తానా ఫ్లాప్...నాట్స్ హిట్...ఇదే చర్చ!
ఇక తానా కన్వెన్షన్ సెంటర్ అంటేనే టీడీపీ మంత్రులు టీడీపీ ఎమ్మెల్యేలతో నిండిపోతుంది, ఇక వీసా ఉన్న ఒక్కరూ తానాకు అలా హాజరైపోతూంటారు.;

తానా ఒక వైపు నాట్స్ మరొకవైపు అమెరికా ప్రవాసంలో తెలుగుదనం ఎంతో కొంత అయినా చూసుకుందామని వెలసిన సంస్థలు ఈ రెండింటి మధ్య పోటీ కాదు కానీ కాలగమనంలో అలా పోటా పోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తూ తెలుగు వారిని సెలిబ్రిటీలను సత్కరించడం ఒక ఆనవాయితీగా మారింది. ఈసారి చూస్తే కనుక తానా నాట్స్ పోటీ పడినట్లే కార్యక్రమాలు అమెరికాలో జరిగాయి. అందులో తానాది ఫ్లాప్ షో అని నాట్స్ ది సూపర్ హిట్ అని చర్చ అయితే నడుస్తోంది.
మరి ఆ విశేషాలు ఏమిటి అన్నది చూస్తే కనుక తానా అంటేనే టీడీపీకి దాని అనుబంధ సంస్థలకు ఎన్నారైలకు ఒక పండుగ వాతావరణం ఉంటుంది పైపెచ్చు ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఉండగా ఈసారి తానా ఉత్సవాలు జరిగాయి.
ఇక తానా కన్వెన్షన్ సెంటర్ అంటేనే టీడీపీ మంత్రులు టీడీపీ ఎమ్మెల్యేలతో నిండిపోతుంది, ఇక వీసా ఉన్న ఒక్కరూ తానాకు అలా హాజరైపోతూంటారు. ఇక దానికి పోటీగా ఇపుడు నాట్స్ కూడా ఉంది. ఇక తెలుగు నాట నుంచి వచ్చే వారు అంతా ఒకరోజు తానాలో కనిపించి మరో రోజు నాట్స్ లో కనిపించి అలా రెండు చోట్లా సందడి చేస్తూ ఉంటారు.
ఇక తానాకి చూస్తే మెంబర్ షిప్ ఎక్కువగా ఉంటుంది. అలా డబ్బులు ఇచ్చేవారు కూడా ఎక్కువగా ఉంటారు. అయితే ఎందుకో ఈసారి తానాలో సెలబ్రేషన్స్ కళ అయితే పెద్దగా కనిపించలేదు అని అంటున్నారు. ఇక ఈసారి తానాలో ముఖ్య అతిథిగా ఏపీ డిప్యూటీ స్పీకర్ అందరి చేతా ట్రిపుల్ ఆర్ గా పిలవబడే రఘురామ క్రిష్ణంరాజు హాజరయ్యారు.
మరో వైపు చూస్తే నందమూరి బాలక్రిష్ణ కూడా వచ్చారు కానీ ఆయన నాట్స్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు అని అంటున్నారు. ఇక నాట్స్ నిర్వహించిన వేడుకలకు పెద్ద ఎత్తున సెలబ్రిటీస్ వచ్చారు కానీ అక్కడ మెంబర్స్ తక్కువగా ఉన్నారు.
ఇక ఏపీ పాలిటిక్స్ లో ప్రత్యేకించి టీడీపీలో తానా ప్రభావం చాలా ఎక్కువగానే పడింది అని అంటున్నారు. చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమావేశానికి చాలా మంది గైర్ హాజరు అయ్యారు. ఎమ్మెల్యేలు మంత్రులు అంతా ప్రజల దగ్గరగా ఉండాలని బాబు ఈ సమావేశంలో కోరుతూ సుపరిపాలనలో తొలి అడుగు అని ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
అయితే ఇదే సమావేశంలో తానా నాట్స్ అని వెళ్లారో ఇక మీకు టాటా బై బై అని బాబు తీవ్ర స్వరంతో పార్టీ సమావేశంలో హెచ్చరించే సరికి తానా సభలకు వచ్చిన వారు అంతా వెంటనే ఇండియా ఫ్లైట్ ఎక్కేశారు అని అంటున్నారు. దాత్నో తానా సభలలో చాలా మంది పాల్గొనకుండానే ఇలా జరిగింది అని అంటున్నారు. దీంతో తానా కాస్తా కళా విహీనంగా మారిందని గత సారి వచ్చిన డబ్బులు కూడా ఈసారి ఫండ్ రైజింగ్ ద్వారా రాలేదని అంటున్నారు.
ఇక తానా విషయం తీసుకుంటే ఎఫ్ బీఐ నిఘాలో తానా ఉందని పెద్ద ఎత్తున ప్రచారం సాగడం వల్ల కూడా ఈసారి అనుకున్న స్థాయిలో డబ్బులు పోగుపడలేదని డోనర్లు ఎవరూ ఇవ్వడానికి ఆసక్తి చూపించలేదని అంటున్నారు. మరి ఈ కారణమో మరేమిటో తెలియదు కానీ సినీ సెలిబ్రిటీస్ కూడా తానా సభలలో ఈసారి తళుక్కుమనిపించలేదని కూడా అంటున్నారు.
అలాగే తానా సభలకు హాజరైన వారు కూడా అక్కడ కార్యక్రమాలు ఏవీ పెద్దగా బాగులేవని అంటున్నారుట. టాలీవుడ్ టాప్ సెలిబ్రిటీస్ కూడా ఈసారి తానా వైపు పెద్దగా చూడలేదని అంటున్నారు. దాంతో గత కాలం నటులే ఎక్కువ మంది కనిపించారు అన్నది కూడా ఉంది. అయితే ఎఫ్ బీఐ కి భయపడి వెళ్ళలేదా లేదా టీడీపీ అధినాయకత్వం హెచ్చరికలు పనిచేసి వెళ్లలేదా అన్న దాని మీద అయితే ఎన్నారైలలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.
ఒకవేళ నారా లోకేష్ తానా సభలకు వచ్చి ఉంటే ప్రభుత్వ అధికారులు కూడా పెద్ద ఎత్తున వచ్చి ఉండేవారని చెప్పుకుంటున్నారు. లోకేష్ వంటి వారి రాకపోవడం వల్ల ఎవరూ ఈ వైపు చూడలేదని అంటున్నారు. మామూలుగా చూస్తే కనుక ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఉంటే తానా నాట్స్ సభలకు పెద్ద ఎత్తూ సెలిబ్రిటీస్ తరలి వస్తారు అన్నది ఎప్పటి నుంచో ఉంది. ఈసారి మాత్రం ఆ ఆనవాయితీ మారింది. దాంతో తానాలో ఆ తళుకు లేకుండా పోయింది అన్నదే చర్చగా ముందుకు వస్తోంది.
ఒక వేళ ప్రభుత్వ పెద్దలు బిగ్ షాట్స్ కనుక అటెండ్ అయి ఉంటే వారితో పాటే అధికారులూ క్యూ కడతారని అలా వారి స్నేహితులు బంధువులు అందరితో తానాలో అతి పెద్ద క్యూలు కనిపించి కిటకిటలాడేది అని అంటున్నారు. ఈసారి తానాను గతసారి తానాను కొందరు పోల్చి చూస్తున్నారు. గతసారి అయితే ఎక్కువగా జనాలు రావడంతో భోజనాల వద్ద సైతం కొట్టుకునే పరిస్థితి ఏర్పడింది అని అంటున్నారు
ఆ రద్దీ ఆ సందడి ఈసారి ఎక్కడిది అన్నది కూడా అంతా ప్రశ్నించుకుంటున్నారు. మరి ఈసారి అలాంటి సన్నివేశాలు ఏమైనా తానాలో చోటు చేసుకున్నాయో ఏమో తెలియదు కానీ ఆ తరహా పరిస్థితి ఏమీ లేదని అంటున్నారు. గొడవలు ఏమైనా జరిగే వీలు లేదని కూడా అంటున్నారు. అమెరికా ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్ గా ఉందని అందులో నాన్ ఇమ్మిగ్రెంట్స్ వీసా వాళ్ళు పెద్ద ఎత్తున వస్తే ఎక్కడ ఆ ఫోటోలు వీడియోలు బయటకు వస్తాయో అని ముందే ఆలోచించుకుని చాలా మంది తానాకు ఈసారి డుమ్మా కొట్టారు అని అంటున్నారు.
ఇక్కడ మరో పోలిక కూడా చెప్పాలని అంటున్నారు. గతంలో తానా సభలకు వెళ్తే తాను అటెండ్ అయ్యామని ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో పెట్టి చాలా మంది హుషార్ చేసేవారు. ఈసారి మాత్రం అలాంటి ఫోటోలు వీడియోలు కూడా కనిపించకపోవడంతో చాలా జాగ్రత్తగానే అంతా జరిగింది అంటున్నారు.
మొత్తానికి తానా అంటే ఒకనాడు ఉంటే ఉత్సాహం కేరింతలు సందడి గొడవలు కేకలు అరుపులు ఈసారి లేదుట. అంతా గప్ చుప్ గానే సాగింది. పైగా బిగ్ షాట్స్ కూడా ఆ వైపుగా వెళ్లకపోవడం ఒక పెద్ద లోటుగా ఉంది. మరి ఇదంతా దేని ప్రభావంలో అన్నది అయితే ఎన్నారైలకు అంతుబట్టడం లేదుట. ఈ నేపథ్యంలో నాట్స్ మాత్రం హిట్ అయింది అన్నదే వినిపిస్తున్న టాక్ మరి.