మహానాడు వేదికగా.. వైసీపీకి షాకిస్తున్నారట.. !
ఈ నెల 27-29 మధ్య అత్యంత వైభవంగా జరగనున్న టీడీపీ పసుపు పండగ మహానాడు అనేక సంచలనాలకు వేదిక కానుందని పార్టీ నాయకులు చెబుతున్నారు.;
ఈ నెల 27-29 మధ్య అత్యంత వైభవంగా జరగనున్న టీడీపీ పసుపు పండగ మహానాడు అనేక సంచలనాలకు వేదిక కానుందని పార్టీ నాయకులు చెబుతున్నారు. పార్టీకి దశ దిశ చెప్పడంతో పాటు.. మరిన్ని వ్యూ హాత్మక నిర్ణయాలు కూడా ఉంటాయని అంటున్నారు. దీనిలో ప్రధానంగా వైసీపీకి షాకిచ్చే పరిణామాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని తెలుస్తోంది. ఇప్పటి వరకు .. వైసీపీ నుంచి వచ్చిన వారిని టీడీపీ చేర్చుకు న్నా.. మహానాడు వేదికగా దీనికి మరింత ఊపు తీసుకురానున్నట్టు తెలుస్తోంది.
పైగా.. వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లా కడపలోనే ఈ దఫా మహానాడును నిర్వహిస్తున్నారు. దీని ద్వారా వైసీపీకి భారీ సంకేతాలు ఇవ్వనున్నారు. తమకు ఎదురు లేదని.. ఏ జిల్లాలో అయినా.. తమ సైకిల్ పరు గులు పెడుతుందన్న సంకేతాలు ఇవ్వనున్నారు. అదేసమయంలో వైసీపీ నుంచి వచ్చే నాయకులకు ఈ వేదికగానే కండువా కప్పనున్నట్టు తెలుస్తోంది. మైదుకూరు నియోజకవర్గంలో నాయకులు కొందరు ఇప్పటికే రెడీ అయ్యారని తమ్ముళ్లు చెబుతున్నారు.
అలాగే, జగన్ మేనమామ ప్రాతినిధ్యం వహించిన కమలాపురం నియోజకవర్గం నుంచి కూడా వైసీపీ నాయ కులు, కార్యకర్తలను చేర్చుకునేందుకు పార్టీ వర్గాలు రెడీ అయ్యాయి. దీనికి సంబంధించి మండల స్థాయి లో మంత్రాంగం ఊపందుకుంది. దీనికి సంబంధించి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి కీలక బాధ్యతలు తీసుకున్నారని సమాచారం. ఆయనే అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. పార్టీలో చేరికల నుంచి నాయకుల సమీకరణ వరకు శ్రీనివాసరెడ్డి చూస్తున్నారు.
ఇక, పార్టీలోనూ కీలక నిర్ణయాలు తీసుకుంటారని తెలిసింది. టీడీపీ యువజన విభాగాన్ని మరింత బలోపే తం చేయడంతోపాటు.. కీలక యువ నాయకులకు పార్టీలో బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం. ఈ జాబి తాలో పరిటాల శ్రీరాం వంటి నాయకులు కూడా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికలే లక్ష్యం గా ఇప్పటి నుంచి యువతను చేరువ చేసుకోవడం. . వైసీపీని వ్యూహాత్మకంగా దెబ్బ కొట్టడం అనే లక్ష్యాలు గా టీడీపీ మహానాడుకు శ్రీకారం చుడుతున్నారని కీలక నాయకుడు ఒకరు చెప్పారు.