ఆ నలుగురు పోతే.. ఈ నలుగురు రెడీ.. టీ కాంగ్రెస్ లెక్కలు
కానీ, పోర్ట్‌ఫోలియోల్లో తేడా కొట్టినా.. వారికి హోదాకు తగిన విధంగా పార్టీ స్పందించకపోయినా.. వారు పార్టీ మారడం ఖాయమ నే చర్చ జరుగుతోంది.;
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు జంపింగుల భయం పట్టుకుందా? కీలక నేతలు ఆశించిన పదవులు దక్కక పోవడంతో వారు ఎగస్పార్టీగా మారే అవకాశం ఉందా? సీఎల్పీని చీల్చే ఛాన్స్ కూడా ఉందా? ఇది కుదరకపోతే.. పార్టీ నుంచి బయటకు వచ్చేస్తారా? ఇవీ.. ఇప్పుడు జరుగుతున్న చర్చలు. ఎందుకంటే.. ముఖ్య నాయకులకు కీలకమైన పదవులు దక్కలేదు .. దీంతో వారంతా ఆవేదనతో ఉన్నారు. అవకాశం కోసం చూస్తున్నారు.
ఈ జాబితాలో దాదాపు 10 - 12 మంది నాయకులు ఉన్నట్టు అధిష్టానానికి నివేదికలు అందాయి. వారిలో సగం మందికి మంత్రి వర్గంలో చోటులభించేలా ప్రయత్నాలు సాగుతున్నాయి. కానీ, పోర్ట్‌ఫోలియోల్లో తేడా కొట్టినా.. వారికి హోదాకు తగిన విధంగా పార్టీ స్పందించకపోయినా.. వారు పార్టీ మారడం ఖాయమ నే చర్చ జరుగుతోంది. కొందరు పార్టీని చీల్చే అవకాశం కూడా ఉందనే హెచ్చరికలు కూడా వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా.. పక్కా ప్లాన్‌తో రెడీగా ఉంది. పోయిన వారు పోయినా.. వచ్చే వారిని వెతికి పట్టుకునేందుకు కండువాలు కప్పేందుకు కూడా సర్వం సిద్ధమైపోయినట్టు సమాచారం. తమకు తెలిసిన వారిని.. తమకు టచ్‌లో ఉన్నవారిని అస్సలు వదులు కోవద్దని.. పార్టీ అధిష్టానం నుంచి కీలక సూచనలు వచ్చాయి. అయితే.. ప్రస్తుతం నివురుగప్పిన నిప్పులా ఉన్న పరిస్థితి ఎవరికీ అందడం లేదు.
కానీ, ఏక్షణానైనా.. ఏమైనా జరగొచ్చన్న సంకేతాలు మాత్రం వస్తున్నాయి. దీంతో ఆ నలుగురు పోయినా.. మరో నలుగురు నాయకులను తెచ్చుకునేందుకు.. వారికికండువాలు కప్పేందుకు, ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు పార్టీ సమాయత్తంగానే ఉందని అంటున్నారు ముఖ్యనాయకులు. ఇవన్నీ సహజమని.. అనేక రాష్ట్రాల్లో ఎదురు దెబ్బలు తగులుతున్నాయని.. కర్ణాటక కీలక నాయకుడు ఒకరు వ్యాఖ్యానించడం.. ఆసక్తిగా మారింది. మరం ఏం జరుగుతుందో చూడాలి.