ.. తాము చేసిన మంచిని సరైన విధంగా ప్రొజెక్టు చేసుకోలేక పోయామని చెబుతారు. కానీ.. ఒక్కసారి తేడా అంటూ వచ్చేశాక.. జీరో స్థాయి నుంచి తరిగి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వైసీపీలో అదే జరుగుతోంది.
బలమైన గళం వినిపించేవారు ఎవరున్నారన్న విషయంపై పార్టీ నాయకులు ఆరా తీస్తున్నారు. క్షేత్రస్థా యి నుంచి అన్ని వర్గాలను మెప్పించేలా మాట్లాడగల నైపుణ్యం.. వాదనా శక్తి ఉన్నవారిని ప్రోత్సహించా లని భావిస్తున్నారు. అయితే.. వైసీపీ వ్యూహాన్ని ముందుగానే పసిగట్టిన.. టీడీపీ పార్టీలో బలమైన వారిని ముందుకు తీసుకురావడంపై దృష్టి పెట్టింది. బలమైన గళాలను ప్రోత్సహించేందుకు వేట ప్రారంభిం చింది. ఈ క్రమంలోనే కొందరు మహిళా నాయకులకు పగ్గాలు కూడా అప్పగించింది.
నామినేటెడ్ పదవులు పొందిన వారిలోనూన ఇలాంటి ఫైర్ బ్రాండ్స్ ఉన్నారు. ఇక, కావలి గ్రీష్మకు ఎమ్మె ల్సీ ఇవ్వడం వెనుక కూడా.. బలమైన గళమే కారణమన్న వాదన వినిపించిన విషయం తెలిసిందే. అయి తే.. ఈ వ్యవహారంపై ఇప్పుడే కళ్లు తెరిచిన వైసీపీ ఎవరున్నారా? అని వెతకం మొదలు పెట్టింది. కానీ.. వాస్తవానికి వైసీపీలో నాయకుల కొరత లేకున్నా.. పద్ధతిగా మాట్లాడే నాయకుల కొరతే ఎక్కువగా ఉంది. సో.. ఆ దిశగా అడుగులు వేస్తే వేసి.. నాయకులకు పద్ధతి బోధిస్తే బెటర్ అనే సూచనలు వస్తున్నాయి.