కో ఆర్డినేష‌న్‌తో టీడీపీలో పొలిటిక‌ల్ మంట‌లు ఆరేనా ..!

రాష్ట్రంలో కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో పరిస్థితులు ఒకింత ఇబ్బందికరంగా ఉంటున్నాయి.;

Update: 2025-12-03 11:30 GMT

రాష్ట్రంలో కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో పరిస్థితులు ఒకింత ఇబ్బందికరంగా ఉంటున్నాయి. ఒకే ఒరలో రెండు కత్తులు అన్న సామెత కొన్ని కొన్ని నియోజకవర్గాలలో స్పష్టంగా కనిపిస్తుంది. గత ఎన్నికలకు ముందు టికెట్లు త్యాగం చేసిన వారు.. అదేవిధంగా టికెట్లు దక్కని వారు కూడా అసంతృప్తితో ఉన్నారు. పైగా తమకు న్యాయం జరగలేదన్న ఆవేదనలోనూ వారు కనిపిస్తున్నారు. ఇది ఎలా ఉన్నప్పటికీ ప్రస్తుతం చిలకలూరిపేట, మైలవరం అదేవిధంగా పలు నియోజకవర్గాల్లో టిడిపిలో రెండు అధికారిక కేంద్రాలు ఏర్పడ్డాయి అన్నది వాస్తవం.

ఈ విషయం పార్టీలోనూ అటు అధికార వర్గాల్లో కూడా చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఇటు ఎమ్మెల్యే అటు టికెట్ త్యాగం చేసిన నాయకులు కూడా అధికారులపై ఒత్తిడి తీసుకురావడం.. పనులు చేయించుకోవడం అనేది కామన్ గా మారింది. దీనివల్ల అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అన్నది ఇటీవల సీఎం చంద్రబాబు దృష్టికి కూడా వచ్చింది. నిజానికి ఎమ్మెల్యే చెప్పినట్టు అధికారులు వినడం అనేది కామ‌న్‌. అయితే గతంలో ఎమ్మెల్యేలుగా చేసిన వారు గత ఎన్నికల్లో టికెట్ కోల్పోయిన వారు ఇప్పుడు అదే అధికారులపై ఒత్తిడి తీసుకురావడం కూడా ఇటీవల కాలంలో కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో స్పష్టంగా కనిపించింది.

ఇది ఇట్లా ఉంటే మరోవైపు పార్టీపరంగా కార్యక్రమాలు నిర్వహించే విషయంలో కూడా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. ఎమ్మెల్యే అనుచరులు మాజీ ఎమ్మెల్యే అనుచ‌రులు అన్నట్టుగా రెండు వర్గాలుగా రెండు గ్రూపులుగా పార్టీ నాయకులు మారిపోయారు. దీనివల్ల పార్టీ కార్యక్రమాలకు బలమైన ప్రాతిపదిగా ఉన్నప్పటికీ బలమైన నాయకత్వం అయితే కనిపించడం లేదు. క్షేత్రస్థాయిలో ఈ తరహా పరిస్థితులు కొనసాగితే బలమైన కేడర్ బలహీనమయ్యే అవకాశాలు ఉంటాయి అన్నది పరిశీలకులు చెబుతున్న మాట.

ఇది ఒక రకంగా పార్టీలకు ప్రభుత్వాన్ని కూడా ఇబ్బందికరంగానే మారుతుందని వారు అంచనా వేస్తున్నారు. వచ్చే ఎన్నికలలోపే ఈ విషయాన్ని పరిష్కరించి అంతర్గతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత పార్టీ అధిష్టానం తీసుకోవాలని చెబుతున్నారు. సమన్వయం చేసుకునే బాధ్యత ముఖ్యంగా నాయకులపై పెట్టాలని కూడా చెబుతున్నారు. లేకపోతే ఇబ్బందికర పరిస్థితులు తప్పవని హెచ్చరిస్తున్నారు. మరి ఏం చేస్తారు అనేది చూడాలి. ఇప్పటికైతే నివురు గప్పిన నిప్పులా అయితే పరిస్థితి ఉందన్నది వాస్తవం.

Tags:    

Similar News