బిగ్ బ్రేకింగ్: ప్రపంచ విజేతలకు టాటా బంపర్ ఆఫర్!
దశాబ్దాలుగా ఎదురుచూసిన క్షణం వచ్చేసింది. ఐసీసీ మహిళల ప్రపంచ కప్–2025లో చరిత్రను తిరగరాసిన భారత మహిళా క్రికెట్ జట్టు ఇప్పుడు దేశ గర్వకారణమైంది.;
దశాబ్దాలుగా ఎదురుచూసిన క్షణం వచ్చేసింది. ఐసీసీ మహిళల ప్రపంచ కప్–2025లో చరిత్రను తిరగరాసిన భారత మహిళా క్రికెట్ జట్టు ఇప్పుడు దేశ గర్వకారణమైంది. దక్షిణాఫ్రికాతో ఉత్కంఠభరిత ఫైనల్‌లో అద్భుత విజయం సాధించి, తొలిసారిగా ప్రపంచ కప్ ట్రోఫీని ఎగరేసిన భారత గర్ల్స్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది.
లీగ్ దశలో వరుస పరాజయాలను ఎదుర్కొన్నప్పటికీ, జట్టు తిరిగి పుంజుకొని అజేయ ధైర్యం, పోరాట స్పూర్తిని చూపించింది. 2005, 2017లో చేజారిన కలను 2025లో నిజం చేసింది.
* ప్రోత్సాహాల వర్షం – బహుమతుల వెల్లువ
ఈ చారిత్రాత్మక విజయంపై దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే బహుమతుల పేటిక కూడా తెరుచుకుంది.
* బీసీసీఐ: ₹51 కోట్ల భారీ నజరానా ప్రకటించింది
* ఐసీసీ: ₹39 కోట్ల ప్రైజ్ మనీని విజేతలకు అందజేసింది
* జువెలరీ బ్రాండ్: ప్రతి ఆటగాళ్లకు ప్రత్యేక నెక్లెస్‌లు గిఫ్ట్‌గా
* ప్రధానమంత్రి మోదీ: స్వగృహంలో విందుతో పాటు వ్యక్తిగతంగా అభినందించారు
* రాష్ట్ర ప్రభుత్వాలు: క్రాంతి గౌడ్, రాధా యాదవ్‌లకు ఒక్కొక్కరికి ₹1 కోటి చొప్పున బహుమతి + ప్రభుత్వ ఉద్యోగాలు
* టాటా మోటార్స్ నుంచి గోల్డెన్ సర్ప్రైజ్!
భారత విజయాన్ని గౌరవిస్తూ టాటా మోటార్స్ సెన్సేషనల్ గిఫ్ట్ ప్రకటించింది. వరల్డ్ కప్ జట్టులోని ప్రతి ప్లేయర్‌కి కొత్తగా రీ-లాంచ్ అవుతున్న “సియెర్రా ఎస్‌యూవీ” టాప్ ఎండ్ మోడల్‌ను కానుకగా ఇస్తోంది. ఈ నెల 25న మార్కెట్లోకి రానున్న సియెర్రా మోడల్ ను భారత జట్టుకు అంకితం చేస్తామని కంపెనీ ప్రకటించింది. “సియెర్రా లా… వీళ్లు కూడా స్ట్రాంగ్, స్టైలిష్, స్టన్నింగ్!” అని టాటా మోటార్స్ ప్రతినిధి గర్వంగా పేర్కొన్నారు.
* మహిళా క్రికెట్‌కి కొత్త దశ
ఈ విజయం తర్వాత భారత మహిళల క్రికెట్ విలువ అమాంతం పెరిగింది.
స్పాన్సర్లు, ఎండార్స్‌మెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో భారత స్థానం మరింత బలపడింది.
క్రికెట్ విశ్లేషకుల మాటల్లో “ఈ గెలుపు కేవలం ట్రోఫీ కాదు… ఇది భారత మహిళా క్రికెట్‌కి కొత్త యుగం ఆరంభం.” అని ప్రశంసించారు.
* భారత గర్ల్స్ రాసిన చరిత్ర
ఈసారి మహిళా టీమిండియా కేవలం మ్యాచ్ గెలుచుకోలేదు, దేశ హృదయాలను గెలుచుకుంది. తమ కష్టాన్ని, పట్టుదలని, ప్రతిభను ప్రపంచానికి చూపించి భారత గౌరవాన్ని నిలబెట్టారు. వీళ్లు ఆరంభించిన ఈ విజయయాత్ర ఇక్కడితో ఆగదనే నమ్మకం దేశమంతా ఉంచింది!